రిలయన్స్ కొత్త సీఎఫ్ఓగా శ్రీకాంత్..!

దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రిలయన్స్ సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. 25వ సంవత్సరంలో సిఎఫ్ఓగా నియమితులైన అలోక్ అగర్వాల్ స్థానాన్ని ఇప్పుడు శ్రీకాంత్ వెంకటాచారి భర్తీ చేయనున్నారు. ఇక అలోక్ అగర్వాల్ కంపెనీ చైర్మన్ గా […]

Share:

దేశీయ కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు.

ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా శ్రీకాంత్ వెంకటాచారి నియమితులయ్యారు. ఈ నియామకం జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నట్లు రిలయన్స్ సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. 25వ సంవత్సరంలో సిఎఫ్ఓగా నియమితులైన అలోక్ అగర్వాల్ స్థానాన్ని ఇప్పుడు శ్రీకాంత్ వెంకటాచారి భర్తీ చేయనున్నారు. ఇక అలోక్ అగర్వాల్ కంపెనీ చైర్మన్ గా మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సీనియర్ సలహాదారుడుగా నియమితులు కాబోతున్నారు. వీరందరి నియామకాలు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయి.

అలోక్ అగర్వాల్ ..

రిలయన్స్ యొక్క సీఎఫ్ఓగా అలోక్ అగర్వాల్ కంపెనీతో దాదాపు 30 సంవత్సరాల అనుబంధాన్ని కలిగి ఉన్నారు. ఆయన 2005లో సీఎఫ్ఓగా నియమితులు అయ్యారు.  కంపెనీ యొక్క చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ శ్రీ అలోక్ అగర్వాల్ 30 సంవత్సరాల విశిష్టత తర్వాత జూన్ 1 2023 నుండి అమలులోకి వచ్చే విధంగా విస్తృత వ్యూహాత్మక సమస్యలపై సహాయం చేస్తూ కంపెనీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కు సీనియర్ సలహాదారుగా ఉన్న పాత్రను ఆయన స్వీకరిస్తారు. ఫైనాన్స్ విభాగంలో ఆయన నిష్ణాతుడు అయిన ఒక ఫైనాన్స్ ప్రొఫెషనల్ అని చెప్పవచ్చు. అతను 2005లో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమిత్రుడయ్యాడు. ఇక కంపెనీ యొక్క పరివర్తన ప్రయాణంలో ఆయన చేసిన కృషికి బోర్డ్ ప్రశంసించింది.

శ్రీకాంత్ వెంకటాచారిని సీఎఫ్ఓ..

ఇకపోతే రిలైన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ల బోర్డు 2023 మార్చి 24న జరిగిన సమావేశంలో మానవ వనరులు, నామినేషన్, జీతాల కమిటీ సిఫార్సు మేరకు శ్రీకాంత్ వెంకటాచారిని సీఎఫ్ఓ గా నియమించారు. అతను 2011 నుండి అలోక అగర్వాల్తో సీఎఫ్ఓ పదవిలో కొంత భాగాన్ని పంచుకుంటున్నారు. శ్రీకాంత్ గత 14 సంవత్సరాలుగా రిలయన్స్ లో కొనసాగుతున్నారు. హ్యూమన్ రిసోర్సెస్, నామినేషన్ మరియు రెమినరేషన్ కమిటీ సిఫార్సు ఆధారంగా కంపెనీ డైరెక్టర్ బోర్డులు శ్రీకాంత్ వెంకటాచారిని సీఎఫ్ఓ గా నియమించింది.

రిలయన్స్ 2022 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో రూ 15,792 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది ఇక క్రితం సంవత్సరం కాలంలో నివేదించబడిన వాటిలో రూ.18,549 కోట్లతో పోలిస్తే 14.8% తక్కువనే చెప్పాలి ఇక రిపోర్టింగ్ త్రైమాసికంలో చమురు రిటైల్ టెలికం సమ్మేళనం యొక్క కార్యకలాపాల ద్వారా ఆదాయం 15% పెరిగింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం అక్షరాల రూ 2.20 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంలో రూ.1.91 లక్షల కోట్లతో పోల్చుకుంటే శుక్రవారం బిఎస్సిలో కంపెనీ స్క్రిప్ 1.96 శాతం తగ్గి రూ.2,203.50 వద్ద ముగిసింది.

ఈ క్రమంలోనే పదవులను ఇప్పుడు మార్చినట్టుగా సమాచారం. ఇప్పుడు కొత్త సీఎఫ్ఓగా శ్రీకాంత్ వెంకటాచారి జూన్ 1వ తేదీ నుంచి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కాబట్టి ఇక ఎలాగైనా సరే ఈ కొత్త ఫైనాన్స్ ఇయర్ ఆదాయాన్ని మరింత పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ముకేష్ అంబానీ ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ ఆదాయం వైపు.. ముగ్గు చూపడమే కాదు వినియోగదారులను సంతృప్తి పరచడంలో కూడా ఆయన ఎప్పుడూ ముందుంటారు .అందుకే రిలయన్స్ కు దేశంలో విపరీతమైన గుర్తింపు ఉంది. అందుకే దేశీయ నంబర్వన్ దిగ్గజ కంపెనీగా రిలయన్స్ పేరు దక్కించుకుంది. మరి ఇప్పుడు సిఎఫ్ఓగా నియమితులైన వారు ఎలా తమ ప్రతిభను నిరూపించుకుంటారో తెలియాల్సి ఉంది.

Tags :