డబ్బు బదులు బంగారం కొనడానికి కారణాలు.. తెలుసుకుంటే మీరు కొంటారు

భారతీయ మహిళలకి ఒంటిమీద బంగారం ఎంత ఉంటే అంత ఐశ్వర్యంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే వివాహం సమయంలో మాత్రం ఆడపిల్లల కోసం తులం బంగారం అయినా కొంటారు. బంగారం అంటే చాలు అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇక బంగారం కొనిస్తే మొగుడిని పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే భారతీయ మహిళలకి ఒంటిమీద బంగారం ఎంత ఉంటే.. అంత ఐశ్వర్యంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే, వివాహం సమయంలో మాత్రం ఆడపిల్లల కోసం తులం […]

Share:

భారతీయ మహిళలకి ఒంటిమీద బంగారం ఎంత ఉంటే అంత ఐశ్వర్యంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే వివాహం సమయంలో మాత్రం ఆడపిల్లల కోసం తులం బంగారం అయినా కొంటారు.

బంగారం అంటే చాలు అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు. ఇక బంగారం కొనిస్తే మొగుడిని పువ్వుల్లో పెట్టుకొని చూస్తారు. ఎందుకంటే భారతీయ మహిళలకి ఒంటిమీద బంగారం ఎంత ఉంటే.. అంత ఐశ్వర్యంతులు అని భావిస్తారు. ఎంతటి నిరుపేదలైనా సరే, వివాహం సమయంలో మాత్రం ఆడపిల్లల కోసం తులం బంగారం అయినా కొంటారు. బంగారం అంటే కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా.. ఆస్తిగా కూడా భావిస్తారు మహిళలు. పెట్టుబడులు పెట్టేవారు బంగారం కొనుగోలుకు ఎక్కువగా మెగ్గు చూపుతారు.. డబ్బు రూపంలో కాకుండా బంగారం కొనడానికి ఎందుకు అంతగా మక్కువ చూపిస్తారో అందుకు గల కారణాల గురించి తెలుసుకుందాం.

1925లో ఒక గ్రామం బంగారం ధర 18 రూపాయలు ఉండేది. కానీ.. ప్రస్తుతం ఒక గ్రాము బంగారం ధర 6 వేలకు పైగా చేరుకుంది. ఎలక్ట్రానిక్ వస్తువులలో కూడా బంగారాన్ని ఎక్కువగా వాడుతుంటారు. దీన్ని కంప్యూటర్ ఎలక్ట్రానికల్ పరికరాల్లో కనెక్టర్ గా ఉపయోగిస్తారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. ఒక సెల్ ఫోన్ లో 50 మిల్లీ గ్రాముల బంగారం ఉపయోగిస్తారు. బంగారానికి పరారుణ కిరణాలను ప్రతిబింబ చేసే లక్షణం ఉన్న కారణంగా.. అంతరిక్ష ప్రయాణికులు, వ్యోమగాములు ధరించే దుస్తుల తయారీలో కూడా బంగారాన్ని వాడుతారు. కొన్ని ఆహార పదార్థాలలో కూడా బంగారాన్ని ఉపయోగిస్తారు. ప్రపంచంలో భారత దేశమే ఎక్కువ బంగారాన్ని కొనుగోలు చేస్తుంది. 

తక్షణ ఋణం: 

మీ దగ్గర బంగారం ఉంటే తక్షణమే రుణాన్ని పొందవచ్చు. డబ్బుల కోసం ఎవరి దగ్గరికో అప్పు కోసం వెళ్లనక్కర్లేదు. బంగారాన్ని పెట్టి ధైర్యంగా డబ్బులు తెచ్చుకొని మీ అవసరాన్ని అధిగమించవచ్చు. అదే విధంగా మీ ఆర్థిక పరమైన పెట్టుబడులకు కూడా బంగారం రుణం ఉత్తమ ఎంపిక. బంగారం రుణంపై కూడా అతి తక్కువ వడ్డీని కొన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. 

సావరిన్ గోల్డ్ బాండ్స్:

బంగారం కేవలం ఆభరణంగా మాత్రమే కాకుండా పేపర్ గోల్డ్ రూపంలో సావరిన్ గోల్డ్ బాండ్స్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా మీరు నేరుగా బంగారాన్ని కొనరు.  కానీ ఒక గ్రామం బంగారం ని కొని దాని పై వచ్చే వడ్డీని కూడా పొందవచ్చు. ఈ విధానంలో బంగారం కొనినట్టు ఉంటుంది దానిపైన వచ్చే వడ్డీని కూడా మీరు పొందవచ్చు. 

గోల్డ్ ఇన్వెస్ట్మెంట్:

గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడిదారులకు అత్యవసర సమయంలో లేదా.. వారికి నగదు అవసరమైనప్పుడు బంగారాన్ని వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ సాధనాలు, వివిధ స్థాయిల లిక్విడిటీని అందిస్తాయి. గోల్డ్ లిక్విడిటీ పథకాల ఎంపికలలో మనం ముందుగానే కొన్ని ఆప్షన్స్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

లిక్విడిటీ క్యాష్

బంగారం లిక్విడిటీ క్యాష్ కు సమానం. సెక్యూరిటీ లేదా అసెట్ మాదిరిగానే బంగారం కూడా లిక్విడ్ పోర్టబుల్ అత్యవసర పరిస్థితిలో దీనిని ఏ సమయంలోనైనా నగదుగా మార్చుకోవచ్చు. చాలామందికి బంగారం సహాయం చేసే మంచి మిత్రుడుగా కనిపిస్తుంది. మంచి పెట్టుబడి పెట్టడానికి బంగారం తక్షణమే నగదుగా మార్చుకోవచ్చు. 

గతంతో పోలిస్తే బంగారం ఎన్నో రెట్లు పెరిగింది. ఇప్పుడు బంగారం కొన్నా కూడా భవిష్యత్తులో బంగారం లాభదాయకమే. బంగారాన్ని కొని పక్కన పెట్టుకోవడం కంటే కూడా డిజిటల్ గోల్డ్ లో కన్వర్ట్ చేసుకుని ఎక్కువ మంది ఎక్కువ లాభాలను పొందుతున్నారు.