నయా యాప్ తీసుకొచ్చిన ఫోన్‌పే.. ప్రత్యేకతలు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

ఫోన్‌పే సరికొత్త ఈ కామర్స్ యాప్ పిన్ కోడ్.. ప్రముఖ ఫిన్‌టెక్  సంస్థ ఫోన్‌పే ఈ కామర్స్ వైపు అడుగులు వేస్తోంది.. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపడం స్వీకరించడమే కాదు! వస్తువుల్ని కూడా ఆర్డర్ పెట్టవచ్చు. కాకపోతే ఫోన్‌పే దీని కోసం వేరే యాప్‌ను డిజైన్ చేసింది.. ఇందులో భాగంగా పిన్ కోడ్ యాప్‌ను తీసుకువచ్చినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది..  ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికగా ఈ యాప్ పనిచేస్తుందని […]

Share:

ఫోన్‌పే సరికొత్త ఈ కామర్స్ యాప్ పిన్ కోడ్..

ప్రముఖ ఫిన్‌టెక్  సంస్థ ఫోన్‌పే ఈ కామర్స్ వైపు అడుగులు వేస్తోంది.. ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపడం స్వీకరించడమే కాదు! వస్తువుల్ని కూడా ఆర్డర్ పెట్టవచ్చు. కాకపోతే ఫోన్‌పే దీని కోసం వేరే యాప్‌ను డిజైన్ చేసింది.. ఇందులో భాగంగా పిన్ కోడ్ యాప్‌ను తీసుకువచ్చినట్లు మంగళవారం అధికారికంగా ప్రకటించింది.. 

ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ వేదికగా ఈ యాప్ పనిచేస్తుందని ఫోన్‌పే ప్రకటించింది. ఈ యాప్ మొదటిగా బెంగళూరు వాసులకు అందుబాటులోకి రానుందని కంపెనీ సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. త్వరలో అన్ని ప్రాంతాలకు తమ సేవలు విస్తరించనున్నామని ఆయన చెప్పుకొచ్చారు.

10 వేలు దాటితే సేవల విస్తరణ.. 

పిన్ కోడ్ యాప్‌లో గ్రోసరి,  కిరాణా,  ఫ్యాషన్‌ , ఆహారం, ఫార్మసీ, గృహాలంకరణ, ఎలక్ట్రానిక్స్ కేటగిరీల లోని ఉత్పత్తులను ఆర్డర్‌ చేసుకోవచ్చు. ఈ కేటగిరీల్లో కొన్ని వేల మంది వ్యాపారులను భాగస్వాములుగా తీసుకొని పిన్‌కోడ్ యాప్ స్టార్ట్ చేశారు. ఈ యాప్‌లో  రోజుకు 1,000 వరకు ఆర్డర్‌లు వస్తున్నట్లు సమాచారం. బెంగళూరులో రోజుకు 10,000 లావాదేవీలు దాటితే.. అప్పుడు ఈ యాప్‌ సేవలను మిగతా నగరాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. కాకపోతే.. ఇంటర్‌-సిటీ డెలివరీలు లేవు.  అయితే ప్రస్తుతానికి ఈ యాప్ ద్వారా బెంగళూరులోనే ఆర్డర్ చేయగలరు. అంటే..  ఏ నగరంలో యాప్‌‌ను లాంచ్‌ చేస్తే..  ఆ నగరం పరిధిలో మాత్రమే సేవలను అందిస్తుంది.. అంతేకానీ.. ఒక నగరం నుంచి మరో నగరానికి ఉత్పత్తులను డెలివరీ చేయరు..

ఇండియాలోని ఫిజికల్ షాపులను ఎవరైనా డిజిటలైజ్ చేయవచ్చని మేం నిరూపించాలనుకుంటున్నాం.. షాప్‌ ఓనర్లు వారి కస్టమర్‌‌లతో మాట్లాడటానికి పిన్‌కోడ్‌ ఒక వేదికను ఏర్పాటు చేస్తుందని ఫోన్‌‌పే కో-ఫౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌ సమీర్ నిగమ్ చెప్పారు. అందుకే ఇది హైపర్‌ లోకల్ స్ట్రాటజీ అని తెలిపారు.

డిసెంబర్‌ నాటికి లక్ష టార్గెట్‌..

ఈ ఏడాది చివరి నాటికి.. పిన్‌కోడ్‌ యాప్‌ ద్వారా రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిగమ్‌ అన్నారు.  ONDCలో తాము సెల్లర్‌ ప్లాట్‌ఫామ్‌గా ఉండబోమని, కొనుగోలుదార్ల మీద దృష్టి పెడతామని నిగమ్‌ తెలిపారు. ఆర్డర్ నిర్వహణ వంటి సెల్లర్‌ పనుల్లో తాము జోక్యం చేసుకునేది లేదని అన్నారు.

ఈ కామర్స్ బిజినెస్‌ ఫోన్‌పేలో జీర్ణించుకుపోయి ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ గత మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి విడిపోయి ఈ కామర్స్ బిజినెస్‌లోకి ఈ కంపెనీ అడుగుపెట్టింది. పిన్‌కోడ్ యాప్ కోసం  ఈ కంపెనీ 15 మిలియన్ల పెట్టుబడిని కేటాయించింది. మామూలుగా ఒక కొత్త వ్యాపారానికి ఈ స్థాయిలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ కామర్స్ అనేది అధిక లాభాలను ఆర్జించగల వ్యాపారం అని, దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగల సామర్థ్యం తమకు ఉందని నిగమ్ చెప్పారు. ఫోన్‌పే ఈ కామర్స్ బిజినెస్ మీద సీరియస్‌గా దృష్టి సారించిందని ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతే కాకుండా బీమా స్టాక్ బ్రోకింగ్ పెట్టుబడులు, ఆఫర్లతో ఆర్థిక సేవల సంస్థగా కూడా ఫోన్‌పే విస్తరించి ఉంది. ఈ వ్యాపార లైసెన్స్‌ల కోసం దరఖాస్తు కూడా చేసినట్లు సమాచారం ప్రస్తుతానికి ఫోన్‌పే వాల్ మార్ట్ జనరల్ అట్లాంటిక్ సహా ఇతర ప్రముఖ పెట్టుబడిదారుల నుంచి ఒక బిలియన్ నిధులను సేకరించే పనిలో ఉందని సమాచారం.