కెనడాకు షాక్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా..!

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని భారత్ ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇందులో ఆనంద్ మహీంద్రా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహీంద్రా గ్రూప్ కూడా కెనడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలించింది. భారతదేశం-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఅండ్‌ ఎం ఆనంద్ మహీంద్రా అధినేత తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ, రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేయాలని […]

Share:

భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. కెనడా పౌరులకు వీసాలు ఇవ్వడాన్ని భారత్ ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇందులో ఆనంద్ మహీంద్రా కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య మహీంద్రా గ్రూప్ కూడా కెనడాకు గట్టి ఎదురుదెబ్బ తగిలించింది. భారతదేశం-కెనడా ఉద్రిక్తతల నేపథ్యంలో ఎంఅండ్‌ ఎం ఆనంద్ మహీంద్రా అధినేత తీసుకున్న సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. కెనడాలోని మహీంద్రా అండ్ మహీంద్రా అనుబంధ సంస్థ, రెస్సన్ ఏరోస్పేస్ కార్పొరేషన్ కార్యకలాపాలను మూసివేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ఎంఅండ్‌ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది.  ఇది మార్కెట్‌  వర్గాల్లోనూ, ఇటు బిజినెస్‌ వర్గాల్లో కలకలం రేపింది.  ఈ నిర్ణయం  రూ. 7200 కోట్ల ఆర్థిక సంక్షోభానికి దారితీయడం గమనార్హం.  

 కార్యకలాపాలు నిలిపివేత.. 

భారతదేశం కెనడాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన ఉద్రిక్తతల మధ్య, కెనడాలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా  అనుబంధ సంస్థ  ‘రెస్సన్‌ ఏరోస్పేస్ కార్పొరేషన్‌’ స్వచ్ఛందంగా తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు పేర్కొంటూ కెనడా కార్పొరేషన్స్‌కు దరఖాస్తు చేసింది.

 సెప్టెంబర్ 20, 2023న కార్పొరేషన్ కెనడా నుండి రద్దు సర్టిఫికేట్‌ను పొందిందని, దాని గురించి కంపెనీకి సమాచారం అందించబడిందని మహీంద్రా & మహీంద్రా ఒక రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టాక్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. దీంతో రెసన్స్ ఆపరేషన్ ఆగిపోయిందని, ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం సెప్టెంబర్ 20, 2023 నుంచి దానితో ఎలాంటి సంబంధం లేదని మహీంద్రా తెలిపింది. ఈ నిర్ణయంతో ఎంఅండ్‌ఎం స్టాక్‌ను భారీగా ప్రభావితం చేసింది. అంతేకాదు మహీంద్రా కీలక నిర్ణయం ద్వారా  బహుళజాతి సంస్థలు,  పెట్టుబడుల ప్రభావంతోపాటు  విస్తృత ఆర్థిక రంగం మీద దౌత్యపరమైన ఒత్తిళ్లను చెప్పకనే చెప్పింది. 

రూ. 7200 కోట్టు ఆవిరి 

ఈ డిక్లరేషన్ మహీంద్రా & మహీంద్రా షేర్లు 3 శాతం కుప్పకూలాయి. బీఎస్‌ఈ  రూ. 1583.80  వద్ద  ముగిసింది. ట్రేడింగ్ సెషన్‌లో షేర్లు రూ. 1575.75 వద్ద రోజు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇటీవలి నష్టపోయినప్పటికీ  కంపెనీ షేర్లు ఈ సంవత్సరం నిఫ్టీపై దాదాపు 26శాతం  రాబడిని సాధించాయి.  ఒక సంవత్సరం రాబడి 21% మించిపోయింది.  తాజా నష్టాల ఫలితంగా  రూ. 7200 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ప్రారంభ మార్కెట్ క్యాప్ రూ. 2 లక్షల కోట్ల నుండి, కంపెనీ మార్కెట్ విలువ కనిష్టంగా రూ. 1,95,782.18 కోట్లకు క్షీణించి, మార్కెట్ ముగిసే సమయానికి రూ. 1,96,950.10 కోట్ల వద్ద స్థిరపడింది. రెసన్ ఏరోస్పేస్ కార్పొరేషన్‌లో మహీంద్రా & మహీంద్రా వాటా  11.18 శాతం

మహీంద్రా అండ్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం కెనడాకు పెద్ద దెబ్బ తగిలింది. అయితే కెనడా పెన్షన్ ఫండ్ అనేక భారతీయ కంపెనీలలో భారీ పెట్టుబడులు పెట్టింది. ఆరు భారతీయ కంపెనీలలో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ పెట్టుబడి విలువ రూ. 16000 కోట్ల కంటే ఎక్కువ. ఈ కంపెనీలలో జొమాటో, పేటిఎం, ఇండస్ టవర్, నైకా , కోటక్ మహీంద్రా బ్యాంక్, డెలివర్ వంటివి ఉన్నాయి.

ఖ‌లిస్తానీ నేత హ‌ర్దీప్ సింగ్ నిజ్జార్‌ను కెన‌డాలో హ‌త్య చేశారు. జూన్‌లో ఆ మ‌ర్డ‌ర్ జ‌రిగింది. అయితే ఆ హ‌త్య పాత్ర‌లో భార‌త్ హ‌స్తం ఉన్న‌ట్లు కెన‌డా ప్ర‌ధాని ట్రూడో ఆరోప‌ణ‌లు చేశారు. మోస్ట్ వాంటెడ్ ఖ‌లిస్తానీ నేత హ‌త్యా ఘ‌ట‌న ఇప్పుడు రెండు దేశాల మ‌ధ్య వివాదాస్ప‌దంగా మారింది. నిజ్జార్ మ‌ర్డ‌ర్‌లో భార‌త ప్ర‌భుత్వ ఏజెంట్లు ఉండి ఉంటార‌ని ట్రూడో చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం రెండు దేశాలు త‌మ దౌత్య‌వేత్త‌ల‌ను వెలివేశాయి.