పన్నుల విషయంలో ఉద్యోగస్తులకు, వ్యాపారులకు ఊరట కలిగిస్తున్న కొత్త రూల్స్

ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం ఆధారపడేది పన్నుల మీద. మనం కష్టపడి సంపాదించే డబ్బులతో కొంత భాగం పన్ను రూపంలో చెల్లిస్తూ ఉంటాము. అయితే పన్ను గైడ్ లైన్స్ నచ్చక, కొంతమంది పన్ను కట్టడం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అందువల్ల ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు నష్టాలను చవి చూస్తున్నాయి. అందువల్ల సగటు పేదవాడు ఎంతో నష్టపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసింది. సరికొత్త ఆర్థిక సంవత్సరం […]

Share:

ఇండియాలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రభుత్వం ఆధారపడేది పన్నుల మీద. మనం కష్టపడి సంపాదించే డబ్బులతో కొంత భాగం పన్ను రూపంలో చెల్లిస్తూ ఉంటాము. అయితే పన్ను గైడ్ లైన్స్ నచ్చక, కొంతమంది పన్ను కట్టడం ఇష్టం లేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అందువల్ల ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు నష్టాలను చవి చూస్తున్నాయి. అందువల్ల సగటు పేదవాడు ఎంతో నష్టపోతున్నాడు. ఇక ఈ ఏడాది ఆర్ధిక సంవత్సరం మార్చితో ముగిసింది. సరికొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభం అయ్యింది. ఇది జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు చాలా ముఖ్యం. వాళ్లకి కొత్త టాక్స్ రూల్స్ ని అనుసరించాలా, లేదా పాత టాక్స్ రూల్స్ ని అనుసరించాలా? అనేది ఎంచుకునేందుకు అనువైన సమయం ఇది. సగటు ఉద్యోగి ఎంచుకున్న విధానం మీదనే నెలవారీ జీతంపై ప్రభావం చూపిస్తుంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మేము మీకు కొత్త పన్ను రూల్స్ మరియు పాత పన్ను రూల్స్ రెండింటిలో ఏది అనుసరించాలనే దానిపై కొన్ని ముఖ్యమైన టిప్స్ ఇవ్వబోతున్నాము.

ఉద్యోగులు కానీ వ్యాపారులు కానీ తమ ఆదాయం ఏడాదికి కేవలం 7 లక్షల రూపాయిలు మాత్రమే ఉంటే, కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రవేశ పెట్టిన న్యూ టాక్స్ రూల్స్ ప్రకారం, ఒక్క రూపాయి టాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇది కేవలం కొత్త టాక్స్ రూల్స్ ఫాలో అయ్యేవాళ్ళకి మాత్రమే కాదు, పాత టాక్స్ రూల్స్ ని ఫాలో అయ్యేవారికి కూడా వర్తిస్తుంది. ఈ న్యూ టాక్స్ రూల్స్ అనుసరించడం వల్ల ఉద్యోగులకు కానీ, వ్యాపారులకు కానీ ఊరట కలిగించే విషయం ఏమిటంటే ఇక నుండి ట్రావెల్ అలవెన్సు , హౌస్ రెంట్ అలవెన్సు, టూషన్ ఫీజు మరియు హౌస్ లోన్ పైన వడ్డీల వంటి వాటిపై పన్నులు గణనీయంగా తగ్గిపోతాయి. ఇది ఇలా ఉండగా కొత్త టాక్స్ రూల్స్ మరియు పాత టాక్స్ రూల్స్ ఆదాయాన్ని బట్టి ఎంత పన్ను కట్ అవుతుంది అనేది ఇప్పుడు మనం స్పష్టంగా చూడబోతున్నాము.

ఒకప్పుడు పాత టాక్స్ రూల్స్ ప్రకారం మన నెలవారీ ఆదాయం రెండున్నర లక్షల వరకు ఉంటే ఒక్క రూపాయి పన్ను కూడా కట్టాల్సిన అవసరం ఉండేది కాదు, కానీ ఇప్పుడు కొత్త టాక్స్ రూల్స్ ప్రకారం దానిని మూడు లక్షల రూపాయలకు పెంచారు. ఒకప్పుడు రెండున్నర లక్ష నుండి 5 లక్షల మధ్యలో మన ఆదాయం ఉంటే 5 శాతం వరకు పన్ను కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని మూడు నుండి ఆరు లక్షల ఆదాయం ఉన్నవాళ్ళకి అమలు అయ్యేలా చేస్తున్నారు. అలాగే ఒకప్పుడు 5 నుండి 7.5 లక్షల ఆదాయం ఉన్నవారు ఏకంగా 15 శాతం టాక్స్ కట్టాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు ఆరు నుండి 9 లక్షల రూపాయిల ఆదాయం ఉన్నవారు కేవలం 10 శాతం పన్ను కడితే సరిపోతుంది. అలాగే కొత్త రూల్స్ ప్రకారం 9 నుండి 12 లక్షల రూపాయిలు ఆదాయం ఉన్నవాళ్లు 15 శాతం టాక్స్, 12 నుండి 15 లక్షల రూపాయిల ఆదాయం ఉన్నవాళ్లు 20 శాతం పన్ను, అలాగే 15 లక్షల రూపాయలకు పైగా ఆదాయం ఉన్నవారు 30 శాతం పన్ను కట్టాల్సి ఉంటుంది. గతంలో ఇలా ఉండేది కాదు, భారీ ఎత్తున పన్ను కట్టాల్సి వచ్చేది. కాబట్టి ఈ సరికొత్త ఆర్థిక సంవత్సరం లో ప్రవేశ సరికొత్త పన్ను రూల్స్ ప్రతీ ఒక్కరు చాలా సులువుగా అనుసరించవచ్చు.