కష్టాల్లో స్విగ్గి ఉద్యోగి

అయితే ఈ సంవత్సరం జనవరి 20 నుంచి మొదలైన ఉద్యోగుల లే ఆఫ్, ఇప్పుడు స్విగ్గి మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా స్విగ్గి తన స్టాఫ్ మెంబెర్స్ని 6%కి తగ్గించాలి అనుకుంటుంది. దీని కారణంగా ఎంతో మంది స్విగ్గి ఉద్యోగులు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. అంతేకాదు రిస్క్ లో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరో ఉద్యోగాన్ని వెతుకుందాము అనుకుంటే, అక్కడ కూడా చుక్క ఎదురుగా ఉంటుంది. 100 జాబులకు అప్లై చేయగా, కనీసం ఒక ఉద్యోగం కూడా […]

Share:

అయితే ఈ సంవత్సరం జనవరి 20 నుంచి మొదలైన ఉద్యోగుల లే ఆఫ్, ఇప్పుడు స్విగ్గి మీద అధిక ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా స్విగ్గి తన స్టాఫ్ మెంబెర్స్ని 6%కి తగ్గించాలి అనుకుంటుంది. దీని కారణంగా ఎంతో మంది స్విగ్గి ఉద్యోగులు ఉద్యోగాన్ని కోల్పోతున్నారు. అంతేకాదు రిస్క్ లో ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి మరో ఉద్యోగాన్ని వెతుకుందాము అనుకుంటే, అక్కడ కూడా చుక్క ఎదురుగా ఉంటుంది. 100 జాబులకు అప్లై చేయగా, కనీసం ఒక ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. 

ఇప్పటికే ఆర్థిక మాన్యంతో కోతలం అవుతున్న ఐటి ఉద్యోగులకు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో ఉద్యోగాన్ని సంపాదించడం కష్టంగా మారింది. భారత్ కంపెనీలే కాకుండా మల్టీనేషనల్ కంపెనీలు కూడా లే ఆఫ్ ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా జాబ్ గురించి చాలామంది ఇబ్బందులు కూడా పడడం చాలామందికి తప్పట్లేదు. అమెజాన్,మెటా వంటి దిగ్గజ సంస్థలు కూడా తమ కంపెనీలలో పని చేస్తున్న ఉద్యోగులకు చేదు వార్తలు వినిపించాయి. 

ఇండియాలో లే ఆఫ్: 

ప్రస్తుతం భారతదేశంలో స్విగ్గి, మీ షో, క్రెడిట్, దుంజో వంటి ప్రముఖ సంస్థలు కూడా తమ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. ఉద్యోగాలు తొలగిస్తున్న నేపథ్యంలో, జాబ్ సెక్యూరిటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి గమనార్కంగా మిగిలింది. సడన్గా పోతున్నావు ఉద్యోగాలను చూస్తూ నిరాశకు గురై చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. తమ జీవన ఆధారాన్ని కోల్పోయినందుకు ఎంతోమంది బాధలో మునిగిపోయారు. కొత్త జాబ్ వెతుక్కోవడానికి కూడా అతి కష్టంగా మారిన ఈ సమయంలో లే ఆఫ్ అనే పదం భయానకంగా మారింది. 

స్విగ్గి ఎంప్లాయ్ ఫ్రస్టేషన్: 

లే ఆఫ్ ప్రకటించిన కొన్ని కంపెనీలు ఇప్పుడు మళ్లీ జాబ్ ఆఫర్ చేస్తున్నాయి. అంతేకాకుండా రిక్రూట్ చేసుకున్న ఉద్యోగులకు కొన్ని బెనిఫిట్స్ అనేవి కల్పిస్తున్నట్లు ప్రకటించాయి. అయితే స్విగ్గి కి సంబంధించిన ఒక ఎంప్లాయ్ లింక్డిన్లో తన, కోపాన్ని, ఫ్రస్టేషన్ వంటి భిన్నమైన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. “మూడు నెలలుగా కొన్ని వందల కంపెనీలకు అప్లికేషన్ పంపించడం జరిగింది కానీ ప్రస్తుతానికి ఒక్కరు కూడా రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు. కేవలం నాలుగైదు కంపెనీలు రెస్పాన్స్ పంపించినప్పటికీ, ఇంటర్వ్యూ ఇచ్చిన తరువాత మళ్ళీ వారు కాంటాక్ట్ చేయట్లేదు” అంటూ తన ఫ్రస్టేషన్ బయట పెట్టాడు. 

అయితే ప్రస్తుతం, ఆ స్విగ్గి ఎంప్లాయ్ తను ఎలాంటి సిచువేషన్ లో ఉన్నాడో కూడా చాలా బాధతో వివరించాడు. నా కుటుంబం పూర్తిగా నా మీదే ఆధారపడుతుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితి చాలా కష్టంగా మారింది. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఉద్యోగ విషయంలో నేను విఫలమవుతున్నాను. దీని కారణంగా నాకు ఉన్న, ఉద్యోగం వస్తుందని ఆశ కూడా పోతుంది. మీరు ఎవరైనా ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి, గైడ్ చేయండి, మీ సజెషన్స్ నాకు ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటాయి. ప్లీజ్ పర్సనల్గా మెసేజ్ చేయండి.” అంటూ లింక్డిన్లో తన పరిస్థితి వివరించాడు. 

ఎంప్లాయిమెంట్ ఎందుకు తగ్గింది:

అయితే జనవరి 20న లే ఆఫ్ గురించి స్విగ్గి ప్రకటించింది. తమ కంపెనీలో నుంచి 380 మంది ఉద్యోగాలును విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. అదేవిధంగా తమ సంస్థలో 6% ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తున్నట్లు సూచించింది. అయితే తమ కంపెనీలో అవసరానికి మించిన ఎంప్లాయిమెంట్ ఉన్నట్లు పేర్కొంది. అందుకే ఉద్యోగాలను తగ్గించే ప్రయత్నంలో ఉన్నట్లు తేలింది. అధిక ఎంప్లాయ్మెంట్ ఉన్నందువలన ప్రాఫిట్స్ వంటివి చూడలేకపోతున్నామని పేర్కొంది.