ఇన్ఫోసిస్‌కి గుడ్ బై చెప్పిన మోహిత్ జోషి గురించి ఈ విషయాలు మీకు తెలుసా..

ఇన్ఫోసిస్‌కు మోహిత్ జోషి గుడ్‌బై చెప్పారు ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్, టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవోగా  మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారత ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదవి ఆయనని వరించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి మోహిత్ జోషి రాజీనామా చేశారు. సుమారు 20 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ లో వివిధ పదవుల్లో ఆయన పనిచేశారు. త్వరలో టెక్ మహీంద్రాలో చేరనున్నారు. ప్రస్తుతం టెక్ మహీంద్రా ఎండిగా కొనసాగుతున్న […]

Share:

ఇన్ఫోసిస్‌కు మోహిత్ జోషి గుడ్‌బై చెప్పారు

ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్, టెక్ దిగ్గజం టెక్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవోగా  మోహిత్ జోషి ఎంపికైన సంగతి తెలిసిందే. భారత ఐటీ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పదవి ఆయనని వరించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ పదవికి మోహిత్ జోషి రాజీనామా చేశారు. సుమారు 20 సంవత్సరాల పాటు ఇన్ఫోసిస్ లో వివిధ పదవుల్లో ఆయన పనిచేశారు. త్వరలో టెక్ మహీంద్రాలో చేరనున్నారు. ప్రస్తుతం టెక్ మహీంద్రా ఎండిగా కొనసాగుతున్న సిపి గుర్నాని ఈ ఏడాది డిసెంబర్ 19 న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మోహిత్ జోషి బాధ్యతలు స్వీకరిస్తారని టెక్ మహీంద్రా తెలిపింది. మోహిత్ జోషి గురించి మరికొన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం..

టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ లో 22 సంవత్సరాల అనుభవజ్ఞుడైన మోహిత్ జోషి..  ఢిల్లీ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఇప్పటి వరకు ఆయన ఒక్కరోజు వేతనం రూ. 9.5 లక్షలు. రెండు దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న ఎంటర్‌ప్రైజ్ టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ కన్సల్టింగ్ రంగంలో నిపుణుడు. ఇన్ఫోసిస్ కంటే ముందు అనేక ప్రపంచ దిగ్గజ కంపెనీల్లో మోహిత్ జోషి పనిచేశారు. 1974 ఏప్రిల్ 31వ తేదీన ఆయన జన్మించారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆర్కే పురం నుండి పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని సెయింట్ స్టీఫెన్ కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పట్టాను పొందారు  ఆ తరువాత ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుండి ఎంబీఏ పట్టా పొందాడు. అమెరికా హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ నుండి ప్రపంచ నాయకత్వం, పబ్లిక్ పాలసీని కూడా అధ్యయనం చేశారు. 2000లో ఇన్ఫోసిస్‌లో చేరి వివిధ హోదాల్లో పని చేశారు. 

మోహిత్ ఇప్పటివరకు అమెరికా, యూరప్, ఆసియా, మెక్సికోలలో పనిచేశారు. జోషికి భార్య ఇద్దరు కూతుర్లు. వారితో కలిసి ఆయన  లండన్‌లో నివసిస్తున్నారు. 2021 సంవత్సరంలో మోహిత్ జీతం రూ. 15 కోట్ల నుండి రూ. 32.82 కోట్లకు పెరిగింది. ఇన్ఫోసిస్ ఫైలింగ్ ప్రకారం 2021- 22లో రూ. 34.89 కోట్ల జీతం పొందారు.

మోహిత్ జోషి ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, ఎడ్జ్ వేర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ గా సేవలు అందించారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. రిస్క్ అండ్ గవర్నమెంట్ నామినేషన్ కమిటీలో ఆయన కూడా ఒక సభ్యుడు. కాన్ఫిడరేషన్ ఆఫ్ బ్రిటీష్ ఇండస్ట్రీ ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ వైస్ చైర్మన్ కూడా.. 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ యంగ్ గ్లోబల్ లీడర్ గా ఆయన ఎంపిక అయ్యారు. 

ఇన్ఫోసిస్ నుంచి ఇటీవలే రవికుమార్ బయటకు వచ్చేసారు. ఇప్పుడు మోహిత్ జోషి కూడా బయటకు రావడంతో కచ్చితంగా ఇది ఇన్ఫోసిస్ కి పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. జోషిని బోర్డులో ఉంచడానికి ఇన్ఫోసిస్ చివరి నిమిషం వరకు కూడా ప్రయత్నించి విఫలమైందట. జోషి నిష్క్రమణ ఇన్ఫోసిస్ కి పెద్ద లోటేనని టేక్ వర్గాలు భావిస్తున్నాయి. మార్చి 11 నుంచి ఆయన సెలవులో ఉంటారు. ఇన్ఫోసిస్ లో జూన్ 9వ తేదీ ఆయన లాస్ట్ వర్కింగ్ డే. త్వరలోనే మహీంద్రా సంస్థలో చేరనున్నారు. మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవోగా బాధ్యతలు తీసుకొనున్నారు.