ఎక్కువ మంది పబ్లిక్ సెక్టార్ కస్టమర్లను సైన్ అప్ చేయడమే ఫ్రెష్ వర్క్ లక్ష్యం

ఎక్కువమంది పబ్లిక్ కస్టమర్లను సైన్ అప్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఫ్రెష్ వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ రాజారాం అన్నారు. ఫ్రెష్ వర్క్స్ సంస్థ 2023 నాటికి దేశంలో డిజిటల్ మార్పును వేగవంతం చేస్తుందని మరిన్ని భారత కేంద్ర, రాష్ట మంత్రిత్వ శాఖలతో భాగస్వామ్యాన్ని పొందడంపై దృష్టి సాధించనున్నట్టు పేర్కొన్నారు. కరోనా సమయంలో డిజిటల్ మార్పు కోసం వివిధ సంస్థలు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఫ్రెష్ వర్క్ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. అప్పటి నుంచి ఈ సంస్థలో అవకాశాలు […]

Share:

ఎక్కువమంది పబ్లిక్ కస్టమర్లను సైన్ అప్ చేసేందుకు కృషి చేస్తున్నామని ఫ్రెష్ వర్క్స్ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ రాజారాం అన్నారు. ఫ్రెష్ వర్క్స్ సంస్థ 2023 నాటికి దేశంలో డిజిటల్ మార్పును వేగవంతం చేస్తుందని మరిన్ని భారత కేంద్ర, రాష్ట మంత్రిత్వ శాఖలతో భాగస్వామ్యాన్ని పొందడంపై దృష్టి సాధించనున్నట్టు పేర్కొన్నారు.

కరోనా సమయంలో డిజిటల్ మార్పు కోసం వివిధ సంస్థలు మమ్మల్ని సంప్రదించినప్పుడు ఫ్రెష్ వర్క్ సంస్థ ప్రారంభమైందని తెలిపారు. అప్పటి నుంచి ఈ సంస్థలో అవకాశాలు పెరుగుతూ వస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఫ్రెష్ డెస్క్, ఫ్రెష్ సర్వీస్ వంటి ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారని తెలిపారు. దేశంలోని అన్ని పెన్షన్లను పర్యవేక్షించే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ తమ ఉద్యోగులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు . భారత్ లోని ప్రభుత్వ రంగంలో డిమాండ్ సృష్టించడంలో మేము కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ లో ఎం ప్యానల్ చేయబడిన కొన్ని కంపెనీలలో ఎదగడానికి సహాయం చేస్తుందన్నారు.

ప్రపంచ మాంద్యం కంటే ముందు డిమాండ్ వృద్ధి మందగించడం ద్వారా వ్యయ తగ్గింపు, ఉద్యోగుల తొలగింపు చర్యలను తీసుకుంది. ఫ్రెష్ వర్క్ కూడా భారతదేశంలో ఉద్యోగులను తొలగించింది. దాదాపు 114 మందిపై ఈ ప్రభావం చూపింది. ఫ్రెష్ వర్క్స్ APAC, ASEAN మార్కెట్లపై దృష్టి పెట్టింది. దీని ద్వారా కస్టమర్ల నిలుపుదలకు సహాయపడుతుంది. కస్టమర్ సమూపార్జన పెరిగిందని ఇప్పుడు దాన్ని నిలిపేందుకు కంపెనీలలో డబ్బు లేదని తెలిపారు. ఫ్రెష్ వర్క్ భారీ డిస్కౌంట్లను ఇస్తాయని ఇది చాలా మందికి ఉపయోగపడుతుందని తెలిపారు.

ఫ్రెష్ వర్క్స్ 2010 సంవత్సరంలో భారతదేశంలో స్థాపించబడిన క్లౌడ్ ఆధారిత కస్టమర్ సర్వీస్ కంపెనీ. కస్టమర్ ఐటి సర్వీస్ మేనేజ్మెంట్, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కోసం కంపెనీ ఆదాయత సేవలను అందిస్తుంది. 100 కంటే ఎక్కువ దేశాల్లో 52,000 మంది క్లైంట్ లను కలిగి ఉంది.నాస్ డాక్ లో లీస్టు చేయబడిన మొదటి భారతీయ SAAS కంపెనీగా ఫ్రెష్ వర్క్స్ చరిత్ర సృష్టించింది. ఫ్రెష్ వర్క్స్ సాఫ్ట్వేర్ కంపెనీని గిరీష్ మాతృ భూతం, షాన్ కృష్ణ స్వామి సంయుక్తంగా స్థాపించారు. 2017లో ఫ్రెష్ వర్క్స్ తన పేరును అధికారికంగా ప్రకటించింది. ఫ్రెష్ వర్క్స్ దాని మొదటి ట్రేడింగ్ డే ముగిసే సమయానికి 13 బిలియన్ వాల్యుయేషన్ లాభాలతో నాస్ డాక్ లో అరంగేట్రం చేసింది. 28 మిలియన్ షేర్లను విక్రయించి, 1.03 మిలియన్ల సంస్థగా నిలిచింది.

 అటు అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్ నాస్‌డాక్‌లో లిస్ట్ అయిన తొలి భారత ‘సాఫ్ట్‌వేర్ ఏ సర్వీస్’ సంస్థగా ఫ్రెష్‌వ‌ర్క్స్‌ చరిత్ర సృష్టించింది. ఈ సంస్థ ప్రస్థానం చెన్నైలోనే  మొదలైంది. కాగా తన వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు చెన్నై నుంచి అమెరికా వెళ్లినా ఫ్రెష్‌వ‌ర్క్స్‌ సీఈవో గిరీశ్ మాతృ భూతంకు సూపర్ స్టార్ రజినీ కాంత్ అంటే ఇష్టం. 100 మిలియన్ డాలర్లతో చేపట్టిన ఐపీవోకు ప్రాజెక్ట్ సూపర్ స్టార్ అని కోడ్ పెట్టారు. గిరీశ్‌కు రజనీ కాంత్ అంటే అంత అభిమానం. రజినీ కాంత్ హీరోగా నటించిన కొచ్చాడియాన్, లింగా, కబాలి సినిమాలు విడుదలైన సమయంలో తమ ఉద్యోగులకు కోసం ప్రత్యేకంగా చెన్నైలో థియేటర్ల‌ను గిరీశ్ బుక్ చేశారు. అలాగే సూపర్ స్టార్ రజీనీ కాంత్ డైలాగులు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని చాలా ఇంటర్వ్యూల్లో ఆయన చెప్పారు.