స్విగ్గిలో బిర్యానీ హవా 

కమ్మని బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? సందర్భం ఏదైనా, పండుగ ఏదైనా తప్పకుండా బిర్యాని ప్రియులకు బిర్యానీ ఉండాల్సిందే. గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జులై 2 నాటికి దేశంలో అత్యధికంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు స్విగ్గిలో ఆర్డర్ చేసుకున్నట్లు స్విగ్గి వెల్లడించింది.  ఇంటర్నేషనల్ బిర్యానీ డే:  జులై 2న జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ బిర్యాని డే కార్యక్రమంలో భాగంగా స్విగ్గి తన పోర్టల్ లో భారత దేశంలో గత సంవత్సరం జూలై […]

Share:

కమ్మని బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు? సందర్భం ఏదైనా, పండుగ ఏదైనా తప్పకుండా బిర్యాని ప్రియులకు బిర్యానీ ఉండాల్సిందే. గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జులై 2 నాటికి దేశంలో అత్యధికంగా 7.6 కోట్ల బిర్యానీ ఆర్డర్లు స్విగ్గిలో ఆర్డర్ చేసుకున్నట్లు స్విగ్గి వెల్లడించింది. 

ఇంటర్నేషనల్ బిర్యానీ డే: 

జులై 2న జరుపుకుంటున్న ఇంటర్నేషనల్ బిర్యాని డే కార్యక్రమంలో భాగంగా స్విగ్గి తన పోర్టల్ లో భారత దేశంలో గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జూలై 2 వరకు ఎన్ని బిర్యాని ఆర్డర్లు వచ్చాయో వెల్లడించింది. సుమారు 7:30 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. 

భారతీయులు బిర్యానీని ఇష్టపడతారు మరియు వారికి ఇష్టమైన రైస్ సావరీని ఆర్డర్ చేసే అవకాశాన్ని ఎప్పుడూ వదులుకోరు. బిర్యానీపై ఉన్న ప్రేమను మాటల్లో చెప్పలేనప్పటికీ, భారతీయులు తమ ఆన్‌లైన్ ఆర్డర్‌లలో బిర్యానీపై ఎంత ప్రేమను కురిపిస్తున్నారనే డేటాను స్విగ్గీ తాజాగా వెల్లడించింది. జూలై 02న జరుపుకునే అంతర్జాతీయ బిర్యానీ దినోత్సవాన్ని పురస్కరించుకుని, గత 12 నెలల్లో భారతీయులు 76 మిలియన్లకు పైగా బిర్యానీ ఆర్డర్‌లు అంటే 7.6 కోట్లకు పైగా ఆర్డర్లు చేశారని ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ ప్లాట్‌ఫాం వెల్లడించింది. 

స్విగ్గి ఎనాలసిస్: 

Swiggy చేసిన అనాలసిస్ ప్రకారం, 2022 ఇదే నెలతో పోలిస్తే గత ఐదున్నర నెలల్లో బిర్యానీ ఆర్డర్‌లలో 8.26 శాతం వృద్ధి నమోదైందని కంపెనీ వెల్లడించింది. ప్లాట్‌ఫారమ్ ద్వారా బిర్యానీని అందించే 2.6 లక్షల రెస్టారెంట్లు, 28 వేలకు పైగా హోటల్స్ ఈ బిర్యానీ సర్వ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉన్నాయి. లక్నో బిర్యానీ నుండి మసాలా హైదరాబాదీ దమ్ బిర్యానీ వరకు, అంతేకాకుండా సువాసనగల కోల్‌కతా బిర్యానీ నుండి గుమగుమలు వెదజల్లే మలబార్ బిర్యానీ వరకు, దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇష్టమైన బిర్యాని ఆస్వాదించడం కోసం నిమిషానికి 219 ఆర్డర్‌లు చేస్తున్నారని స్విగ్గి తన అనాలసిస్ లో పేర్కొంది.

“లక్నో బిర్యానీ నుండి మసాలా హైదరాబాదీ దమ్ బిర్యానీ వరకు, అంతేకాకుండా సువాసనగల కోల్‌కతా బిర్యానీ నుండి గుమగుమలు వెదజల్లే మలబార్ బిర్యానీ వరకు, దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇష్టమైన బిర్యాని ఆస్వాదించడం కోసం నిమిషానికి 219 ఆర్డర్‌లు చేసారు” అని స్విగ్గీ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఏ రాష్ట్రం బిరియాని లో ఫేమస్: 

అత్యధిక సంఖ్యలో బిర్యానీ అమ్మే రెస్టారెంట్లు ఉన్న నగరాల విషయానికొస్తే, దేశవ్యాప్తంగా ప్లాట్‌ఫారమ్ ద్వారా బిర్యానీని అందించే 2.6 లక్షల రెస్టారెంట్లు, 28 వేలకు పైగా హోటల్స్ ఈ బిర్యానీ సర్వ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉన్నాయని స్విగ్గీ తన అనాలసిస్ ప్రకారం వెల్లడించింది. అయితే, నగరంలో 24,000 బిర్యానీలు అందించే రెస్టారెంట్లు ఉన్నందున బెంగళూరు అగ్రస్థానంలో నిలిపింది. బెంగళూరు తర్వాత 22,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లతో ముంబై మరియు 20,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లతో ఢిల్లీ ఉన్నాయి.

ఆసక్తికరంగా, బిర్యానీ ప్రియుల విషయానికి వస్తే, ఈ ఏడాది జూన్ వరకు 7.2 మిలియన్ల ఆర్డర్‌లతో హైదరాబాద్ బిర్యానీ వినియోగంలో ముందంజలో ఉందని స్విగ్గీ డేటా వెల్లడించింది. దాదాపు 5 మిలియన్ల ఆర్డర్‌లతో బెంగళూరు తర్వాతి స్థానంలో ఉంది మరియు చెన్నై దాదాపు 3 మిలియన్ ఆర్డర్‌లతో మూడో స్థానంలో నిలిచింది.

6.2 మిలియన్లకు పైగా ఆర్డర్‌లు మరియు దాదాపు 85 వేరియంట్‌లతో దమ్ బిర్యానీ అత్యంత ప్రజాదరణ పొందిన ప్రత్యేకమైన డిష్ అని డేటాలో వెళ్లడానికి. హైదరాబాదీ బిర్యానీకి 2.8 మిలియన్ ఆర్డర్లు వచ్చాయి. చెన్నైలోని ఓ బిర్యానీ ప్రియుడు దాదాపు రూ.31,532 పైగా ఒక బిర్యానీ ఆర్డర్ చేసేందుకు ఖర్చు పెట్టాడు.