SME ఆర్థిక విజయానికి పాటించాల్సిన ఫార్ములా

జీవితంలో ప్రతి ఒక్కరూ ధనవంతుడిగా ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఉద్యోగం చేయటం వలన పెద్ద లాభాలు ఏమీ రావు. కానీ, సురక్షితంగా జీవించగలిగే స్వేచ్ఛ ఉంటుంది. అయితే వ్యాపారం చేసేవారికి ఎక్కువగా కష్టాలు, టెన్షన్లు ఉంటాయి. వ్యాపారం బాగా సెట్ అయ్యే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఎంఈ (SME) వాళ్ళు ఎన్నో మెళకువలు పాటించాలి. ఆ తరువాత వ్యాపారం సాఫీగా సాగిపోవాలంటే.. మీ బిజినెస్‌ను మంచి […]

Share:

జీవితంలో ప్రతి ఒక్కరూ ధనవంతుడిగా ఎదగాలని కోరుకుంటారు. ఇందుకోసం కొందరు ఉద్యోగం చేస్తారు. మరికొందరు వ్యాపారం చేస్తారు. ఉద్యోగం చేయటం వలన పెద్ద లాభాలు ఏమీ రావు. కానీ, సురక్షితంగా జీవించగలిగే స్వేచ్ఛ ఉంటుంది. అయితే వ్యాపారం చేసేవారికి ఎక్కువగా కష్టాలు, టెన్షన్లు ఉంటాయి. వ్యాపారం బాగా సెట్ అయ్యే వరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎస్ఎంఈ (SME) వాళ్ళు ఎన్నో మెళకువలు పాటించాలి. ఆ తరువాత వ్యాపారం సాఫీగా సాగిపోవాలంటే.. మీ బిజినెస్‌ను మంచి పంథాలో తీసుకువెళ్లాలంటే.. కొన్ని మెలకువలు తెలుసుకోవడం తప్పనిసరి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎస్ఎంఈ ఆర్థిక విజయం సాధించాలంటే

ఎస్ఎంఈ అంటే చిన్న, మధ్య తరహా సంస్థలు. ఇవి ఒక నిర్దిష్ట పరిమితి కంటే తక్కువ పెట్టుబడి టర్నోవర్, వర్క్‌ఫోర్స్‌తో ఉండే వ్యాపారాలు. భారతదేశంలో తయారీ, సేవా సంస్థలు రెండింటినీ కలిగి ఉంటాయి‌. ప్లాంట్, మిషనరీ లేదా పరికరాలతో వార్షిక టర్నోవర్ పెట్టుబడి యొక్క కాంపోజిట్ ప్రమాణాల ఆధారంగా, చిన్న, మధ్య తరహా సంస్థలు పనిచేస్తాయి. మీరు చిన్న వ్యాపారాలను స్థాపించిన వాటిని పెద్ద సంస్థలుగా తీర్చిదిద్దొచ్చు.

బిజినెస్ స్టార్ట్ చేయడం అంటే సాధారణమైన విషయం కాదు. ఎవరైనా చేస్తారు. కానీ మీరు అభివృద్ధి చెందాలంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. వ్యాపారం కోసం ఎదుటివారితో మాట్లాడే విధానంతో పాటు, చక్కని రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. బిజినెస్‌లో ఎక్కువ మంది కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఇది అద్భుతంగా ఉపయోగపడుతుంది. మొదటిసారి బిజినెస్ చేసే సమయంలో కొన్ని తప్పులు చేయడం సహజం. కానీ, వాటిని మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. చిన్న స్టెప్ అయినా సరే.. వెనుక, ముందు.. ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకు వెళ్లాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ అధైర్య పడకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. బిజినెస్ విషయంలో పెద్దవారు చెప్పే సలహాలను వినడం చాలా ముఖ్యం. వాటిని ఆచరిస్తే మంచిది. బిజినెస్ విషయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ మంచివి కాదని గుర్తుంచుకోండి. 

మీ బిజినెస్ కోసం తీసుకువచ్చిన ముడి సరుకును.. మీరు ఎప్పటికప్పుడు వస్తువులుగా తయారు చేసి, వాటిని మార్కెట్లోకి పంపిస్తూ ఉండాలి. మీరు వస్తువులను ఎక్కువగా తయారు చేసుకొని, అక్కడే మీ దగ్గరే ఉంచేసుకుంటే ఉపయోగం ఉండదు. వాటిని మార్కెట్లోకి పంపి, డబ్బులు తీసుకురాగలిగితేనే.. మీరు సమయానికి ఈ వ్యాపారానికి తీసుకున్న లోన్ కట్టడంతో పాటు, అక్కడ ఉన్న సిబ్బందికి కూడా సరైన సమయంలో జీతాలను చెల్లించగలరు.

స్టార్ట్ అప్ కంపెనీలు బ్లాక్ చైన్ లింకును ఫాలో అవుతుంది. ఒక్కోసారి వారికి సరైన సమయానికి డబ్బులు అందకపోవచ్చు, ఇబ్బందులకు గురవచ్చు. భారత ప్రభుత్వం తీసుకువచ్చిన MSMED చట్టం 2006 ప్రకారం.. వస్తువులు, సేవలు  అందించిన 45 రోజుల్లోనే చేయలింపులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. అయితే, ఈ సదుపాయాన్ని పొందేటందుకు ఎంటిటిని MSME గా నమోదు చేసుకోవడం ముఖ్యం.

మీరు స్టార్ట్ చేసిన ఎస్ఎంఈ మంచి లాభాల బాటలో వెళ్తున్నప్పుడు మీకు వచ్చిన రాబడిని పెట్టుబడుల రూపంలో పెట్టకండి. ఎందుకంటే, ఒక్కో నెలలో లాభాలు అధికంగా వస్తాయి. మీకు వచ్చిన రాబడిని.. మీరు ఫండ్స్ రూపంలో పెడితే మంచిదని గుర్తించాలి.  మీకు వచ్చే లాభాలను మీరు రుణాల మొత్తాన్ని అధికంగా చెల్లించడంలో ఉపయోగిస్తే ఇంకా మంచిది. దానివలన మీకు ఈ సారి ఎక్కువ లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది.