కొత్తదా? పాతదా? మీకు ఏ ఆదాయపు పన్ను విధానం సరిగ్గా సూట్ అవుతుందో తెలుసుకోండి.

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది, చాలా మంది తెలివైన పెట్టుబడిదారులు తమ పన్నులను మినహాయింపు చేసుకోవాలని ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ విషయానికి వస్తే, ముందుగా వచ్చే అనుమానం పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవాలా లేదా కొత్త విధానాన్ని అనుసరించాలా అనేది. ప్రత్యేకించి ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో కొన్ని ప్రోత్సాహకాలను అందించిన తర్వాత ఈ సందేహం మొదలైంది. ఇన్వెస్టర్ అయినా, వ్యాపారి అయినా, ఉద్యోగులయినా ఏ విధానాన్ని ఎంచుకోవాలి? అనేది ఆదాయపు […]

Share:

కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది, చాలా మంది తెలివైన పెట్టుబడిదారులు తమ పన్నులను మినహాయింపు చేసుకోవాలని ప్లాన్ చేయాలని చూస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ ఫైలింగ్ విషయానికి వస్తే, ముందుగా వచ్చే అనుమానం పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంచుకోవాలా లేదా కొత్త విధానాన్ని అనుసరించాలా అనేది. ప్రత్యేకించి ప్రభుత్వం 2023 బడ్జెట్‌లో కొన్ని ప్రోత్సాహకాలను అందించిన తర్వాత ఈ సందేహం మొదలైంది. ఇన్వెస్టర్ అయినా, వ్యాపారి అయినా, ఉద్యోగులయినా ఏ విధానాన్ని ఎంచుకోవాలి? అనేది ఆదాయపు పన్ను స్లాబ్‌పై ఆధారపడి ఉంటుంది. 

కొత్త ఆదాయపు పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ అని చెప్పవచ్చు., కానీ పన్ను చెల్లింపుదారులు పాత విధానాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఏప్రిల్ 1, 2023 నుండి, రూ. 7.5 లక్షల వరకు (రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌తో) సంపాదిస్తున్న ఎవరైనా ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు అని బడ్జెట్ లో నిర్మల సీతారామన్ వెల్లడించారు.

“తగ్గింపుల తర్వాత మీ ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉంటే, పాత విధానాన్ని ఎంచుకోవడం మంచిది, అని Bankbazaar.com చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఆదిల్ శెట్టి తెలిపారు. ఎవరైనా అంతకంటే ఎక్కువ సంపాదిస్తూ ఉన్నా, ఆదాయం పెరిగినా కొత్త విధానాన్ని ఎంచుకోవడం మంచిదని ఆయన అన్నారు.

“రూ. 7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారు కొత్త విధానాన్ని ఎంచుకుంటే, అసలు పన్ను చెల్లించాల్సిన అవసరమే లేదు,” అని మరొక నిపుణుడు అర్చిత్ గుప్తా చెప్పారు.

“మీ ఆదాయం రూ. 7.5 లక్షల నుండి రూ. 14.17 లక్షల మధ్య ఉంటే, మీరు 30% లేదా అంతకంటే ఎక్కువ తగ్గింపును క్లెయిమ్ చేయగలిగితే, మీరు పాత విధానానికి వెళ్లాలి. మీ ఆదాయం రూ. 14.17 లక్షల కంటే ఎక్కువ లేదా రూ. 5.0425 కోట్ల వరకు ఉంటే మీరు రూ. 4.25 లక్షల కంటే ఎక్కువ మినహాయింపును క్లెయిమ్ చేయగలిగితే, మీరు పాత విధానాన్ని ఎంచుకోవాలి, ”అని ఆదిల్ శెట్టి అన్నారు.

“మీ ఆదాయాన్ని బట్టి, మీకు ఏది మంచిదో దాని గురించి మీరు నిర్ణయం తీసుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు రూ. 5.0425 కోట్ల కంటే ఎక్కువ సంపాదిస్తే మరియు తగ్గింపుల తర్వాత పాత విధానం మెరుగ్గా ఉంటే మీరు దానిని ఎంచుకోవాలి, లేకుంటే కొత్త విధానాన్ని ఎంచుకోండి,” అని శెట్టి పేర్కొన్నారు.

“పాత విధానంలో కూడా అనేక తగ్గింపులు మరియు మినహాయింపులు ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరూ స్వయంగా లెక్కలు వేసుకోవాలని నేను సూచిస్తున్నాను. మీకు హోమ్ లోన్ ఉన్నట్లయితే, ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల వరకు ఉన్న వడ్డీ భాగంపై మినహాయింపు పొందవచ్చు కాబట్టి.. మీ పరిస్థితులను బట్టి మీరే అంచనా వేసుకోవాలని అన్నారు. 

మీ మొత్తం తగ్గింపులు మరియు మినహాయింపులు మీకు తెలిస్తే పన్ను విధానాన్ని ఎంచుకోవడం సులభం. మీరు గత సంవత్సరం పొందిన అన్ని తగ్గింపులు మరియు మినహాయింపులను కూడా ఆదాయశాఖకు చూపించవచ్చు” అని తెలిపారు.