స్పేస్ జెట్ ఈక్విటీ షేర్స్ ద్వారా తన క్యాపిటల్ పెంచనుందా?

స్పేస్ జెట్ ఎందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది:  ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల ద్వారా అంతేకాకుండా కన్వర్టిబుల్ సెక్యూరిటీల ద్వారా జారీ చేయబడిన దాన్నిబట్టి, స్పైస్‌జెట్ బోర్డు తన తాజా క్యాపిటల్ గురించి 12న స్పష్టం కానుంది. “ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల ద్వారా అంతేకాకుండా కన్వర్టిబుల్ సెక్యూరిటీల ద్వారా జారీ చేయబడిన దాన్నిబట్టి, స్పైస్‌జెట్ బోర్డు తన తాజా క్యాపిటల్ గురించి కొన్ని ఆప్షన్స్ అనేవి పరిగణనలోకి తీసుకుని, వాటిని కంపెనీ డైరెక్టర్ల బోర్డు జూలై 12, […]

Share:

స్పేస్ జెట్ ఎందుకు నిర్ణయం తీసుకోవాలనుకుంటుంది: 

ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల ద్వారా అంతేకాకుండా కన్వర్టిబుల్ సెక్యూరిటీల ద్వారా జారీ చేయబడిన దాన్నిబట్టి, స్పైస్‌జెట్ బోర్డు తన తాజా క్యాపిటల్ గురించి 12న స్పష్టం కానుంది.

“ప్రిఫరెన్షియల్ ప్రాతిపదికన ఈక్విటీ షేర్ల ద్వారా అంతేకాకుండా కన్వర్టిబుల్ సెక్యూరిటీల ద్వారా జారీ చేయబడిన దాన్నిబట్టి, స్పైస్‌జెట్ బోర్డు తన తాజా క్యాపిటల్ గురించి కొన్ని ఆప్షన్స్ అనేవి పరిగణనలోకి తీసుకుని, వాటిని కంపెనీ డైరెక్టర్ల బోర్డు జూలై 12, 2023 (బుధవారం) నాడు ఆమోదించడానికి మీటింగ్ అనేది జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే తీసుకునే నిర్ణయం కచ్చితంగా చట్టబద్ధకంగా ఉంటుంది” అని స్పైస్‌జెట్ ఆదివారం  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలపడం జరిగింది.

స్పేస్ జెట్ క్యాపిటల్ విషయంలో తీసుకునే నిర్ణయం అనేది తప్పకుండా కంపెనీ వాటాదారుల ఆమోదం మరియు వర్తించే రెగ్యులేటరీ అనుమతులకు లోబడి ఉంటుంది స్పష్టంగా చెప్పడం జరిగింది.

స్పేస్ జెట్ వివాదాలు నష్టాలు: 

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో, అనుకోని వివాదం ప్రకారం, శుక్రవారం నాడు సుప్రీం కోర్ట్ ఆదేశం మేరకు, మాజీ ప్రమోటర్ కళానిధి మారన్‌కు మొత్తం ₹380 కోట్లు చెల్లించాలని ఎయిర్‌లైన్‌ను ఆదేశించడం జరిగింది. ఇటువంటి అనేకమైన కష్టాల్లో ఉన్న ఈ ఎయిర్ లైన్స్ సంస్థ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొన్నటి వరకు COVID-19 నేపథ్యంలో స్పేస్ జెట్ ఎయిర్ లైన్ అనేది చాలావరకు నష్టాలను చవిచూసింది.

FY23 మొదటి మూడు త్రైమాసికాల్లో, స్పైస్‌జెట్ నికర నష్టం ₹1,507 కోట్లుగా ఉంది. నాల్గవ త్రైమాసిక ఫలితాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

తన ఆలస్యానికి కారణం: 

అయితే క్యాపిటల్ విషయంలో స్పేస్ జెట్ ఇంతకుముందే జూన్ 30న తన నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా అనుకోకుండా స్పైస్‌జెట్ లోనే తన ఆడిట్ కమిటీలోని ముఖ్యమైన వ్యక్తికి  అనారోగ్య సమస్య కారణంగా 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను తన ఆర్థిక ఫలితాల ప్రకటనను ఆలస్యం చేసినట్లు ప్రకటించింది.

FY19లో ₹302 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది, FY20లో ₹937 కోట్లు, FY21లో ₹1,030 కోట్లు, మరియు FY22లో ₹1,744 కోట్లు నష్టాన్ని చూసినట్లు స్పేస్ జెట్ వెల్లడించింది. ఇటీవల స్పేస్ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకుంది. శుక్రవారం, స్పైస్‌జెట్ షేర్లు బిఎస్‌ఇలో 2.93% తగ్గి ₹29.50 వద్ద ముగిశాయి.

స్పైస్‌జెట్ గురించి మరింత: 

మొట్టమొదటిగా 2005 నుంచి, స్పైస్‌జెట్ తన కార్యకలాపాలు మొదలు పెట్టింది. స్పైస్‌జెట్ ప్రధాన కార్యాలయం అనేది హర్యానాలోని గుర్గావ్‌లో ఉంది. స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్ లాజిస్టిక్స్ విభాగమైన స్పైస్‌ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ వ్యాపారంలో, 2020 కోవిడ్ సమయంలో విపరీతమైన నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీని మళ్ళీ తేరుకోవడానికి చాలా వరకు సహాయపడింది. మే 2021లో, విమానయాన ఎక్స్పోర్టింగ్ రవాణా కార్యకలాపాల ద్వారా ₹200 కోట్లు సంపాదించింది మరియు భారతదేశం యొక్క అవుట్‌బౌండ్ కార్గో వ్యాపారంలో 5 శాతం మార్కెట్ వాటా కూడా ఉన్నట్టు సమాచారం.

జూలై 2021లో, 31 మార్చి 2021తో ముగిసిన ఆర్థిక త్రైమాసికంలో స్పైస్‌జెట్ నికర నష్టాలు US$34.6 మిలియన్లకు తగ్గినట్లు నివేదించింది, ఎందుకంటే ఆదాయం సంవత్సరానికి 28% తగ్గి $294.8 మిలియన్లకు చేరుకుంది. ఎయిర్‌లైన్ దాని దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మళ్లీ నార్మల్ చేసేందుకు $337.2 మిలియన్ల నిధులను సేకరించాలని ఆలోచనలు చేస్తున్నట్లు నివేదికలో పేర్కొంది.

స్పైస్‌జెట్ భారతీయ బడ్జెట్ ఎయిర్‌లైన్. ఏప్రిల్ 2023 నాటికి 5.8% మార్కెట్ షేర్ ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా ఇందులో ప్రయాణించే దేశీయ ప్రయాణీకుల సంఖ్య ప్రకారం ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద విమానయాన సంస్థగా పేరు పొందింది. ఎయిర్‌లైన్ 64 ప్రాంతాలకు గాను రోజువారీ 630 విమానాలను నడుపుతోంది, ఇందులో 54 భారతీయ మరియు 15 అంతర్జాతీయ డెస్టినేషన్స్ అనేవి ఉంటాయి.