జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ న‌రేష్ గోయ‌ల్ అరెస్ట్

కెనరా బ్యాంక్‌ ఆరోపణ ద్వారా, రూ. 538 కోట్ల మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ శుక్రవారం అరెస్ట్ అయ్యారు. మే 3న జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ గోయల్, అతని భార్య అనిత మరియు కొంతమంది మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది. జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ అరెస్ట్:  కెనరా బ్యాంక్‌లో రూ. 538 కోట్ల నిరూపితమైన మోసానికి సంబంధించిన […]

Share:

కెనరా బ్యాంక్‌ ఆరోపణ ద్వారా, రూ. 538 కోట్ల మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జెట్ ఎయిర్‌వేస్ వ్యవస్థాపకుడు నరేష్ గోయల్ శుక్రవారం అరెస్ట్ అయ్యారు. మే 3న జెట్ ఎయిర్‌వేస్ ఫౌండర్ గోయల్, అతని భార్య అనిత మరియు కొంతమంది మాజీ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లపై సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈ కేసు వెలుగులోకి వచ్చింది.

జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ అరెస్ట్: 

కెనరా బ్యాంక్‌లో రూ. 538 కోట్ల నిరూపితమైన మోసానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్‌ను శుక్రవారం అర్థరాత్రి అరెస్టు చేయడంతో, భారతదేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌ చిక్కుల్లో పడినట్లు అవుతోంది.

ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) కింద జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేష్ గోయల్‌న్ని అదుపులోకి తీసుకున్నారు. 74 ఏళ్ల ఆయనను శనివారం ముంబైలోని ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టు ముందు హాజ‌రుప‌రిచారు. అక్కడ ED అతని కస్టడీ రిమాండ్‌ను కోరింది. 2021 జూలై 29న మనీలాండరింగ్ మోసం జరిగినట్లు సీబీఐ పేర్కొంది.

అక్రమ చెల్లింపులు: 

(జెఐఎల్)కు సంబంధించిన ఫోరెన్సిక్ ఆడిట్ మొత్తం కమీషన్ ఖర్చులలో, సంబంధిత కంపెనీలకు రూ. 1,410.41 కోట్లు చెల్లించిందని, ఈ క్రమంలోనే నిధులను, జెట్ ఎయిర్‌వేస్ (ఇండియా) లిమిటెడ్ స్వాహా చేసినట్లు బ్యాంకు ఆరోపించింది.

1 ఏప్రిల్ 2011, 30 జూన్ 2019 మధ్య ఎయిర్‌లైన్ ప్రొఫెషనల్.. కన్సల్టింగ్ ఖర్చుల కోసం రూ. 1,152.62 కోట్లు ఖర్చు చేసిందని ఏజెన్సీ పేర్కొంది. కీలకమైన నిర్వాహక సిబ్బందికి కూడా ఈ మనీలాండరింగ్ కేసులో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది, అయితే పెద్ద మొత్తంలో, మొత్తం రూ. 197.57 కోట్ల అవకతవకలు జరిగాయని, అనఫిషియల్ లావాదేవీలు జరిగాయని వెల్లడించింది సిబిఐ. విచారణ ప్రకారం, జెట్ ఎయిర్‌వేస్ మొత్తం 1,152.62 కోట్లలో 420.43 కోట్లను మాత్రమే ఎయిర్వేస్ సేవలలో, కన్సల్టెన్సీ ఫీజులో చెల్లించింది, కానీ వారి ఇన్‌వాయిస్‌లలోని, ఎక్కువ మొత్తంలో డబ్బు లావాదేవీల లెక్కలలో అవకతవకలు ఉన్నాయని స్పష్టమైంది.

JIL ఒప్పందం ప్రకారం, జనరల్ సెల్లింగ్ ఏజెంట్ల (GSA) ఖర్చులు GSA ద్వారానే భరించాలి. కానీ JIL ద్వారా కాదు. అయితే, GSAకు అనుగుణంగా లేని రూ. 403.27 కోట్ల వివిధ ఖర్చులను JIL ద్వారానే చెల్లించినట్లు తెలుస్తోందని అని సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లోని ఫిర్యాదులో ఆరోపించింది. అయితే ఇందులో గోయల్ కుటుంబానికి చెందిన సిబ్బంది జీతాలు, ఫోన్ బిల్లులు మరియు వాహన ఖర్చులు వంటి వ్యక్తిగత ఖర్చులను JIL చెల్లించింది.

ఇతర ఆరోపణలతోపాటు, జెట్ లైట్ (ఇండియా) లిమిటెడ్ (జెఎల్‌ఎల్) ద్వారా అడ్వాన్స్‌లు మరియు పెట్టుబడి పెట్టే విషయంలో కూడా నిధులు అనేవి పక్కకు మళ్ళించినట్లు, ఫోరెన్సిక్ ఆడిట్ సమయంలో బయటపడింది. JIL అనుబంధ JLL కోసం నిధులను రుణాలు మరియు అడ్వాన్సులు వంటివి, ప్రత్యేకంగా పెట్టుబడుల రూపంలో మళ్లించడం జరిగింది.

ముంబైలోని ఈడీ కార్యాలయంలో సుదీర్ఘ విచారణ అనంతరం శుక్రవారం గోయల్‌ను అదుపులోకి తీసుకున్నారు. కెనరా బ్యాంక్ ఆరోపించిన మోసానికి సంబంధించి, మే 5న జెట్ ఎయిర్‌వేస్ పాత కార్యాలయాలలో, వ్యవస్థాపకుడి నివాసంపై సీబీఐ రైడ్ నిర్వహించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జులైలో గోయల్‌తో పాటు ఇతర 8 మంది ఇంటిపై కూడా రైడ్ నిర్వహించినట్లు ప్రకటించింది.