AIF వాల్యుయేషన్కు SEBI  సరికొత్త మెథడాలజీ 

ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (AIF)కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ వాలిడేషన్ చేసేందుకు కొత్త పద్ధతిని SEBI తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, ఇన్వర్టర్లకు లాభదాయకంగా ఉండేందుకు కొన్ని లిక్విడేషన్ స్కీమ్స్ లో కూడా కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న 500కోట్లకు పైగా విలువచేసే ఫండ్స్ అలాగే కొత్త ఫండ్స్ మొత్తం అంతా కూడా అక్టోబర్ 31 కల్లా డీమెటీరియలైజ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా 500 కోట్లకు దిగువులో ఉండే ఫండ్స్ ఏప్రిల్ 30 నాటికల్లా వాటి […]

Share:

ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (AIF)కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ వాలిడేషన్ చేసేందుకు కొత్త పద్ధతిని SEBI తీసుకువచ్చింది. ఇందులో భాగంగా, ఇన్వర్టర్లకు లాభదాయకంగా ఉండేందుకు కొన్ని లిక్విడేషన్ స్కీమ్స్ లో కూడా కొన్ని మార్పులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న 500కోట్లకు పైగా విలువచేసే ఫండ్స్ అలాగే కొత్త ఫండ్స్ మొత్తం అంతా కూడా అక్టోబర్ 31 కల్లా డీమెటీరియలైజ్ చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా 500 కోట్లకు దిగువులో ఉండే ఫండ్స్ ఏప్రిల్ 30 నాటికల్లా వాటి యూనిట్స్ డీమెటీరియలైజ్  చేయబోతున్నట్లు తెలిపింది. 

SEBI దీని గురించి ఏం చెప్పబోతోంది: 

కొత్త మెథడాలజీ అనేది అమల్లోకి రాబోతోంది. అవి కూడా సరైన గైడ్లైన్స్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. కానీ ప్రస్తుతానికి, ఇన్వెస్టర్స్ గురించే మెయిన్ ఫోకస్ ఉంటుందని, మెథడాలజీ గురించి త్వరలోనే చెబుదామని వెల్లడించింది. అంతేకాకుండా ఏఐఎఫ్ పథకంలోని ప్రతి అసెట్ క్లాస్ కు సంబంధించి గైడ్లైన్స్ ప్రకారం వాల్యుయేషన్ మెథడాలజీ అలాగే అప్రోచ్ వివరాలు మేనేజర్ పిపిఎం (PPM)లో వెల్లడించాల్సి ఉంటుందని SEBI పేర్కొంది. వాల్యూషన్ చేసే ప్రక్రియలో పూర్తిగా ఇన్వెస్టర్లకు మద్దతు ఇవ్వాలని అలాగే పూర్తి బాధ్యత మానేజర్ కి ఉంటుందని SEBI చెప్పుకొచ్చింది. 

వాల్యుయేషన్ వివరాలు: 

దీనికి సంబంధించి ఒక స్వతంత్ర అభ్యర్థి ముఖ్యంగా ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా (IBBI)లో రిజిస్టర్ అవ్వబడి అలాగే అనలిస్ట్ సెక్యూరిటీ వాల్యూయేషన్లో కనీసం మూడేళ్ల అనుభవం ఉన్న ఒక వాల్యూయర్‌ని నియమించాలని SEBI పేర్కొంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ వాల్యూయర్‌, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అలాగే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ICSI), ఇంకా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వంటి ప్రొఫెషనల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెంబర్షిప్ ఉండాలని వెల్లడించింది. 

ముఖ్యంగా పెట్టుబడిదారులు కంపెనీతో సబ్స్టేషన్ ఒప్పందంలో అగ్రిమెంట్ ప్రకారం ఆడిట్ చేసిన అకౌంట్స్ను అందించడానికి ఒక నిర్దిష్ట కాలవ్యవధి నిర్దేశిస్తుందని మేనేజర్లు కు సూచించింది. ఇందులో ఆరు నెలల నిర్దిష్ట కాలవ్యవధి ఉంటుంది. మార్చి 31 నాటికి కొన్ని బెంచ్ మార్క్ ఏజెన్సీలకు ఆడిట్ చేయబడిన డేటా ఆధారంగా వాల్యుయేషన్ను నివేదించడానికి మేనేజర్ను అనుమతిస్తుంది. 

ఒకవేళ పెట్టుబడిదారుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ ఉండకపోతే లిక్విడేటెడ్ పెట్టుబడులు తప్పనిసరిగా పెట్టుబడిదారులకు ప్రత్యేకించి డిస్ట్రిబ్యూట్ చేయబడతాయని తెలిపింది. ఒకవేళ పెట్టుబడిదారులు ఇన్ స్పేస్ డిస్ట్రిబ్యూషన్ ని తీసుకోవడానికి ఇష్టపడనట్లయితే, అటువంటి పెట్టుబడిని ఏఐఎఫ్ రద్దు చేసుకోవాలి. దీనికి సంబంధించిన మేనేజర్ అలాగే ట్రస్టీ మరియు కి మేనేజ్మెంట్ వాళ్లు ఈ ప్రక్రియకు బాధ్యత వహించాలి. 

ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో వాల్యూయేషన్కు సంబంధించిన ఫ్రెండ్ వర్క్ ఈ సంవత్సరం నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని, అంతేకాకుండా లిక్విడేషన్ కు సంబంధించినవి ప్రతి ఒకటి తక్షణమే అమలులోకి వస్తాయని SEBI పేర్కొంది. 

SEBI అంటే ఏమిటి? ఇందులో ఏం జరుగుతుంది?: 

SEBI అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇది సెక్యూరిటీల మార్కెట్‌ను అనుకూలంగా కంట్రోల్ చేయడంతో పాటు సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి 1992లో భారత ప్రభుత్వంచే స్థాపించబడిన చట్టబద్ధమైన నియంత్రణ సంస్థ. 

ముఖ్యంగా SEBI  ఏం చేస్తుందంటే,

(1) ఇది బ్రోకర్లు, సబ్-బ్రోకర్లు, ట్రాన్స్ఫర్ ఏజెంట్లు, వ్యాపారి బ్యాంకులు మొదలైనవాటిని నమోదు చేస్తుంది.

(2) నియమాలు మరియు నిబంధనల నోటిఫికేషన్‌లు జారీ చేయడం

(3) రుసుము విధించడం

(4) పెట్టుబడి పథకాల నియంత్రణ

(5) అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నిషేధిస్తుంది