వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల్లో ఇండియా ఒక‌టి

వృద్ధిలో భారతదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా ఉంద‌ని గ్లోబ‌ల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ గ‌త 7 నుంచి 10 సంవ‌త్స‌రాలలో ఆర్థిక వృద్ధి కాస్త త‌గ్గిన‌ట్లే అనిపిస్తోంద‌ని తెలిపింది. ఇండియాకు త‌న రేటింగ్స్‌లో BAA3 రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు రానున్న రోజుల్లో అప్పుల భారాన్ని ఇండియా మోయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ఏదేమైనప్ప‌టికీ వృద్ధి చెందే సామ‌ర్థ్యం కాస్త నెమ్మ‌దించినా.. ఆర్థిక‌ప‌రంగా వేగంగా వృద్ధిచెందుతున్న దేశాల్లో ఇండియా ఒక‌టి అని వెల్ల‌డించింది. “గత 7-10 […]

Share:

వృద్ధిలో భారతదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ వేగంగా ఉంద‌ని గ్లోబ‌ల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ వెల్ల‌డించింది. అయిన‌ప్ప‌టికీ గ‌త 7 నుంచి 10 సంవ‌త్స‌రాలలో ఆర్థిక వృద్ధి కాస్త త‌గ్గిన‌ట్లే అనిపిస్తోంద‌ని తెలిపింది. ఇండియాకు త‌న రేటింగ్స్‌లో BAA3 రేటింగ్ ఇచ్చింది. అంతేకాదు రానున్న రోజుల్లో అప్పుల భారాన్ని ఇండియా మోయ‌క త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించింది. ఏదేమైనప్ప‌టికీ వృద్ధి చెందే సామ‌ర్థ్యం కాస్త నెమ్మ‌దించినా.. ఆర్థిక‌ప‌రంగా వేగంగా వృద్ధిచెందుతున్న దేశాల్లో ఇండియా ఒక‌టి అని వెల్ల‌డించింది.

“గత 7-10 సంవత్సరాలలో సంభావ్య వృద్ధి (పొటెన్షియల్ గ్రోత్) తగ్గినప్పటికీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వేగంగా వృద్ధి చెందుతుందని మేం అభిప్రాయ‌ప‌డుతున్నాం. ఈ నేప‌థ్యంలోనే ఆ రేటింగ్ ఇవ్వ‌డం జ‌రిగింది. అధిక ఆదాయం, ఆర్థిక స్థితిస్థాపకత క్రమంగా GDPని పెంచ‌డంలో తోడ్ప‌డ‌తాయి. ఇది అధిక స్థాయిలో ఉంటే క్రమంగా ఆర్థిక ఏకీకరణ  ప్రభుత్వ రుణ స్థిరీకరణకు తోడ్పడుతుంది” అని మూడీస్ వెల్ల‌డించింది.  భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు మూడీస్ ఇచ్చిన రేటింగ్ త‌క్కువ పెట్టుబడుల గ్రేడ్ రేటింగ్ కింద‌కి వ‌స్తుంది.

వ‌చ్చే రెండేళ్ల‌లో జీ20 దేశాల‌కు మించి భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ వృద్ధి చెందే అవ‌కాశం ఉంద‌ని మూడీ అభిప్రాయ‌ప‌డింది. దేశీయంగా అధిక గిరాకీ సంస్థ‌లైన ఫిచ్, ఎస్ అండ్ పీ ల‌కు కూడా స్థిర‌త్వ అంచ‌నాల‌తో భార‌త్‌కు త‌క్కువ పెట్టుబ‌డుల రేటింగ్‌నే కొనసాగిస్తోంది.

అంతేకాకుండా, ఆర్థిక రంగం బలోపేతం కావడం కొనసాగుతోందని, కరోనావైరస్ మహమ్మారి సమయంలో  భారతదేశ సంభావ్య వృద్ధి 6-6.5 శాతానికి మెరుగుపడింది. అయితే, భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు గత దశాబ్దం మధ్యలో అంచనాల కంటే తక్కువ అని మూడీస్ పేర్కొంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా చక్కని లాభాలతో మంచి పని తీరుతో స్థిరంగా ఉందని, భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఓవర్ వెయిట్ అంటూ మోర్గాన్ స్టాన్లీ ఇప్పటికే అంచనా వేసింది. అంతేకాకుండా మన భారత దేశ రేటింగ్ను కూడా అత్యధికంగా పెంచేసింది.

వాణిజ్యం, ర‌వాణా ప‌రంగా భార‌త ప్ర‌భుత్వం క్యాపిట‌ల్ వ్య‌యంపై ఎక్కువ ఫోక‌స్ పెడుతోంది. ఇది కూడా భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను పెంచేందుకు తోడ్పడుతుంది. వీటితో పాటు గ‌త మూడేళ్ల‌లో బ్యాంకింగ్ సిస్ట‌మ్‌లో మార్పులు, ట్యాక్స్ బేస్ పెంపు, డిజిట‌ల్ ప‌బ్లిక్ మౌళిక స‌దుపాయాలు కూడా పాజిటివ్ అంశాలుగా ప‌రిగ‌ణించ‌వ‌చ్చు.

ఇటీవలే రేటింగులను ఇచ్చే ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ రేటింగ్ అత్యధికంగా పెంచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మునపటి కంటే భారత దేశ రేటింగ్ మెరుగ్గా ఉండడాన్ని గమనించి ఓవర్ వెయిట్ గా పరిగణించింది మోర్గాన్ స్టాన్లీ. మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ సంస్కరణల ఎజెండా మూలధన విషయంలో అదే విధంగా లాభాల విషయంలో సానుకూల అభివృద్ధి ఉన్నందువలన మోర్గాన్ స్టాన్లీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద తనకున్న అభిప్రాయాన్ని పంచుకుంది.

మరోవైపు మన పొరుగు దేశం అయిన చైనా రేటింగ్ ఇస్తూ ఈక్వల్ వెయిట్ అంటూ చెప్పుకొచ్చింది. మోర్గాన్ స్టాన్లీ చైనీస్ స్టాక్‌లపై రేటింగ్‌ను తగ్గించిన సమయంలో, భారతదేశం ఆర్థిక వ్యవస్థపై కదలిక వచ్చింద‌ని పెట్టుబడిదారులు లాభాలను పొందేందుకు ప్రస్తుత అవకాశాలను వినియోగించుకోవాలని సూచించింది.