జీఎస్టీ పేరుతో జేబుకు బొక్క పెడుతున్న రెస్టారెంట్స్.. ఎలా మోసం చేస్తున్నాయో చూడండి..

కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ బిల్లుపై వినియోగదారుల నుంచి నకిలీ జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మూడు మార్గాల్లో కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఆ వారం అంతా అలసిపోయి ఎంచక్కా ఎంజాయ్ చేయాలని దగ్గర లోని రెస్టారెంట్ కి వెళ్లడం సహజం.. పనిలో పనిగా భార్యతో పాటు పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇక భార్యకు ట్రీట్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది.. నచ్చిన […]

Share:

కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ బిల్లుపై వినియోగదారుల నుంచి నకిలీ జీఎస్టీ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఈ మూడు మార్గాల్లో కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. వాటిని ఎలా గుర్తించాలో తెలుసుకుందాం.

వీకెండ్ వచ్చిందంటే చాలు.. ఆ వారం అంతా అలసిపోయి ఎంచక్కా ఎంజాయ్ చేయాలని దగ్గర లోని రెస్టారెంట్ కి వెళ్లడం సహజం.. పనిలో పనిగా భార్యతో పాటు పిల్లల్ని తీసుకువెళ్తే వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఇక భార్యకు ట్రీట్ ఇచ్చినట్లు కూడా ఉంటుంది.. నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకొని ఇష్టంగా లాగించేసి.. వస్తూ వస్తూ ఆ రెస్టారెంట్ వాడు ఇచ్చిన బిల్ ని పే చేసి వచ్చేస్తాం ఇక్కడే మనం చాలా పెద్ద పొరపాటు చేస్తున్నాం.. మనం కట్టే బిల్లులో బోలెడన్ని అవకతవకలు ఉన్నాయని.. ముఖ్యంగా నకిలీ జీఎస్టీ విధిస్తున్నారని వాపోయిన వారు చెబుతున్నారు.. అసలు నకిలీ జిఎస్టి ఎలా విధిస్తారు.?? మనం ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నకిలీ జీఎస్టీ గుర్తించండిలా.. 

కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు కస్టమర్ల నుంచి నకిలీ జీఎస్టీ వసూలు చేస్తున్నాయి. ఈ రెస్టారెంట్లు, హోటళ్లు జీఎస్టీ పేరుతో ప్రజలను మూడు విధాలుగా జనాలను  తప్పుదోవ పట్టిస్తున్నాయి. మొదటి పద్ధతి ఏంటంటే.. బిల్లుపై జీఎస్‌టీ బిల్లు రాయకుండానే వినియోగదారుల నుంచి జీఎస్‌టీ ఛార్జీలు వసూలు చేయడం. ఇక రెండో విధానం ఏమిటంటే.. హోటల్ జీఎస్‌టీ పరిధిలోకి రాదు.. అంతేకాకుండా వాళ్ళ జీఎస్‌టీ నంబర్ యాక్టివ్‌గా ఉండదు. మూడవది ఏమిటంటే.. జీఎస్‌టీ నంబర్ కూడా ఉన్నా కానీ.. ఇది జీఎస్‌టీ బిల్లు పరిధిలోకి రాదు అంటే ఇది కంపోజిషన్ స్కీమ్ కింద కాదు, ఇది మీ నుంచి జీఎస్‌టీ ని వసూలు చేస్తుంది. ఇలాంటి సమయంలో మీరు ఈ జీఎస్‌టీ బిల్లులను చెక్ చేయవచ్చు. ఇలాంటివి మీరు ఏమైనా గమనిస్తే.. వెంటనే వారి పై ఫిర్యాదు చేయవచ్చు. 

ఫిర్యాదు చేయండి..

పైన చెప్పుకున్న విధానాల్లో  జీఎస్‌టీ వసూలు చేయవచ్చు. మీరు ఈ బిల్లును చెల్లించడానికి నిరాకరించవచ్చు. రెస్టారెంట్, హోటల్ వాళ్ళు మీ దగ్గర జీఎస్‌టీ ని వసూలు చేయవచ్చు. మీకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు అని అనిపిస్తే.. అప్పుడు మీరు జీఎస్‌టీ హెల్ప్‌లైన్ నంబర్ 18001200232 కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అప్పుడు  వారు హోటళ్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటారు.

జీఎస్టీ ఇంత.. వేసింది ఎంతో..

రెస్టారెంట్, హోటల్ కేటగిరీ ప్రకారం.. జీఎస్‌టీ బిల్లు వసూలు చేస్తారు. మామూలుగా, ఫుడ్  తో పాటు వినియోగదారుల నుంచి 5 శాతం GST వసూలు చేస్తారు. కొన్ని కొన్ని చోట్ల 12 శాతం జీఎస్‌టీ వసూలు చేస్తారు. అదే మీరు ఖరీదైన హోటల్ , రెస్టారెంట్‌ కి వెళ్తే.. మీకు 18 శాతం జీఎస్‌టీ ఛార్జ్ చేస్తారు. 

ఈ విధంగా హోటల్, రెస్టారెంట్ మేనేజ్మెంట్ మీ దగ్గర జీఎస్‌టీ విధిస్తారు.. అలా కాకుండా కొన్ని హోటల్ వాళ్ళు అసలు కంటే ఎక్కువ జీఎస్‌టీ విధిస్తున్నారు. అలా 28 శాతం వరకు వసూలు చేస్తున్నారు. మీకు కూడా అలా వసూలు చేస్తున్నట్లు అనిపిస్తే వెంటనే మీరు జీఎస్‌టీ హెల్ప్ లైన్ నంబర్ కి కంప్లైంట్ చేయవచ్చు.  ఇలాంటి మోసపూరిత చర్యల పట్ల జాగ్రత్త వహించండి.. మీ వారితో పాటు మీ మిత్రులతో కూడా ఈ విషయాలను పంచుకోండి.