ఆంధ్రప్రదేశ్‌లో కేవలం రెండేళ్లలోనే 65% పెరిగిన స్టార్టప్ రిజిస్ట్రేషన్!

2020లో 14,498  స్టార్టప్‌లుగా ఉండగా,  అదే 2022 నాటికి 26,542 స్టార్టప్‌ల వరకు  పెరిగింది.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలోనే స్టార్టప్ రిజిస్ట్రేషన్ సుమారుగా 65% పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది ఈ క్రమంలోనే స్టార్టప్‌ల రిజిస్ట్రేషన్ పెరిగింది అని రాజ్యసభలో మంత్రి స్పష్టం చేశారు.  అసలు విషయంలోకెళితే 2020లో 231 స్టార్టప్పులు నమోదయితే 2022 నాటికి 382 కి స్టార్టప్పుల సంఖ్య నమోదు […]

Share:

2020లో 14,498  స్టార్టప్‌లుగా ఉండగా,  అదే 2022 నాటికి 26,542 స్టార్టప్‌ల వరకు  పెరిగింది..

తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌లో గత రెండు సంవత్సరాలలోనే స్టార్టప్ రిజిస్ట్రేషన్ సుమారుగా 65% పెరిగినట్లు తెలుస్తోంది. దేశంలోని స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేస్తోంది ఈ క్రమంలోనే స్టార్టప్‌ల రిజిస్ట్రేషన్ పెరిగింది అని రాజ్యసభలో మంత్రి స్పష్టం చేశారు.  అసలు విషయంలోకెళితే 2020లో 231 స్టార్టప్పులు నమోదయితే 2022 నాటికి 382 కి స్టార్టప్పుల సంఖ్య నమోదు అయ్యింది.. అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి 110 సంస్థలు ఫిబ్రవరి 28 వరకు స్టార్టప్‌లుగా గుర్తింపు పొందాయి అని స్పష్టం చేశారు.

జాతీయస్థాయిలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అందించిన సమాచారం ప్రకారం.. పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ ద్వారా స్టార్టప్‌లుగా గుర్తించబడిన సంస్థల సంఖ్య 2020లో 14,498  స్టార్టప్‌లుగా ఉండగా,  అదే 2022 నాటికి 26,542 స్టార్టప్‌ల వరకు  పెరిగింది.. ఇటీవల రాజ్యసభలో వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ ఈ సమాచారాన్ని అందించారు.. అయితే  వైఎస్ఆర్సీపీ ఎంపి  పరిమళ నత్వాని రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు.. వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోంప్రకాష్ ఈ విధంగా సమాధానం తెలిపారు.

తాజాగా అందించిన సమాచారం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లో డిపిఐఐటి ద్వారా స్టార్టప్‌లుగా గుర్తింపు పొందిన సంస్థల సంఖ్య  2020లో 231 ,2021లో 296 , 2022 లో 382 కాగా ఒక ఏపీ ప్రభుత్వం నుండి 110 సంస్థలు స్టార్టప్‌లుగా గుర్తింపు పొందాయని ఆయన స్పష్టం చేశారు. 2023 ఫిబ్రవరి 28 నాటికి భారత దేశంలో టోటల్ స్టార్టప్ సంఖ్య 92,683 కు చేరిందని ఆయన తెలిపారు. రంగాల వారీగా చూసుకుంటే ఐటి సర్వీసెస్ లో స్టార్టప్‌ల సంఖ్య 7,587 కు చేరుకోగా .. హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్స్ విభాగంలో స్టార్టప్‌ల సంఖ్య 6,459  కి చేరుకుంది. ఇక ఎడ్యుకేషన్ విభాగంలో 4,164 స్టార్టప్‌లు, ఒక్క ఆంధ్ర ప్రదేశ్‌లోనే  1019 స్టార్టప్‌లు నమోదు చేయబడ్డాయి. గత మూడు సంవత్సరాలలో కలిపి ప్రస్తుత సంవత్సరంలో దేశంలో నమోదైన స్టార్టప్ సంఖ్య అదే సమయంలో యూనికాన్ గా మారిన స్టార్టప్‌ల సంఖ్య, స్టార్టప్ సంస్కృతిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న అలాగే తీసుకుంటున్న చర్యల గురించిన  సమాచారాన్ని కూడా కోరారు.

ఇకపోతే ఈ స్టార్టప్‌ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీం, స్టార్టర్ కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీం వంటి ఫ్లాట్ షిప్ స్కీమ్‌లు స్టార్ట్ అప్‌లకు వారి వ్యాపార చక్రంలోని వివిధ దశలలో మద్దతునిస్తాయి. మరొకవైపు ఏంజెల్ ఇన్వెస్టర్లు లేదా వెంచర్ క్యాపిటల్ లిస్ట్ నుండి పెట్టుబడులు సేకరించి బ్యాంకులు లేదా సంస్థల నుండి రుణాలు పొందవచ్చునంటూ ఆయన రాజ్యసభలో వివరణ ఇచ్చారు. ముఖ్యంగా స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ కింద దేశంలో స్టార్టపు ఎకో సిస్టం అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయడానికి వివిధ ప్రయత్నాలు చేస్తోందని కూడా మంత్రి స్పష్టం చేశారు.