వివిధ అవసరాలను తీర్చే ప్రభుత్వ పథకాలు

ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాలు సీనియర్ సిటిజన్లు మరియు ఇతర కేటగిరీలకు చెందిన వారికి అలాగే, వివిధ అంశాలపై అవసరాలు ఉన్నవారికి పథకాలు అనేవి అందుతాయి. ఈ కార్యక్రమాలు బ్యాంకింగ్, బీమా, డిజిటల్ చెల్లింపులు మరియు పదవీ విరమణ ప్రణాళికల వంటి అంశాల వారీగా ఇందులో ఉంటాయి. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని కీలకమైన పథకాలు: ప్రధాన మంత్రి […]

Share:

ఆర్థిక స్వాతంత్య్రాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం భారతదేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. ఈ పథకాలు సీనియర్ సిటిజన్లు మరియు ఇతర కేటగిరీలకు చెందిన వారికి అలాగే, వివిధ అంశాలపై అవసరాలు ఉన్నవారికి పథకాలు అనేవి అందుతాయి. ఈ కార్యక్రమాలు బ్యాంకింగ్, బీమా, డిజిటల్ చెల్లింపులు మరియు పదవీ విరమణ ప్రణాళికల వంటి అంశాల వారీగా ఇందులో ఉంటాయి.

ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని కీలకమైన పథకాలు:

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన [PMJDY]:

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో నేషనల్ మిషన్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్‌గా ప్రకటించారు. భారతదేశంలోని ప్రజలకు బ్యాంకుల్లోని వివిధ సౌకర్యాలను కల్పించడమే కాకుండా వారి ఆర్థిక స్థిరత్వాన్ని నిర్ధారించడానికి ఈ పథకం ప్రారంభించబడింది. బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు లేని వారు, అదేవిధంగా మినిమం బాలన్స్ లేకుండా ఎకౌంటు ఓపెన్ చేసుకోవచ్చు. పొదుపు ఖాతాను తెరవడానికి అవసరమైన అధికారిక చెల్లుబాటు అయ్యే పత్రాలు కూడా లేని వ్యక్తులు వారి స్థితిని స్వీయ-ధృవీకరణ ద్వారా చిన్న ఖాతాను తెరవడానికి వెసిలిబాటు ఆప్షన్ కూడా అందిస్తుంది.

అలాగే, బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక ఉత్పత్తుల గురించి తక్కువ అవగాహన ఉన్న వారికి కూడా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం ద్వారా PMJDY గురించి మరిన్ని వివరాలు బాగా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా, ప్రజలు రూ. 2 లక్షల ఇన్‌బిల్ట్ ప్రమాద బీమాతో వస్తున్న రూపే డెబిట్ కార్డ్‌ని ఈ పథకం ద్వారా అందుకుంటారు. ఈ పథకం ద్వారా, ప్రభుత్వం బీమా కవరేజ్, ప్రభుత్వ సబ్సిడీలు మరియు క్రెడిట్ సౌకర్యాలను అందిస్తుంది.

ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన [PMSBY]: 

18 నుండి 70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు, జూన్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు కవరేజీ వ్యవధిలో మే 31వ తేదీలోపు ఆటో డెబిట్‌లో చేరడానికి సమ్మతి ఇచ్చిన వారు ఈ స్కీమ్‌లో చేరడానికి అర్హులు. KYC కోసం బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ అనేది ప్రాథమిక అవసరం. ఈ పథకం కింద ప్రమాదవశాత్తు వ్యక్తి మరణించిన, లేదంటే మొత్తం వైకల్యానికి గురైన రూ. 2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ. 1 లక్ష ఈ భీమ ద్వారా అందిస్తారు. ఈ పథకాన్ని పబ్లిక్ సెక్టార్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఆఫర్ చేస్తాయి, ఇవి నిబంధనలతో కూడిన బీమా పథకాన్ని మనకు అందించడానికి ఆసక్తి చూపిస్తాయి మరియు ముఖ్యంగా బ్యాంకులతో అనుసంధానం ఉంటుంది.

అటల్ పెన్షన్ యోజన [APY]:

ఈ పథకం మే 9, 2015న ప్రారంభించడం జరిగింది. ఇది 18 నుండి 40 సంవత్సరాల వయస్సు గల సేవింగ్ బ్యాంక్ ఖాతాదారులందరికీ అందుబాటులో ఉంటుంది. ఈ పథకం కింద, 60 సంవత్సరాల వయస్సులో ఉన్నవారరు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు హామీనిచ్చే నెలవారీ పెన్షన్‌ను అందుకుంటారు. ఈ పథకం అందుకుంటున్న వ్యక్తి చనిపోయినట్లయితే, తన జీవిత భాగస్వామికి పెన్షన్‌ను అందిస్తుంది. పథకం అందుకుంటున్న వ్యక్తి వలె అదే పెన్షన్ పొందేందుకు జీవిత భాగస్వామికి అర్హత ఉంది.

ప్రధాన మంత్రి ముద్రా యోజన [PMMY]:

ఏప్రిల్ 8, 2015న ప్రారంభించబడిన ఈ పథకం వివిధ ఉప పథకాల కింద రుణాలను అందిస్తుంది.శిశు ఉప పథకం కింద రూ. 50,000, ‘కిషోర్’ సబ్-స్కీమ్ కింద రూ. 50 లక్షలు, మరియు ‘తరుణ్’ సబ్-స్కీమ్ ద్వారా రూ. 5 లక్షల నుండి రూ. 10 లక్షలు మధ్య రుణాలను అందిస్తుంది. ఈ పథకం ప్రజలను వ్యవస్థాపకులుగా మార్చడానికి మరియు వారి వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రోత్సహిస్తుంది.

ప్రధాన మంత్రి వయ వందన యోజన [PMVVY]:

60 ఏళ్లు పైబడిన వృద్ధులను మార్కెట్ పరిస్థితుల నుండి రక్షించడానికి మరియు వారికి సామాజిక భద్రత కల్పించడానికి ఈ యోజన పథకం ప్రారంభించబడింది. ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC] అమలు చేస్తుంది. ఈ పథకం కింద తమను తాము నమోదు చేసుకున్న వృద్ధులకు ఇది స్థిరమైన పెన్షన్‌ని నిర్ధారించి అందిస్తుంది.