ట్విట‌ర్‌కు రూ.50 ల‌క్ష‌ల జ‌రిమానా

ట్విట్టర్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్ ..ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు అలాగే చదువుకోవచ్చు. ట్విట్టర్ లో ఖాతా కలిగిన సభ్యులు మెసేజ్లను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే మాత్రమే వీలుంటుంది. ఇకపోతే ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 35 పైగా  కార్యాలయాలలో ఉద్యోగులు కలిసి పనిచేస్తారు. ఇక ట్విట్టర్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రపంచంలో ఏమి జరుగుతోంది ప్రస్తుతం […]

Share:

ట్విట్టర్ అనేది ఒక సోషల్ నెట్వర్కింగ్ యాప్ ..ఇందులో సభ్యులు ట్వీట్లు అనబడే చిన్న చిన్న సందేశాలను పంపవచ్చు అలాగే చదువుకోవచ్చు. ట్విట్టర్ లో ఖాతా కలిగిన సభ్యులు మెసేజ్లను పోస్టు చేయవచ్చు, చదవవచ్చు. సభ్యులు కానివారు సందేశాలను కేవలం చదువుకోవడానికే మాత్రమే వీలుంటుంది. ఇకపోతే ట్విట్టర్ ప్రధాన కార్యాలయం శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా 35 పైగా  కార్యాలయాలలో ఉద్యోగులు కలిసి పనిచేస్తారు. ఇక ట్విట్టర్ యొక్క ముఖ్య లక్ష్యం ప్రపంచంలో ఏమి జరుగుతోంది ప్రస్తుతం ప్రజలు ఏమి మాట్లాడుతున్నారో తెలుసుకోవటమే.. 

కానీ ట్విట్టర్ ను కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక ట్విట్టర్ కూడా కొంతమంది వ్యక్తుల విషయంలో చూసి చూడనట్టు వదిలేస్తుండడంతో భారత ప్రభుత్వం కొన్ని అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్రం ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఆదేశాలను ట్విట్టర్ వ్యతిరేకిస్తూ చేసిన పిటిషన్ను తాజాగా కర్ణాటక హైకోర్టు కూడా తోసిపుచ్చింది హైకోర్టు కూడా ట్విట్టర్ కంపెనీకి ఏకంగా రూ.50 లక్షల జరిమానా విధించడం ఇప్పుడు ట్విట్టర్ కు గట్టి షాక్కు తగిలిందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళితే కొన్ని సోషల్ మీడియా ఖాతాలను అలాగే అసభ్యకర ట్రీట్లను బ్లాక్ చేయాలన్న కేంద్రం ఆదేశాలపై ట్విట్టర్ చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం సమర్థించలేదు.

అంతేకాదు కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాలను పాటించకపోవడం వల్ల హైకోర్టు ట్విట్టర్ కంపెనీకి రూ.50 లక్షలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవి మాట్లాడుతూ.. ఈ విషయంలో కర్ణాటక ప్రభుత్వ వైఖరిని కోర్టు సమర్పించింది అని భారతదేశం యొక్క చట్టాలను ప్రతి ఒక్కరు అనుసరించాలి అని ఆయన స్పష్టం చేశారు. గౌరవనీయమైన కర్ణాటక న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం యొక్క విధులను చట్టాలను తప్పనిసరిగా సమర్ధిస్తోంది అంటూ ఆయన తెలిపారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69a కింద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఆదేశాలను తిప్పికొడుతూ ట్విట్టర్ సవాలు చేసింది. ఇక ఫిబ్రవరి 2021, ఫిబ్రవరి 2022 మధ్య ఎన్నో సోషల్ మీడియా ఖాతాలు మరియు ట్వీట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ని కోరగా వీటిలో 39 బ్లాకింగ్ ఆర్డర్లను ట్విట్టర్ సవాలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

 అయితే 2022లో కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం తమ ఫ్లాట్ఫారం నుండి కంటెంట్ ను తీసివేయాలన్నా కేంద్రం ఆదేశాలను సవాల్ చేస్తూ ట్విట్టర్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. 2022లో దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ఖాతాను బ్లాక్ చేయాలని కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు దానికి గల కారణాలను ఒక జాబితా చేయాలని ట్విట్టర్ హైకోర్టుకు తెలిపింది. అవసరమైతే ఒక నియమావళిని కూడా అమల్లోకి తీసుకురావాలని పట్టుబట్టింది. ఇంతలో ట్విట్టర్ చాలా సంవత్సరాలుగా నాన్ కంప్లైంట్ ప్లాట్ఫారంగా ఉందని కేంద్రం హైకోర్టుకు తెలపగా బ్లాకింగ్ ఉత్తర్వులు జారీ చేయడానికి ముందు ప్రభుత్వం అలాగే ట్విట్టర్ ప్రతినిధుల మధ్య సుమారుగా 50 సార్లు సమావేశాలు జరిగాయని కూడా భారత ప్రభుత్వం వెల్లడించింది. ఇక అన్నింటిని ఉద్దేశించి కర్ణాటక ప్రభుత్వం ట్విట్టర్ తప్పులను ఎత్తిచూపుతూ కేంద్రానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నందుకు రూ.50 లక్షల జరిమానా కూడా విధించింది.