వారానికి మూడు రోజులు ఆఫీస్ కి రావాలి: మెటా

వారానికి మూడు రోజులు ఆఫీసుకి వెళ్లేందుకు నిరాకరించే ఉద్యోగులపై మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ వంటి కంపెనీలు ఎదుర్కొంటున్న ఇలాంటి వివాదాల క్రమంలో, వర్క్ ఎన్విరాన్మెంట్ అలాగే వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు వ్యక్తిగతంగా సహకారాన్ని ప్రోత్సహించడానికి మెటా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం అనేది చేసుకోవచ్చు. నిర్ణయం తీసుకున్న మెటా:  మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తన ఉద్యోగులకు సీరియస్ నోటీసు జారీ చేసింది, ప్రతి వారం […]

Share:

వారానికి మూడు రోజులు ఆఫీసుకి వెళ్లేందుకు నిరాకరించే ఉద్యోగులపై మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా కఠినంగా వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ వంటి కంపెనీలు ఎదుర్కొంటున్న ఇలాంటి వివాదాల క్రమంలో, వర్క్ ఎన్విరాన్మెంట్ అలాగే వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు వ్యక్తిగతంగా సహకారాన్ని ప్రోత్సహించడానికి మెటా చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక ప్రయత్నం అనేది చేసుకోవచ్చు.

నిర్ణయం తీసుకున్న మెటా: 

మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా తన ఉద్యోగులకు సీరియస్ నోటీసు జారీ చేసింది, ప్రతి వారం కనీసం మూడు రోజులు ఆఫీసులో గడపాలనే కొత్త నిబంధనను తప్పక పాటించాలని, లేనట్లయితే ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుందని, పేర్కొంది మెటా. మెటా లోరీ గోలెర్ నుండి హెచ్చరిక వచ్చింది, సెప్టెంబర్ 5 నుండి, ఆఫీసుకి కేటాయించిన ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు హాజరు కావాలని భావిస్తున్నారు. మంచి సంబంధాలు మరియు బలమైన టీం వర్క్ ప్రోత్సహించడం అనేది దీని లక్ష్యం.

బిజినెస్ ఇన్‌సైడర్ రిపోర్ట్ ప్రకారం, మేనేజర్‌లు బ్యాడ్జ్ మరియు స్టేటస్ టూల్ సమాచారాన్ని క్రమం తప్పకుండా 

చెక్ చేస్తారో లేదో తెలుసుకోవడానికి గోలర్ పేర్కొన్నారు. లేని పక్షంలో ఉద్యోగులతో ఫాలోఅప్ చేస్తామన్నారు. స్థానిక చట్టాలు మరియు కౌన్సిల్ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవచ్చని వెల్లడించారు. మరింత తీవ్రమైన సందర్భాల్లో, పదేపదే ఉల్లంఘనలు క్రమశిక్షణా చర్యలకు దారితీయవచ్చు, ఇందులో ఉద్యోగి పనితీరు రేటింగ్‌ను తగ్గించడం, ఉద్యోగి ఆఫీస్ కి రాకుండా కొనసాగితే తొలగించే అవకాశం కూడా ఉంటుంది.

ఈ కొత్త విధానం మెటా సమర్థత సంవత్సరంలో భాగం, ఇది జుకర్‌బర్గ్ ద్వారా తీసుకున్న నిర్ణయం తెలుస్తోంది, ఖర్చులను తగ్గించి, కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలనీది ఉద్దేశం. ఈ ప్రయత్నంలో దాదాపు 21,000 ఉద్యోగాల రిస్క్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపుగా మెటా వర్క్‌ఫోర్స్‌లో నాలుగింట ఒక వంతు. అయితే, ఈ హాజరు నియమాలు నిర్దిష్ట ఆఫీసు నుండి పనిచేసే ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తాయి. స్పష్టమైన వ్యాపార కారణం లేకుంటే రిమోట్ ఉద్యోగులు రెండు నెలల వ్యవధిలో నాలుగు రోజులకు మించి ఆఫీస్ కి రావాల్సిన పనిలేదు.

రిమోట్ పని ముఖ్యమైనదిగా కొనసాగుతుందని వారు విశ్వసిస్తున్నప్పటికీ, ఆఫీస్ నుండి పని చేయడానికి ఎంచుకునే వారికి విలువైన వ్యక్తిగత అనుభవాన్ని సృష్టించడంపై ప్రస్తుతం వారి దృష్టి ఉందని మెటా నుండి ఒక ప్రతినిధి వివరించారు.

పురోగతి కోసం నిర్ణయం: 

మెరుగైన ఆర్థిక ఫలితాలు, కంపెనీ ఖర్చు తగ్గించే ప్రణాళికలపై పెట్టుబడిదారుల విశ్వాసం కారణంగా మెటా షేర్లు సంవత్సరం ప్రారంభం నుండి గణనీయమైన పెరుగుదలను చూపించాయి. జూన్‌లో, Meta దాని ఉద్యోగులు చాలా మంది వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయాల్సి ఉంటుందని ప్రకటించింది. రిమోట్ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రభావం అనేది ఉండకపోవచ్చు.

ఆఫీస్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల మెరుగైన పనితీరును సాధించవచ్చని జుకర్‌బర్గ్ గతంలో సూచించారు. రిమోట్‌గా ప్రారంభించిన వారితో పోలిస్తే మెటాలో వ్యక్తిగతంగా ఆఫీస్ కి వచ్చి పనిచేస్తున్న ఉద్యోగులు సగటున మెరుగ్గా పనిచేశారని డేటా చూపించిందని ఆయన పేర్కొన్నారు.

వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసులో పని చేయాల్సిన అవసరం లేదని ఇమెయిల్ హెచ్చరికను అందుకోవడంతో అమెజాన్ ఇటీవల తన ఉద్యోగుల నుండి ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లలో కనిపించే విధంగా కొంతమంది ఉద్యోగులు ఆందోళనలు, నిరాశను వ్యక్తం చేశారు. ఆఫీసు హాజరు, వాతావరణ విధానాలపై విభేదాల కారణంగా అమెజాన్ కార్పొరేట్ సిబ్బంది నుండి వ్యతిరేకత కనిపించినట్లు తెలుస్తోంది.