భారతదేశపు మొదటి ఐఫోన్ మేకర్ సిద్ధం

ప్రస్తుతానికి టాటా గ్రూప్ వారు కర్ణాటకలోని ఉన్న ఒక ఫ్యాక్టరీ కొనేందుకు మాటలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కాకపోతే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ, కొంతమంది వ్యక్తుల ద్వారా ఫ్యాక్టరీ బేరం లో ఉన్నట్టు ప్రస్తుతం దాని విలువ $600 million గా ఉన్నట్టు సమాచారం.  టాటా గ్రూప్ ఏమంటుంది:  అయితే ప్రస్తుతానికి టాటా గ్రూప్ ఆపిల్ తో చేతులు కలపబోతున్నట్లు, ఆగస్టు నుంచి ఫ్యాక్టరీ పనులు మొదలవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా డాక్టర్ […]

Share:

ప్రస్తుతానికి టాటా గ్రూప్ వారు కర్ణాటకలోని ఉన్న ఒక ఫ్యాక్టరీ కొనేందుకు మాటలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కాకపోతే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ, కొంతమంది వ్యక్తుల ద్వారా ఫ్యాక్టరీ బేరం లో ఉన్నట్టు ప్రస్తుతం దాని విలువ $600 million గా ఉన్నట్టు సమాచారం. 

టాటా గ్రూప్ ఏమంటుంది: 

అయితే ప్రస్తుతానికి టాటా గ్రూప్ ఆపిల్ తో చేతులు కలపబోతున్నట్లు, ఆగస్టు నుంచి ఫ్యాక్టరీ పనులు మొదలవుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా డాక్టర్ గ్రూప్ భారతదేశపు మొట్టమొదటి ఐఫోన్ మేకర్ గా అవతరించబోతోంది. ఒకవేళ ఆగస్టు నుంచి సమాచారం ప్రకారం ఆగస్టు నుంచి పనులు మొదలవుతే, ఐఫోన్ అసెంబ్లింగ్ విషయంలో భారత దేశంలో మొట్టమొదట ఆపిల్ కంపెనీతో చేతులు కలిపిన కంపెనీగా టాటా గ్రూప్ అవతరిస్తుందని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. 

పెరగనున్న ఉద్యోగ అవకాశాలు: 

అయితే ఈ విషయం ప్రస్తుతానికి గోప్యంగా ఉన్నప్పటికీ, కర్ణాటకలోని ఉన్న ఒక ఫ్యాక్టరీ కొనేందుకు మాటలు జరుగుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. కాకపోతే ఈ విషయం ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయనప్పటికీ, కొంతమంది వ్యక్తుల ద్వారా ఫ్యాక్టరీ బేరం లో ఉన్నట్టు ప్రస్తుతం దాని విలువ $600 million గా ఉన్నట్టు సమాచారం. ఒకవేళ ఫ్యాక్టరీ స్టార్ట్ అయితే, ఐఫోన్ కొత్త మోడల్ అసెంబ్లింగ్లో భాగంగా సుమారు 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అంచన వేస్తున్నారు. 

విస్ట్రాన్ మార్చి 2024 నాటికల్లా, ఫ్యాక్టరీ నుండి కనీసం $1.8 బిలియన్ల విలువైన iPhoneలను రవాణా చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు నిబంధనలకు కట్టుబడి ఉన్నట్లు ప్రజలు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్లాంట్ శ్రామిక వ్యవస్థని మూడు రెట్లు పెంచాలని కూడా ప్రణాళిక వేస్తున్నట్లు పలు వర్గాలు పేర్కొన్నాయి. టాటా ఆ కట్టుబాట్లను గౌరవించటానికి సిద్ధంగా ఉంది. 

కోవిడ్ తర్వాత వేగవంతమైన భారతదేశం: 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉత్పత్తి మరియు ఉపాధిని విస్తరించేందుకు లాభదాయకమైన ఆర్థిక ప్రోత్సాహకాలతో ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేసినప్పటి నుండి దేశీయ తయారీలో భారతదేశం పురోగతి సాధించింది. దేశం యొక్క కోవిడ్ లాక్‌డౌన్ల కారణంగా తగ్గిన పలు ఉత్పత్తులను మరల, పలు దేశాలతో ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు ప్రకారం, చైనా నుండి వైదొలిగే ప్రయత్నాలను ఆపిల్ వేగవంతం చేసింది.

ప్రపంచంలోని అత్యంత ఎత్తులో ఉన్న చైనా హోదాను సవాలు చేసేందుకు మోదీ చేస్తున్న ప్రయత్నాలకు ఐఫోన్‌లను తయారు చేస్తున్న భారతీయ కంపెనీ గణనీయమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇతర ప్రపంచ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్‌లు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి భారతదేశంలో ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకునేలా ఒప్పించడంలో ఇది సహాయపడవచ్చు. భారతదేశం కూడా చైనాకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించడానికి ఇది ఒక అవకాశం. 

టాటా గ్రూప్స్ గురించి మరింత:

155 ఏళ్ల చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ఉప్పు నుంచి టెక్ సేవల వరకు అన్నింటిని విక్రయిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి అదే విధంగా ఇ-కామర్స్‌లో ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది.

తమిళనాడు రాష్ట్రంలో వందల ఎకరాల్లో విస్తరించి ఉన్న టాటా గ్రూప్ కి సంబంధించిన ఫ్యాక్టరీలో ఇప్పటికే iPhone ఛాసిస్ అంటే ఫోన్ కి సంబంధించిన మెటల్ బ్యాక్ బోన్ అనేది తయారు చేస్తుంది. టాటా గ్రూప్స్ ప్రస్తుతానికి చిప్‌మేకింగ్ అవకాశాలను కూడా తీసుకొని ప్రోత్సహిస్తున్నాయని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ గతంలో చెప్పారు.