Mukesh Ambani: పశ్చిమ బెంగాల్‌ లో ₹45,000 కోట్లు పెట్టుబడి పెట్టిన RIL

మరో మూడు సంవత్సరాల వరకు ప్లానింగ్..

Courtesy: Twitter

Share:

Mukesh Ambani: ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఈ పేరు వినగానే ప్రపంచంలో సంపన్న వ్యక్తులలో ఒకరు గుర్తిస్తారు కదా. ఇంక భారతదేశంలో ఉన్నవారికి అంబానీ (Mukesh Ambani) గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన వాడే పెన్ విలువ కొన్ని కోట్లు ఉంటుంది. ఆయనకి తెలియని వ్యాపారం లేదు ముఖ్యంగా ఆయన వ్యాపారాల్లో రిలయన్స్ (Reliance) అనేది చాలా పాపులర్ అయింది. అయితే ఈ రిలయన్స్ (Reliance) కి సంబంధించిన ఒక ప్రత్యేకమైన బిజినెస్ కు సంబంధించి అప్డేట్ ఈరోజు చూద్దాం.

బెంగాల్‌ లో ₹45,000 కోట్లు పెట్టుబడి పెట్టిన RIL: 

రిలయన్స్ (Reliance) ఇండస్ట్రీస్, పశ్చిమ బెంగాల్‌ (Bengal)లో ₹45,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. అంతే కాకుండా వచ్చే మూడేళ్లలో 20,000 కోట్లు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని, కోల్‌కతాలో జరిగిన బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 7వ ఎడిషన్‌లో చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) చెప్పారు. ప్రధానంగా టెలికాం, రిటైల్ మరియు బయో ఎనర్జీ అనే మూడు రంగాలలో పెట్టుబడులు పెట్టడం జరిగింది. రిలయన్స్ (Reliance) ద్వారా జియో ఫైబర్, ఎయిర్ ఫైబర్‌తో, బెంగాల్‌ (Bengal)లోని ప్రతి ఇల్లు అతి త్వరలోనే స్మార్ట్ హోమ్‌లుగా మార్చేస్తాయని అని, రిలయన్స్ (Reliance) అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఈ సందర్భంగా చెప్పారు. మరి ముఖ్యంగా ఈ పెట్టుబడులు, బెంగాల్‌ (Bengal)లోని లక్షలాది మందికి కొత్త ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను అందిస్తుందని.. భారతదేశం అంతటా.. అదేవిధంగా బయట ఉన్న ఎన్నో వ్యాపారాలు కూడా బెంగాల్‌ (Bengal) వైపు తిరిగే రోజు ఎంతో దూరంలో లేదని.. బెంగాల్ రాష్ట్రంలో 98.8%.. కోల్‌కతా టెలికాం సర్కిల్‌లో 100% జనాభా కవరేజీని సాధించామని సంతోషంగా ప్రకటించారు, రిలయన్స్ (Reliance) అధిపతి అంబానీ (Mukesh Ambani).

బయో ఎనర్జీ ఉత్పత్తిదారులు: 

వచ్చే రెండేళ్లలో రిలయన్స్ (Reliance) రిటైల్ స్టోర్ల సంఖ్యను 1000 నుంచి 1200కి విస్తరిస్తుందని అంబానీ (Mukesh Ambani) తెలిపారు.

తమ రిలయన్స్ (Reliance) కు సంబంధించి రిటైల్ వ్యాపారం వందలాది MSMEలకు మద్దతునిస్తోందని.. ప్రభుజీ, ముఖరోచక్, సిటీ గోల్డ్, బిస్క్ ఫార్మ్ మరియు ఇతరులతో పార్ట్నర్స్ గా మారి, తమ దేశమైనా భారతదేశం అంతటా తమదైన శైలిలో సేవలు అందించామని ముఖేష్ అంబానీ (Mukesh Ambani) పేర్కొన్నారు. స్వంత స్వదేశీ అభివృద్ధి చెందిన సాంకేతికత ఆధారంగా, భారతదేశానికి చెందిన అతిపెద్ద బయో-ఎనర్జీ (Bio Energy) ఉత్పత్తిదారుగా తమ కంపెనీ అంబానీ (Mukesh Ambani) చెప్పారు.

బయో-ఎనర్జీ (Bio Energy)తో సహా న్యూ ఎనర్జీలో బహుళ కార్యక్రమాలతో రిలయన్స్ (Reliance) ఈ బాధ్యతను నిర్వహిస్తోందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద బయో ఎనర్జీ ఉత్పత్తిదారుగా అవతరించే అవకాశం భారతదేశానికి ఉందని.. రాబోయే మూడింటిలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నామని.. సంవత్సరాలుగా, 5.5 మిలియన్ టన్నుల వ్యవసాయ, సేంద్రీయ వ్యర్థాలను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

రిలయన్స్ (Reliance) కూడా రైతులకు తోటల పెంపకంలో సహాయం చేస్తుందని అంబానీ (Mukesh Ambani) తెలిపారు. రైతులకు పెద్ద ఎత్తున ఎనర్జీ ప్లాంటేషన్లను పెంచడానికి సహాయం చేస్తామని.. దాదాపు 2 మిలియన్ టన్నుల కార్బన్ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని.. ఏటా 2.5 మిలియన్ టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేస్తుందని.. బెంగాల్‌ (Bengal)లో CBG ప్లాంట్‌లను నెలకొల్పాలని ఆలోచన చేస్తున్నట్లు, ఇది బెంగాల్ రైతులు అన్నదాతలకు, ఊర్జా దాతలుగా, ఆహారం మరియు ఇంధన ఉత్పత్తిదారులుగా తమని మార్చడం ద్వారా వారి ఆదాయాన్ని పెంచడానికి వీలు కల్పిస్తుందని, ఈ మూడు వ్యాపారాలలో తమ ప్రస్తుత, కొత్త పెట్టుబడులతో, రిలయన్స్ (Reliance) బెంగాల్‌ (Bengal)లోని గొప్ప వ్యక్తులతో కలిసి భాగస్వామ్య శ్రేయస్సు, సాంకేతిక ఆవిష్కరణలు, కలుపుగోలుత, సామరస్యం కోసం ముందుకు సాగుతుంది, అంటూ కోల్‌కతాలో జరిగిన సభ సందర్భంగా అంబానీ (Mukesh Ambani) మాట్లాడారు.