రిటైర్మెంట్ ను సింపుల్ గా ప్లాన్ చేసుకోండిలా

రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాలిక ప్రణాళిక.. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాలలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సిన అంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం అయితే కాదు. అందుకు ద్రవ్యోల్బన ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. మనం చేస్తున్న పనికే రిటైర్మెంట్ గాని, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం, వ్యాపారం ఆగిపోయిన మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం […]

Share:

రిటైర్మెంట్ అనేది తప్పనిసరి దీర్ఘకాలిక ప్రణాళిక.. అంతేకాదు, జీవితంలో ఖరీదైన లక్ష్యాలలో ఇది కూడా ఒకటి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత మరో 20 ఏళ్లు జీవించాల్సి రావడం, అందుకు కావాల్సిన అంత నిధిని సమకూర్చుకోవడం చిన్న విషయం అయితే కాదు. అందుకు ద్రవ్యోల్బన ప్రభావాన్ని ఎదుర్కొనే స్థాయిలో రిటైర్మెంట్ కోసం కేటాయింపులు చేసుకోవాలి. మనం చేస్తున్న పనికే రిటైర్మెంట్ గాని, మన జీవన అవసరాలకు కాదు. ఉద్యోగం, వ్యాపారం ఆగిపోయిన మన జీవన అవసరాలను తీర్చే ఆదాయం ఆగిపోకూడదని అనుకుంటే.. అందుకు ముందు నుంచి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి. అర్జన ఆరంభించిన వెంటనే, రిటైర్మెంట్ ప్రణాళిక మొదలు పెట్టాలి. వాస్తవానికి దీనిని నేటి యువత అస్సలు గుర్తించడం లేదు. దాంతో రిటైర్మెంట్ తర్వాత జీవితం ఎంతో మందికి సవాల్ గా మారుతుంది. 

రిటైర్మెంట్ వయసు

ది ఎకనామిక్ టైమ్స్ సర్వే ప్రకారం.. 80 శాతం భారతీయులు రిటైర్మెంట్ ని ప్లాన్ చేసుకోవడం లేదని తెలిపింది. రిటైర్మెంట్ వయసు అనేది.. ముందుగా నిర్ణయించుకోవాలి. సాధారణంగా 58 నుంచి 60 ఏళ్ళు వచ్చిన తరువాత ప్రతి ఒక్కరూ రిటైర్మెంట్ను కోరుకుంటారు. అయితే నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా.. మీ ఆరోగ్య రీత్యా మీ డాక్టర్ ఇచ్చిన సలహా మేరకు కూడా మీరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి అనేది చూసుకోవాలి. 

ఆలస్యం వద్దు

రిటైర్మెంట్ ఆలస్యం చేసిన కొద్ది లక్ష్యం భారంగా మారుతుంది. 25 ఏళ్ల వయసు నుంచే ప్రతి నెల 5000 చొప్పున 60 ఏళ్లకు ఇన్వెస్ట్ చేస్తే.. 35 ఏళ్ల కాలంలో ఎంత సమకూరుతుంది. 12 శాతం కాంపౌండ్ రాబడి అంచనా ప్రకారం.. రూ. 3.5 కోట్లు సమకూరుతుంది.  కేవలం నెలకు రూ.5000 అంత పెద్ద నిధిగా మారిందంటే.. అదే కాంపౌండింగ్ మహిమ. ఒకవేళ ఈ పెట్టుబడిని ఒక ఏడాది ఆలస్యంగా పెట్టారనుకోండి.. మీకు 37 లక్షల లాస్ వస్తుంది. కాబట్టి ఎంత త్వరగా రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకుంటే.. మీకు అన్ని లాభాలు ఉంటాయి. 

సమకూర్చుకునేది ఎలా.?

రిటైర్మెంట్ ప్రణాళికలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి రిటైర్మెంట్ సమయం వచ్చేంతవరకు కావలసిన డబ్బులను సమకూర్చుకోవడం. ఆ తర్వాత ఆ నిధి నుంచి ప్రతి నెల రాబడి పొందడం రెండోది అవుతుంది. 25 నుంచి 30 ఏళ్ల కాల వ్యవధి ఉంటుంది. కనుక పెట్టుబడులకు ఈక్విటీలను మెరుగైన మార్గంగా చూడాలి. నిపుణుల సాయంతో రాబడుల అంచనాలు కాలవ్యవధి ఆధారంగా పోర్టు ఫోలియోను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఉపసంహరించుకోవడం

మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే రిటైర్మెంట్ తర్వాత సిస్టమాటిక్ విత్ డ్రాయల్ మార్గాన్ని ఎంపిక చేసుకోవచ్చు. దీని వలన ప్రతినెల మీ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమవుతాయి.  NPS లో ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక.. రిటైర్మెంట్ నాటికి సమకూరిన మొత్తం నుంచి 60 శాతాన్ని వెనక్కి తీసుకోవచ్చు. దీనిపైన పన్ను భారం ఉండదు. అయితే ఈ మొత్తాన్ని మెరుగైన రాబడి వచ్చే సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అప్పుడే మిగిలిన 30 ఏళ్ల జీవన అవసరాలకు అనుగుణంగా పెట్టుబడి వృద్ధిని చేసుకోవచ్చు. ప్రణాళిక విషయంలో ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. రిటైర్మెంట్ విధిని సమకూర్చుకునే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.