నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 2023 నాటికి 3.4 శాతం తగ్గినట్టుగా ప్రకటించిన RBI..

బ్యాంకులు మనుగడ సాగాలంటే కచ్చితంగా రుణాలు తీసుకున్న వాళ్ళు సమయానికి వడ్డీలు చెల్లించాలి. సమయానికి తగ్గట్టుగా రుణాలు చెల్లించలేకపోతే  దానిని RBI నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా పరిగణిస్తుంది. అచ్చ తెలుగు లో దీనికి గురించి చెప్పాలంటే నిరార్డక ఆస్తులు అని అంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే మొండి బకాయిలు అన్నమాట. ఇది ప్రతీ ఏడాది బ్యాంక్స్ లో పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇలా ఉంటె బ్యాంకింగ్ సిస్టం భవిష్యత్తులో రన్ అవ్వడం […]

Share:

బ్యాంకులు మనుగడ సాగాలంటే కచ్చితంగా రుణాలు తీసుకున్న వాళ్ళు సమయానికి వడ్డీలు చెల్లించాలి. సమయానికి తగ్గట్టుగా రుణాలు చెల్లించలేకపోతే  దానిని RBI నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గా పరిగణిస్తుంది. అచ్చ తెలుగు లో దీనికి గురించి చెప్పాలంటే నిరార్డక ఆస్తులు అని అంటారు. మన వాడుక భాషలో చెప్పాలంటే మొండి బకాయిలు అన్నమాట. ఇది ప్రతీ ఏడాది బ్యాంక్స్ లో పెరిగిపోతూనే ఉంది కానీ తగ్గడం లేదు. ఇలా ఉంటె బ్యాంకింగ్ సిస్టం భవిష్యత్తులో రన్ అవ్వడం చాలా కష్టం. సమయానికి రుణాలు చెల్లించకపోతే మనల్ని బ్యాంక్ వాళ్ళు వేధిస్తుంటారు కదా, అందుకు కారణం ఇదే. దాంతో బ్యాంకింగ్ సెక్టార్ మొండి బకాయిలు మీద తన విశ్వరూపం చూపిస్తూ వచ్చింది. అందువల్ల నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రేషియో క్రమంగా తగ్గుతూ వస్తుంది. రీసెంట్ గా RBI విడుదల చేసిన నివేదిక ప్రకారం 2023 వ సంవత్సరం నాటికి 3.4 శాతం కి తగ్గినట్టు గా చెప్తున్నారు

ఒత్తిడి వల్లే ఈ ఘనత సాధించాం : RBI.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టిన ఒత్తిడి వల్లే నేడు ఈ ఫలితం వచ్చిందని. వచ్చే ఏడాదికి 3.6 శాతం కి తగ్గేలాగా కృషి చేస్తామని చెప్పుకొచ్చారు. దీని వల్ల ప్రతీ బ్యాంక్ కి సంబంధించిన క్యాపిటల్ బాగా పెరుగుతుందని, తద్వారా బ్యాంకులకు లాభాలు కూడా పెరుగుతాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నివేదిక లో RBI గవర్నర్ శక్తికంఠ దాస్ పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్ధిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇక నుండి కూడా మన ఆర్థిక పెరిగే చర్యలే చేపడుతాము కానీ, తగ్గే చర్యలు ఎట్టిపరిస్థితిలో చేయబోమని, అందుకోసం ఎంత ఒత్తిడిని అయినా తట్టుకోగలము, ఎంత ఒత్తిడిని అయినా పెట్టగలము అంటూ చెప్పుకొచ్చాడు శక్తికంఠ దాస్. ఒక్కసారి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ రంగం పైన ఒత్తిడి పెట్టడం ప్రారంభిస్తే సాధారణ ప్రజల మీద కూడా ఒత్తిడి పడుతుంది, పాపం పంట కోసం రుణాలు తీసుకొని నష్టపోయిన రైతులు, తీసుకున్న ఋణం కి వడ్డీలు కట్టలేక, కొంతమంది ఏమి చెయ్యాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు మన నిజ జీవితం లో ఎన్నో చూసాము.

సకాలం లో రుణాలను చెల్లించడం మంచిది :

అలా నష్టపోయిన వాళ్ళు తిరిగి కట్టలేకపోతున్నారు అంటే ఒక అర్థం ఉంది, కానీ ఎలాంటి నష్టం లేకుండా, కోట్ల రూపాయిలు అర్జిస్తూ టాక్సులతో పాటుగా తీసుకున్న బ్యాంక్ లోన్స్ ని కూడా ఎగ్గొట్టడానికి చూస్తుంటారు. బ్యాంకింగ్ సెక్టార్ అలాంటి వారి మీద ప్రతాపం చూపించి మొండి బకాయిలను వసూలు చెయ్యలేక పోతుంది బ్యాంకింగ్ సెక్టార్, వాళ్ళు సరిగా కట్టట్లేదని,సామాన్యుల రక్తం తాగి అయినా టార్చర్ చేసి రుణాలు కట్టించుకుంటూ ఉంటారు. ఒకవేళ ఉన్నవాళ్లు సమయానికి తీసుకున్న రుణాలు చెల్లిస్తూ, వడ్డీలు చెల్లిస్తే బ్యాంకింగ్ సెక్టార్ కి మించిన లాభసాటి బిజినెస్ ఏ రంగం లో కూడా జరగదు అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి  లేదు. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం లో ఉన్న నిబంధనల ప్రకారంగా 90 రోజుల్లో తీసుకున్న రుణాలను పూర్తి స్థాయిలో కానీ, లేదా 50 శాతం కి పైగా కానీ కట్టాలి, ఈ నిబంధన ప్రతీ కస్టమర్ కి చాలా కఠినంగా అమలు చేయబోతుంది కార్పొరేట్ బ్యాంకింగ్ సిస్టం. కాబట్టి ఇక నుండి అయినా ఎవరికైనా మొండి బకాయిలు ఉంటే వెంటనే కట్టేయండి, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవు.