ప్రస్తుత మానిట‌రీ పాల‌సీ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం

RBI ప్యానెల్ మెంబర్ గా ఉంటున్న జయంత్ ఆర్ వర్మ, ప్రస్తుత ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారనుందని గురువారం MPC ద్వారా ఆయన చెప్పుకొచ్చారు.  నిజానికి RBI కీలకమైన స్వల్పకాలిక రుణ రేటును ఉంచినప్పటికీ, ఆరుగుర సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సభ్యుల ప్రకారం భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పడం జరిగింది.  ముఖ్యంగా ఆర్బిఐ ప్యానెల్ లో ప్రభుత్వం నియమించిన సభ్యుడు జయంత్ ఆర్ వర్మ, ప్రస్తుతం ఉన్న […]

Share:

RBI ప్యానెల్ మెంబర్ గా ఉంటున్న జయంత్ ఆర్ వర్మ, ప్రస్తుత ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు పెను ప్రమాదంగా మారనుందని గురువారం MPC ద్వారా ఆయన చెప్పుకొచ్చారు. 

నిజానికి RBI కీలకమైన స్వల్పకాలిక రుణ రేటును ఉంచినప్పటికీ, ఆరుగుర సభ్యుల ద్రవ్య విధాన కమిటీ సభ్యుల ప్రకారం భవిష్యత్తులో రేట్లు పెరిగే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పడం జరిగింది. 

ముఖ్యంగా ఆర్బిఐ ప్యానెల్ లో ప్రభుత్వం నియమించిన సభ్యుడు జయంత్ ఆర్ వర్మ, ప్రస్తుతం ఉన్న ద్రవ్య విధానం ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన నష్టాన్ని కలిగించే విధంగా ప్రమాదకరంగా ఉందని చెప్పుకొచ్చారు. ఆయన అహ్మదాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ లో ప్రొఫెసర్ గా చేస్తున్నారు.

RBI సభ్యులు ఎవరు?: 

RBI గవర్నర్ నేతృత్వంలో ముగ్గురు నామినీలు,  అదేవిధంగా MPC లో సెంట్రల్ బ్యాంక్ నుండి ముగ్గురు సభ్యులు ఉంటారు. వర్మ ద్రవ్య విధానం గురించి ఈ విధంగా మాట్లాడగా, మరోపక్క అసిమా గోయల్ మాట్లాడుతూ, మినిట్స్ ప్రకారం REPO రేటు పెంపుదల మరియు అసలైన సమతుల్య స్థాయికి సమీపంలోకి తీసుకువచ్చిందని, దీని కారణంగా నష్టం ఏమీ ఉండదని, ఇంకా చెప్పాలంటే డిమాండ్ లాంటివి పెరగడం, డిమాండ్ తగ్గడం వంటివి లేకుండా ద్రవయోల్బణం అంచనాలను పెంచడంలో సహాయపడుతుందని స్పష్టంగా చెప్పారు.

అంతేకాకుండా ఊహించిన ద్రవయోల్పనం తగ్గుతుందని, నిజమైన రాపోరేట్ చాలా ఎక్కువగా పెరగకుండా ఉండటం ఇక్కడ ముఖ్యమని, చెప్పుకొచ్చారు. మిగిలిన ఐదుగురు ఆర్బిఐ సభ్యులు, వడ్డీరేట్లకు సరైన ఓటు వేస్తున్నప్పటికీ, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ద్రవ్య విధానం రిటైల్ ద్రవయోల్బనాన్ని టార్గెట్ బ్యాండ్ రెండు నుంచి ఆరు శాతం పరిధిలోకి తీసుకువచ్చాయని, అయితే అసలైన పని ఇంకా మిగిలే ఉందని చెప్పారు. 

మొన్న జూన్ 6 నుంచి 8 వరకు జరిగిన ఎంపీసీ సమావేశంలో, మినిట్స్ ప్రకారం, భారతదేశ స్థూల ఆర్థిక మూలాధారాలు బల్పడుతున్నాయని, అదేవిధంగా వృద్ధి పడే అవకాశాలు క్రమంగా మెరుగుపడుతున్నాయని, ఇదే విధంగా కొనసాగుతూ అభివృద్ధి చెందుతాయని దాస్ అన్నారు.

ద్రవ్య విధానం ఇలా ఉండగా మరోపక్క బుధవారం సెన్సెక్స్ అలాగే నెఫ్టీ లాభాలకు చేరుకున్నాయి. లాభాలు చూసిన తర్వాత షేర్స్ ఎక్కువగా కొనటానికి మధుపర్లు మొగ్గు చూపారు. అంతేకాకుండా సెన్సెక్స్ లాభాల్లో చేరుకోవడం పవర్ గ్రిడ్కు లాభాలు తెచ్చిపెట్టింది. చాలా సంస్థలు లాభాల్లో ఉండగా, పవర్ గ్రిడ్ తర్వాత అత్యధిక లాభం పొందిన కంపెనీ హెచ్డిఎఫ్సి ట్విన్స్. 

నిజానికి ఎన్నడూ లేని విధంగా గత సంవత్సరం డిసెంబర్ తర్వాత సెన్సెక్స్ అలాగే నెఫ్టీ లాభాల్లోకి వెళ్ళటం, ఇదే మొదటి సారి అని చెప్పుకోవచ్చు. ఒకపక్క లాభాలు ఉండగా మరోపక్క మహేంద్ర అండ్ మహేంద్ర సంస్థ నష్టాన్ని చూడాల్సి వచ్చింది. అత్యధిక లాభాల్లో ఉండగా షేర్స్ ను ప్రజలు కొనడానికి ఆలోచన చేస్తారు. సెన్సెక్స్ లాభాలు చూసిన కొద్ది క్షణాల్లోనే కొన్ని సంస్థల షేర్స్ పెరిగే మరిన్ని లాభాలు చూశారు.

ఈ సంవత్సరం జూన్లో కాకుండా గత ఏడాది డిసెంబర్ 1నే ఇటువంటి గణనీయమైన లాభాలు వచ్చాయని చెప్పొచ్చు. తర్వాత ఈ సంవత్సరంలో ఇప్పటివరకు ఇటువంటి లాభాలు చూసింది లేదు.