ఆర్‌బిఎల్ బ్యాంక్ ఎంఎల్‌సిఆర్ ని అన్ని టేనర్‌లలో 20 బేసిస్ పాయింట్లు పెంచింది; అంటే ఏమిటి

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బిఎల్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంఎల్‌సిఆర్) 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన కొత్త ఎంఎల్‌సిఆర్ రేట్లు ఫిబ్రవరి 22, 2023 నుండి అమలులోకి వస్తాయని ఈ బ్యాంక్ తెలిపింది. ఎంఎల్‌సిఆర్ రేట్ల పెరుగుదల కారణంగా, ఎంఎల్‌సిఆర్ తో అనుసంధానించబడిన టర్మ్ లోన్‌లకు సంబంధించిన వడ్డీరేట్లు పెరుగుతాయి. దీని కారణంగా పర్సనల్ లోన్స్, హోం లోన్స్, ఇంకా వేరే ఋణాలకి […]

Share:

ప్రముఖ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఒకటైన ఆర్‌బిఎల్ బ్యాంక్ తన మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంఎల్‌సిఆర్) 20 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన కొత్త ఎంఎల్‌సిఆర్ రేట్లు ఫిబ్రవరి 22, 2023 నుండి అమలులోకి వస్తాయని ఈ బ్యాంక్ తెలిపింది.

ఎంఎల్‌సిఆర్ రేట్ల పెరుగుదల కారణంగా, ఎంఎల్‌సిఆర్ తో అనుసంధానించబడిన టర్మ్ లోన్‌లకు సంబంధించిన వడ్డీరేట్లు పెరుగుతాయి. దీని కారణంగా పర్సనల్ లోన్స్, హోం లోన్స్, ఇంకా వేరే ఋణాలకి సంబంధించిన ఈఎంఐలు పెరుగుతాయి. ఆర్‌బీఎల్ బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న వారి ఋణ ఈఎంఐలు పెరుగుతాయి.

ప్రస్తుతం ఆర్‌బిఎల్ బ్యాంక్ ఓవర్‌నైట్ ఎంఎల్‌సిఆర్ ని 8.95% వడ్డీ రేటుతో ఒక నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఒక సంవత్సరం వ్యవధులలోను ఆర్‌బిఎల్ రేట్లను అందిస్తుంది. ఆర్‌బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క అధికారిక వెబ్‌సైట్ ఇలా పేర్కొంది: “(ఆర్‌బిఐ అనుమతించిన మినహాయింపులు మినహా) మంజూరయిన అన్ని రూపాయల ఋణాలు, రెన్యూ అయిన అన్ని క్రెడిట్ లిమిట్స్ కి పైన పేర్కొన్న విధంగా టేనర్ ఆధారిత ఎంఎల్‌సిఆర్ ధర నిర్ణయించబడుతుంది.”

ఎంఎల్‌సిఆర్ రేట్ల తాజా పెంపు ప్రస్తుత, కొత్త ఋణగ్రహీతలకు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఎంఎల్‌సిఆర్ పెరిగిన తర్వాత, ఆర్‌బిఎల్ బ్యాంక్ ప్రస్తుతం ఓవర్‌నైట్ ఎంఎల్‌సిఆర్ 8.95 శాతం, ఒక నెల ఎంఎల్‌సిఆర్ 9.05 శాతం, మూడు నెలల ఎంఎల్‌సిఆర్ 9.35 శాతం, 6 నెలల ఎంఎల్‌సిఆర్ 9.75 శాతం, ఒక సంవత్సరం ఎంఎల్‌సిఆర్ 10.15 శాతం చొప్పున అందిస్తోంది.

లోన్ శాంక్షన్ చేసిన తేదీ నుండి రుణగ్రహీతలకు ఎంఎల్‌సిఆర్ వర్తిస్తుంది. ఫలితంగా సవరించిన తేదీ నుండి వడ్డీ రేటు ఎంఎల్‌సిఆర్ కి సర్దుబాటు చేయబడుతుంది. ఈ మధ్య ఆర్‌బిఎల్ బ్యాంక్ ఎంఎల్‌సిఆర్ ని 20 బేసిస్ పాయింట్లు పెంచినందున, ఎంఎల్‌సిఆర్ లింక్డ్ లోన్ ఉత్పత్తులకు సంబంధించిన ఈఎంఐలు పెరగనున్నాయి.

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఆర్‌బిఎల్ బ్యాంక్ నికర లాభం 33 శాతం పెరిగి రూ. 208.97 కోట్లు అయ్యింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ బ్యాంకుకు వచ్చిన మొత్తం లాభం రూ. 156.1 కోట్లు. అలాగే మూడో త్రైమాసికంలో వడ్డీ వల్ల వచ్చిన మొత్తం ఆదాయం 14 శాతం పెరిగి రూ. 1,148 కోట్లకు చేరింది.

ఫిబ్రవరి 8, 2023న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మే 2022 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారి రెపో రేటును 40 బేసిస్ పాయింట్లు పెంచింది. ఆపై జూన్ – అక్టోబర్ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా మూడు సార్లు రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది.

ఆ తర్వాత డిసెంబర్ నెలలో చివరిసారిగా రెపో రేటును 35 బేసిస్ పాయింట్లు పెంచింది. ఇప్పుడు తాజాగా మరో 25 బేసిస్ పాయింట్ల పెంపుతో.. ప్రస్తుతం 6.50 శాతానికి చేరుకుంది. దీంతో దేశంలోని బ్యాంకులన్నీ ఋణాల వడ్డీరేట్లను పెంచుతున్నాయి.