టాటా టెక్ ఐపీఓకి సెబీ ఆమోదం..

టాటా గ్రూప్ నుంచి వస్తున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్ నుంచి ఏకంగా 20 సంవత్సరాల తర్వాత వస్తున్న ఐపిఓ ఇదే కావడం గమనించాల్సిన విషయం. ఇక ఇదే సమయంలో ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ , గాంధర్ ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ ఐపీఓ లకు కూడా సెబీ అనుమతి ఇచ్చింది. టాటా టెక్నాలజీస్ […]

Share:

టాటా గ్రూప్ నుంచి వస్తున్న టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కు మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. టాటా గ్రూప్ నుంచి ఏకంగా 20 సంవత్సరాల తర్వాత వస్తున్న ఐపిఓ ఇదే కావడం గమనించాల్సిన విషయం. ఇక ఇదే సమయంలో ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ లిమిటెడ్ , గాంధర్ ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ ఐపీఓ లకు కూడా సెబీ అనుమతి ఇచ్చింది.

టాటా టెక్నాలజీస్ ఐపిఓ లో టాటా మోటార్స్ వాటాలు ఉన్నాయని ఈ పబ్లిక్ ఇష్యూలో ఆటో మేనేజర్ తన పేర్లను అందిస్తుందని ఇది 100 శాతం ఆఫర్ ఫర్ సేల్ అని స్టాక్ మార్కెట్ నిపుణులు తెలిపారు. దీని అర్థం తాటా టెక్నాలజీస్ ఐపీఓ యొక్క నికర ఆదాయం తాటా టెక్నాలజీస్ కు బదులుగా టాటా మోటార్స్ బ్యాలెన్స్ షీట్ను బలోపేతం చేస్తుంది. టాటా టెక్నాలజీస్ షేర్లను ఒక్కొక్కటి రూ. 7.40 చొప్పున టాటా మోటార్స్ కొనుగోలు చేసిందని తెలిపారు. ముందు ముందు టాటా మోటార్స్ కు భారీ ద్రవ్య ప్రయోజనాన్ని అందించే ఆశాజనక ఫలితాలు ఉన్నాయి.

టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ ఈనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సేకరించడానికి సెబీ నుంచి ఆమోదం పొందిన తరువాత జూన్ 28న టాటా మోటార్స్ షేర్ ధర ఓపెన్ లో లాభ పడింది. టాటా మోటార్స్ షేర్ ధర రూ. 579.95 వద్ద ప్రారంభమైంది. టాటా మోటార్స్ షేర్ ధర ఉదయం ఓ మోస్తరుగా కూడా నిలబెట్టుకోలేకపోయింది.  కానీ మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి మాత్రం ఊహించని లాభాలను అందుకుంది. మధ్యాహ్నం ట్రేడింగ్లో టాటా మోటార్స్ షేర్ 52 వారాల గరిష్టాన్ని అందుకుంది. టాటా టెక్ ఐపిఓలో బ్లాక్ బస్టర్ ఇష్యూ ని ఇన్వెస్టర్లు ముందుగానే అంచనా వేయడంతో టాటా మోటార్స్ స్టాక్ మార్కెట్లో మళ్లీ సందడి చేయడం ప్రారంభించింది. 

 మార్చిలోనే సెబీ వద్ద దాఖలు చేసిన డ్రాఫ్ట్ పేపర్లను సమర్పించింది మొత్తం ఆఫర్ ఫర్ సేల్ కు ఉంచింది. ప్రస్తుతం ప్రమోటర్లు షేర్ హోల్డర్ల దగ్గర  95.71  మిలియన్ల షేర్లు ఉండడం విశేషం. ఇందులో ఎక్కువ వాట్ టాటా మోటార్స్ దగ్గరే ఉంది. టాటా టెక్నాలజీ షేర్ లలో 81.13 మిలియన్ షేర్లు టాటా మోటార్స్ వాటానే. ఇక 9.72 మిలియన్ షేర్లు ఆల్ఫా టి సి హోల్డింగ్స్, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ వాటర్ 4.86 మిలియన్లు షేర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం టాటా టెక్నాలజీస్ లో 74.69 శాతం వాటా టాటా మోటార్స్ దే.  ఆల్ఫా టి సి హోల్డింగ్స్ వాటా 7.26% కాగా, టాటా క్యాపిటల్ గ్రోత్ వాటా 3.63% గా మారింది . టెక్నాలజీస్ అనేది ఇంజనీరింగ్ సేవల సంస్థ. డిజిటల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ సేవలలో టాటా టెక్ కంపెనీ ప్రపంచంలోనే గొప్ప, అతిపెద్ద కంపెనీలలో ఒకటిగా ఉంది. ఇది ప్రోడక్ట్ డెవలప్మెంట్, ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫర్ చేస్తోంది . ఇక ఇప్పుడు టాటా టెక్నాలజీస్ కు కేపిఐటి టెక్నాలజీ , ఎల్ అండ్ టి  టెక్నాలజీ సర్వీసెస్, టాటా ఈ ఎల్ ఎక్స్ ఎస్ ఐ కాంపిటేటర్స్ గా ఉన్నాయి. టాటా గ్రూప్ నుంచి సుమారు 20 ఏళ్లకు ఐపిఓ వస్తుండడం పట్ల జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.