రోజుకు రూ.100 ఇన్వెస్ట్ చేస్తే.. నెలకు రూ.57 వేలు పెన్షన్​..!

రిటైర్మెంట్‌ జీవితం, ఆర్థిక భద్రత గురించి ముందు నుంచే ప్లాన్‌ చేసుకోకపోతే, ఉద్యోగ విరమణ తర్వాతీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది..పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్‌. దీనివల్ల, ఉద్యోగం జీవితం ముగిసిన తర్వాత కూడా పెన్షన్‌ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి,  రోజుకు చాలా తక్కువ మొత్తంలో పొదుపు చేసి పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకోవాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్ అందుబాటులోకి […]

Share:

రిటైర్మెంట్‌ జీవితం, ఆర్థిక భద్రత గురించి ముందు నుంచే ప్లాన్‌ చేసుకోకపోతే, ఉద్యోగ విరమణ తర్వాతీ తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది..పెన్షన్ స్కీమ్స్‌లో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టడం ఒక మంచి ప్లాన్‌. దీనివల్ల, ఉద్యోగం జీవితం ముగిసిన తర్వాత కూడా పెన్షన్‌ రూపంలో డబ్బులు వస్తూనే ఉంటాయి,

 రోజుకు చాలా తక్కువ మొత్తంలో పొదుపు చేసి పదవీ విరమణ తర్వాత పెద్ద మొత్తంలో పెన్షన్ అందుకోవాలని భావించే వారికి కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో రోజుకు రూ.100 కడితే చాలు. ఆ తర్వాత నెల నెల రూ. 57 వేల చొప్పున పెన్షన్ అందుకోవచ్చు.నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)  స్కీమ్‌లో చేరే ఏ వ్యక్తయినా, ఇంటి బడ్జెట్‌ మీద భారం పడకుండా చిన్న మొత్తంతో పెట్టుబడి స్టార్ట్‌ చేయవచ్చు

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)  స్కీమ్ వివరాలు ….

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఈ స్కీమ్‌ ద్వారా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఇందులో పొదుపు చేయడం ద్వారా పదవీ విరమణ తర్వాత నెల నెల పెన్షన్ రూపంలో రాబడి అందుకోవచ్చు. ఈ క్రమంలో నెలకు ఎంత పెన్షన్ కావాలి అనేది సైతం మీరే తెలుసుకునేలా నేషనల్ పెన్షన్ సిస్టమ్ ట్రస్ట్ కాలిక్యూలేటర్ తీసుకొచ్చింది. రిటైర్మెంట్ తర్వాత పెద్ద మొత్తంలో పెన్షన్ కోరుకునే వారు నెలకు ఎంత కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద, చాలా తక్కువ డబ్బును ఇన్వెస్ట్‌ చేసి ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. రోజుకు కేవలం రూ. 100 ఆదా చేసి, నెలకు రూ. 57,000 పెన్షన్ తీసుకోవచ్చు. 

మీ 25 సంవత్సరాల వయస్సులో, NPSలో, నెలకు రూ. 1500 (రోజుకు రూ. 50) పెట్టుబడి పెట్టడం స్టార్ట్‌ చేస్తే, 60 ఏళ్ల వయస్సులో మొత్తం కార్పస్ రూ. 57,42,416 అవుతుంది. వార్షిక వడ్డీ 10 శాతం చొప్పున ఈ లెక్క వస్తుంది. మీరు 75 సంవత్సరాల వయస్సు వరకు కూడా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం నుంచి నిష్క్రమించే సమయంలో, పెట్టుబడిదారు 100 శాతం వరకు కార్పస్‌తో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. మొత్తం డబ్బులు పెట్టి యాన్యూటీ ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే నెల నెల రూ. 28, 712 పెన్షన్ రూపంలో వస్తుంది. ఒక వేళ తన పెట్టుబడి మొత్తంలో 40 శాతం మాత్రమే యాన్యూటీ ప్లాన్ కోసం వెచ్చిస్తే అప్పుడు నెలకు పెన్షన్ సుమారూ రూ. 11, 485 వస్తుంది. అప్పుడు రూ. 34 లక్షల వరకు డ్రా చేసుకోవచ్చు.

రోజుకు ₹100తో ఎంత పెన్షన్‌ వస్తుంది?  

ఎన్‌పీఎస్ కాలిక్యులేటర్ ప్రకారం 25 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తి నేషనల్ పెన్షన్ సిస్టమ్‌లో రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3000 పొదుపు చేసినట్లయితే 60 ఏళ్లు వచ్చే సరికి 10 శాతం రాబడితో అతడి కార్పస్ రూ. 1 లక్షా 14 వేల 831 అవుతుంది. మెచ్యూరిటీ సమయంలో తన 100 శాతం కార్పస్ తో గనక యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేసినట్లయితే నెలకు రూ. 57 వేలు పెన్షన్ రూపంలో అందుతాయి. అలాగే కేవలం 40 శాతంతో యాన్యుటీ ప్లాన్ కొంటే అప్పుడు నెలకు రూ. 22 వేల 970 పెన్షన్ వస్తుంది. అయితే,పదవీ విరమణ తర్వాత ఏకమొత్తంగా రూ. 68 లక్షలు విత్‌డ్రా చేసుకోవచ్చు.