ఇండియాలో టెస్లా బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్ట‌రీ

ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లా ప్రస్తుతం తాను తయారు చేస్తున్న బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలను ఇండియాలో సెట్ చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి టెస్లా కంపెనీ నుండి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.  ఇండియాలో టెస్లా స్టోరేజ్ సిస్టం:  బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), సౌర అలాగే గాలి వంటి రెన్యువల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీ స్టోర్ చేయడానికి, అంతేకాకుండా ఎనర్జీ నిజానికి ఎక్కువగా అవసరమైనప్పుడు విడుదల చేయడానికి వీలు కల్పించే డివైసెస్ అని […]

Share:

ప్రపంచ దిగ్గజ కంపెనీ టెస్లా ప్రస్తుతం తాను తయారు చేస్తున్న బ్యాటరీ స్టోరేజ్ సిస్టంలను ఇండియాలో సెట్ చేయాలని ప్రణాళిక వేస్తున్నట్లు తెలుస్తోంది. దీని గురించి టెస్లా కంపెనీ నుండి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. 

ఇండియాలో టెస్లా స్టోరేజ్ సిస్టం: 

బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS), సౌర అలాగే గాలి వంటి రెన్యువల్ ఎనర్జీ నుంచి వచ్చే ఎనర్జీ స్టోర్ చేయడానికి, అంతేకాకుండా ఎనర్జీ నిజానికి ఎక్కువగా అవసరమైనప్పుడు విడుదల చేయడానికి వీలు కల్పించే డివైసెస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి డివైసెస్ ను మన భారతదేశానికి పరిచయం చేయాలని చూస్తున్నట్లు, టెస్లా కంపెనీ ద్వారా సంప్రదింపులు జరుపుతున్న వ్యక్తులు ద్వారా వెల్లడించడం జరిగింది. ఈ క్రమంలోనే భారత దేశంలో ఒక ఫ్యాక్టరీ నిర్మించాలని, భారతదేశంలో తమ డివైసెస్ ను పరిచయం చేయాలని, మస్క్ ఆలోచిస్తున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. 

టెస్లా భారతదేశంలో ఒక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు, దాదాపు $24,000 ధరలో అందుబాటులో ఉండే కారును నిర్మించడానికి వారాలపాటు చర్చలు జరుపుతోంది, చర్చలను నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యవేక్షించారు. అయితే దీని గురించిన మరింత సమాచారం ప్రస్తుతానికి అందుబాటులో లేనట్లు చెప్పుకోవాలి. 

న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన సమావేశాలలో, టెస్లా తన “పవర్‌వాల్” బ్యాటరీ స్టోరేజ్ డివైసెస్ భారత దేశంలో పరిచయం చేయాలని ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇంకా గోప్యంగానే ఉన్నాయి. టెస్లా బ్యాటరీ స్టోరేజ్ కు సంబంధించి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి అనేక విధాలుగా కోరినప్పటికీ, ఇవి అందుబాటులో ఉండవని భారతీయ అధికారులు తెలియజేసినట్లు ఒక వర్గాలు తెలిపాయి. అయితే అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసే వారికి సబ్సిడీలను అందించడం ద్వారా కంపెనీకి న్యాయమైన వ్యాపార వెసులుబాటును రూపొందించడంలో ప్రభుత్వం సహాయపడుతుందని వారు తెలిపారు. 

ఇంకా ఏం చెప్పలేం: 

టెస్లా-భారత ప్రభుత్వం రెండూ ఈ ప్రతిపాదనపై ఆసక్తిగా ఉన్నప్పటికీ, న్యూఢిల్లీ దీనిని సమీక్షిస్తూనే ఉంది, ఈ ప్రణాళిక సాకారం అవుతుందా అనేది ఖచ్చితంగా తెలియదని ఒక నివేదిక తెలిపింది. పవర్‌వాల్ ప్రతిపాదన భారతదేశంలో ప్రవేశ పెట్టేందుకు U.S. కంపెనీ ప్రణాళికలలో భాగమని, EVలను మించి ఆలోచిస్తుందని, మరో నివేదిక పేర్కొంది. అయితే మరోవైపు టెస్లా తన బ్యాటరీ స్టోరేజ్ డివైసెస్ ను డెవలప్ చేసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పలు వార్తలు వినిపిస్తున్నప్పటికీ దీని గురించి, టెస్లా, భారత ప్రభుత్వ ప్రధాన ప్రతినిధి, అదే విధంగా వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించ లేనట్లు తెలుస్తోంది. భారతదేశం పట్టణాలు మరియు గ్రామాలకు విద్యుత్ సరఫరాలను పెంచింది, అయితే డిమాండ్ పెరగడంతో ఇప్పటికీ ఒక్కోసారి విద్యుత్ కొరతను ఎదుర్కొంటోంది. నిజానికి విద్యుత్ నిల్వ చేసే ప్రక్రియ నిజానికి ఖర్చుతో కూడుకున్నది. అయితే భారత దేశంలో ఎక్కువగా విద్యుత్ సరఫరా బొగ్గు విభాగం పై ఆధారపడి ఉంటుంది. 

భారీ ధర: 

టెస్లా తన బ్యాటరీ స్టోరేజ్ డివైసెస్ ధరను తగ్గించడానికి పని చేయాల్సి ఉంటుందని భారతీయ అధికారులు తెలియజేసారు, నివేదిక చెప్తున్న దాని ప్రకారం, డిమాండ్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంతో మార్కెట్‌ను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం సహాయపడుతుందని పేర్కొంది.

పవర్‌వాల్ కాలిఫోర్నియాలో $5,500 కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, సోలార్ ప్యానెల్‌ల కోసం అదనపు ఖర్చులు ఉంటాయి. ఇది U.S. ఫెడరల్ టాక్స్ క్రెడిట్‌లు, సౌర, పవర్ నిల్వ కోసం స్థానిక రాష్ట్ర మరియు యుటిలిటీ ఇన్సెంటివ్‌ల అర్హత కూడా లభిస్తుంది మరి. హ్యూస్టన్, డల్లాస్‌లోని పవర్‌వాల్ వినియోగదారులు, ఇటీవల, పవర్ వినియోగం అనంతరం మిగిలిన పవర్ స్టోరేజ్ ను తిరిగి టెక్సాస్ ఎలక్ట్రిక్ గ్రిడ్‌కు అమ్మేందుకు మక్కువ చూపించినట్లు సమాచారం.