లాభాల్లో సెన్సెక్స్ నిఫ్టీ

సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో దూసుకుపోయింది. ఈ కారణంగా బుధవారం హెచ్డిఎఫ్సి ట్విన్స్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ కొనడానికి మధుపరులు మొగ్గు చూపారు. అంతేకాకుండా యూరోప్ మార్కెట్ లాభాలు కూడా జత కావడంతో, బుధవారం సెన్సెక్స్ లాభాలతో ముగిసింది.  రికార్డ్ స్థాయిలో బిఎస్సి సెన్సెక్స్ 195.45 పాయింట్స్ తో మొదలై 63,523.15 పాయింట్స్ తో లాభాల్లో ముగిసింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ 1న 63,583.07 పాయింట్లతో సెన్సెక్స్ ఆల్ […]

Share:

సెన్సెక్స్ నిఫ్టీ లాభాల్లో దూసుకుపోయింది. ఈ కారణంగా బుధవారం హెచ్డిఎఫ్సి ట్విన్స్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీ షేర్స్ కొనడానికి మధుపరులు మొగ్గు చూపారు. అంతేకాకుండా యూరోప్ మార్కెట్ లాభాలు కూడా జత కావడంతో, బుధవారం సెన్సెక్స్ లాభాలతో ముగిసింది. 

రికార్డ్ స్థాయిలో బిఎస్సి సెన్సెక్స్ 195.45 పాయింట్స్ తో మొదలై 63,523.15 పాయింట్స్ తో లాభాల్లో ముగిసింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత సంవత్సరం డిసెంబర్ 1న 63,583.07 పాయింట్లతో సెన్సెక్స్ ఆల్ టైం హిట్ గా నిలిచింది. తర్వాత మళ్లీ ఈ సంవత్సరం జూన్లోనే లాభాలు ఈ విధంగా అత్యధికంగా ఉన్నాయి.

బుధవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ వివరాలు ఇలా ఉన్నాయి:

ఎన్ఎస్ఈ నిఫ్టీ 40.15 పాయింట్లతో మొదలయ్యి జీవితకాల గరిష్ట స్థాయి 18,856.85 పాయింట్లు ముగిసింది. తర్వాత ఫైనాన్షియల్ ఐటి పవర్ షేర్లలో లాభాలు పెరిగి 18,875.90ని తాకింది.

సెన్సెక్స్ ప్యాక్ చూసినట్లయితే, పవర్ గ్రిడ్ అత్యధికంగా 3.68% పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.71% పెరిగింది, టెక్ మహేంద్ర 1.13%, టి సి ఎస్ 0.94%, ఇలా విప్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్డ్స్ అండ్ టర్బో, లాభాలు పొందిన వారిలో ఉన్నారు.

నష్టాల్లో ఉన్నది ఎవరు:

మరో పక్క సెన్సెక్స్ లాభాల్లో ముగిసిన వేళ,  మహేంద్ర అండ్ మహేంద్ర కంపెనీ అత్యధికంగా 1.59% కి క్షీణించింది. ఈ జాబితాలో ఐటిసి, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ మరియు మారుతి కంపెనీలు ఉన్నాయి.

“ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ సెన్సెక్స్ సరికొత్త ఆల్ టైం గరిష్ట రికార్డు సృష్టించడం చాలా ఆనందంగా ఉంది. జూన్ త్రైమాసిక ఫలితాలు అంచనాల అనుగనంగా ఫలితాలు రావడం అనేది చాలా గొప్ప విషయం,” అంటూ మెహతా ఈక్విటీస్ లిమిటెడ్ చైర్మన్ రాకేష్ మెహతా చెప్పుకొచ్చారు. 

ఇదిలా ఉండగా బీఎస్సీ మీట్ గ్యాప్ గాజ్ 0.68% విస్తృత మార్కెట్లో అత్యధికంగా పెరిగింది. మరోపక్క స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.24% లబ్ధిపొందింది. గత సంవత్సరం డిసెంబర్ నుంచి చూసుకుంటే, సెన్సెక్స్ ఆల్ టైం రికార్డ్స్ సృష్టించిందని చెప్పాలి. లాభాల్లో ముగిసిన వేళ, మధుపరులు షేర్లు కొనడానికి మక్కువ చూపుతున్నారు. అంతేకాకుండా, కొన్ని కంపెనీలు లాభాల్లో ఉన్నాయి.

లాభాలు పొందిన కంపెనీలలో మొదటి స్థానంలో పవర్ గ్రిడ్ ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి ట్విన్స్, టెక్ మహీంద్రా మరియు టిసిఎస్ ఉన్నాయి. ఇక నష్టాల విషయానికి వస్తే, ఎం అండ్ ఎం ఎక్కువ నష్టాన్ని చూడగా, తరువాత జాబితాలో ఐ టి సి, ఇన్ దిస్ ల్యాండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ అలాగే మారుతి కంపెనీలు ఉన్నాయి.

ఈ సంవత్సరంలో అత్యధిక లాభాలు వచ్చింది జూన్ లోనే అని చెప్పుకోవచ్చు. దీని వల్ల మార్కెట్ మళ్లీ బలపడుతుంది. యూరప్ మార్కెట్లలో లాభాలు కారణంగా దాని ప్రభావం భారత్లో కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, లాభాలు రావచ్చు మరోసారి నష్టం, కానీ లాభాలు కొనసాగుతున్న వేళ, షేర్స్ లో ఇన్వెస్ట్ చేయడం ఒక మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు. ఏదైతేనే, ఈసారి మాత్రం పవర్ గ్రిడ్ లాభాలు వర్షం చూసిందని చెప్పుకోవచ్చు.