Amazon: అమెజాన్​  టీవీ, స్మార్ట్​ఫోన్ ​సేల్స్​లో టాప్​3 లో తెలంగాణ

స్మార్ట్​ఫోన్​లు, టెలివిజన్​ సేల్స్​లో తెలంగాణ(Telangana) టాప్​3 మార్కెట్లలో నిలుస్తోందని అమెజాన్(Amazon)​ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్​ఫోన్స్ అండ్​ టెలివిజన్స్​) రంజిత్​ బాబు(Ranjith Babu) వెల్లడించారు. ప్రస్తుత సీజన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌(Great Indian Festival)ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (స్మార్ట్‌ఫోన్లు, టీవీలు) రంజిత్‌ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్‌ […]

Share:

స్మార్ట్​ఫోన్​లు, టెలివిజన్​ సేల్స్​లో తెలంగాణ(Telangana) టాప్​3 మార్కెట్లలో నిలుస్తోందని అమెజాన్(Amazon)​ ఇండియా డైరెక్టర్ (స్మార్ట్​ఫోన్స్ అండ్​ టెలివిజన్స్​) రంజిత్​ బాబు(Ranjith Babu) వెల్లడించారు.

ప్రస్తుత సీజన్‌లో గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌(Great Indian Festival)ను ప్రారంభించిన తొలి 48 గంటల్లోనే రికార్డు స్థాయిలో 9.5 కోట్ల మంది పైచిలుకు కస్టమర్లు తమ పోర్టల్‌ను సందర్శించినట్లు ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ (స్మార్ట్‌ఫోన్లు, టీవీలు) రంజిత్‌ బాబు తెలిపారు. దేశవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీల విక్రయాలకు సంబంధించి తమ టాప్‌ 3 మార్కెట్లలో రాష్ట్రాలపరంగా తెలంగాణ, నగరాల వారీగా హైదరాబాద్‌ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. శామ్​సంగ్​, వన్​ప్లస్​, రియల్​మి, నార్జో, షియోమి, ఐకూ స్మార్ట్​ఫోన్​  బ్రాండ్లను, సోనీ, శామ్​సంగ్​, ఎల్​జీ టెలివిజన్​ బ్రాండ్లను తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు. 

గ్రేట్​ఇండియన్​ ఫెస్టివల్​ ఎక్స్​ట్రా హ్యాపీనెస్​  డేస్​ సందర్భంగా అమెజాన్(Amazon)​ ​ ఎక్స్​పీరియన్స్​ ఎరినా(Erina) పేరుతో ఒక ఈవెంట్​ను ఐఐటీ హైదరాబాద్​లో నిర్వహించారు. ఈ సీజన్‌లో తెలంగాణలో టీవీలకు రెండు రెట్లు డిమాండ్‌ కనిపించగా, 5జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు 60 శాతం పెరిగాయని రంజిత్‌ బాబు చెప్పారు. ఎక్కువగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు, పెద్ద స్క్రీన్‌ టీవీల వైపు కస్టమర్లు మొగ్గుచూపుతున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి తమ ప్లాట్‌ఫాంపై 50,000 పైచిలుకు విక్రేతలు ఉన్నారని  ఆయన చెప్పారు. ఇందులో వివిధ ఉత్పత్తులను ప్రదర్శించే జోన్లను ఏర్పాటు చేశారు. మరికొన్నాళ్లు కొనసాగే ఫెస్టివల్‌లో బ్యాంకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ఎక్సే్చంజ్, నో కాస్ట్‌ ఈఎంఐ వంటి ఆకర్షణీయ ఆఫర్లు ఇస్తున్నట్లు రంజిత్‌ బాబు(Ranjith Babu)  వివరించారు.

అమెజాన్​(Amazon)​ అందించే ప్రొడక్టులపై మీడియాతోపాటు, ఇన్​ఫ్లుయెన్సర్లు, కస్టమర్లకు అవగాహన పెంచేలా ఈ అమెజాన్​ ఎక్స్​పీరియన్స్​ ఎరినా(Amazon Experience Arena)ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.  తాజా సీజన్​లో తమ సేల్స్​ జోరుగా సాగుతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్​కు తెలంగాణ మార్కెట్(Telangana market)​ కీలకమైనదని వివరించారు. ఆరు పెద్ద ఫుల్​ఫిల్​మెంట్​ సెంటర్లు, ఒక సార్టేషన్​ సెంటర్ ​తెలంగాణలో పనిచేస్తున్నాయని అన్నారు. డిజిట్​ సహకారంతో స్మార్ట్​ఫోన్​ జీనీ పేరుతో ఒక ఫీచర్​ తెచ్చామని చెబుతూ, దీంతో తమకు సరిపోయే స్మార్ట్​ఫోన్​ను ఎంపిక చేసుకోవడం కస్టమర్లకు సులభమవుతుందన్నారు. 

అమెజాన్ ప్రపంచంలో అత్యంత అధునాతన సరఫరా నెట్‌వర్క్‌లలో ఒకటి మరియు భారతదేశంలో అమ్మకందారులు అమెజాన్(Amazon)  యొక్క నైపుణ్యం, సరఫరా, విశ్వసనీయ దేశవ్యాప్త డెలివరీ మరియు వినియోగదారుల సేవ నుండి లాభం పొందుతున్నారు. తెలంగాణలోని ప్రత్యేకమైన సరఫరా కేంద్రాలు (Full fill centers) ఎయిర్ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు మరియు టీవీలతో కూడిన పెద్ద ఉపకరణాల విభాగంలో మరియు మొత్తం ఫర్నిచర్ పరిధిని కలిగి ఉన్న 1.2 లక్షల ఉత్పత్తుల ఎంపిక నుండి వేలాది ఉత్పత్తులను నిల్వ చేస్తుంది. తెలంగాణ(Telangana)లోని ఇతర సరఫరా కేంద్రాలు స్మార్ట్‌ఫోన్‌లు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, ఫ్యాషన్ అండ్ కన్స్యూమబుల్స్ కేటగిరీలోని ఉత్పత్తుల కోసం వినియోగదారుల డిమాండ్‌ను తీర్చగలదు.

హైదరాబాద్‌లో 2 కొత్త సరఫరా కేంద్రాలతో(FC) తెలంగాణలో అమెజాన్(Amazon) ఇండియా(Amazon India) తన సరఫరా మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. ఈ విస్తరణ అమ్మకందారులకు విస్తృత ఎంపికను అందించడానికి మరియు రాబోయే పండుగ సీజన్‌కు ముందే ప్రాంతం మరియు పొరుగు రాష్ట్రాలలో కస్టమర్ ఆర్డర్‌లను వేగంగా అందించడానికి సహాయపడుతుంది. ఈ మౌలిక సదుపాయాలతో, అమెజాన్(Amazon)​  ఇప్పుడు 4 సరఫరా కేంద్రాలలో 4.5 మిలియన్ క్యూబిక్ అడుగుల కంటే ఎక్కువ స్టోరేజీ సామర్థ్యాన్ని తెలంగాణలోని 23,000 మందికి పైగా అమ్మకందారులకు అందిస్తుంది. అమెజాన్ ఇండియా తెలంగాణలో ఒక లక్ష చదరపు అడుగుల కంటే ఎక్కువ విస్తీర్ణాన్ని అందించడానికి ఇప్పటికే ఉన్న వర్గీకరించే సెంటర్‌ను విస్తరించింది.