రెట్టింపైన ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్స్

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్స్ రెండింత‌లు పెరిగి 3 కోట్లకు చేరిన‌ట్లు తెలుస్తోంది… గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది ఐటీ..రిటర్నులు సమర్పించారు ప‌న్ను చెల్లింపుదార్లు, క‌న్స‌ల్టెంట్ల నుంచి వ‌రుస‌గా అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం దిగొచ్చి ఐటీ రిట‌ర్నుల గ‌డువును మ‌రో నెల రోజుల పాటు పెంచింది. దీంతో ఆగ‌స్టు 31 వ‌ర‌కూ ఆల‌స్య రుసుము లేకుండా ప‌న్ను చెల్లించేందుకు వెసులుబాటు ల‌భించింది. 2022లో జూలై 25 న 3 కోట్ల […]

Share:

గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ఐటీ రిట‌ర్నుల ఫైలింగ్స్ రెండింత‌లు పెరిగి 3 కోట్లకు చేరిన‌ట్లు తెలుస్తోంది… గతేడాదితో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది ఐటీ..రిటర్నులు సమర్పించారు

ప‌న్ను చెల్లింపుదార్లు, క‌న్స‌ల్టెంట్ల నుంచి వ‌రుస‌గా అభ్య‌ర్థ‌న‌లు రావ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం దిగొచ్చి ఐటీ రిట‌ర్నుల గ‌డువును మ‌రో నెల రోజుల పాటు పెంచింది. దీంతో ఆగ‌స్టు 31 వ‌ర‌కూ ఆల‌స్య రుసుము లేకుండా ప‌న్ను చెల్లించేందుకు వెసులుబాటు ల‌భించింది. 2022లో జూలై 25 న 3 కోట్ల మంది ప్రజలు ఐటీఆర్‌ని దాఖలు చేశారు… మ‌రో వైపు గ‌త వారం చివ‌రి వ‌ర‌కూ అధికారిక స‌మాచారం ప్ర‌కారం చూస్తే, గ‌త ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన రిట‌ర్నుల ఫైలింగ్ రెండింత‌లు పెరిగి 3 కోట్లకు చేరిన‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో రీఫండ్ల విష‌యంలోనూ వేగం పెరిగింది.

దేశంలో కోటీశ్వరుల సంఖ్య భారీగా పెరిగింది. ఆదాయపు పన్ను శాఖ ఈ-ఫైలింగ్ డేటా ప్రకారం,  2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఆర్జించినట్లు 2.69 లక్షల మందికి పైగా ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేశారు. ఇది కోవిడ్‌ మహమ్మారి సంక్షోభం 2018-19 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 49.4 శాతం పెరిగింది.

మరోవైపు అదే ​కాలానికి రూ. 5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్‌ కేవలం 1.4 శాతం మాత్రమే పెరిగాయి.  ఆర్థిక సంవత్సరాల వారీగా చూస్తే..  రూ.కోటి పైగా ఆదాయానికి దాఖలైన ట్యాక్స్‌ రిటర్న్స్‌ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 2.69 లక్షలు,  2021-22 ఏడాదికి 1.93 లక్షలు, 2018-19 ఆర్థిక సంవత్సరానికి 1.80 లక్షలు ఉన్నాయి.

2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న ట్యాక్స్‌ ఫైలర్లు దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌ల సంఖ్య 2019-20తో పోల్చితే  41.5 శాతం పెరిగింది. కానీ రూ. 5 లక్షలు, ఆలోపు ఆదాయ విభాగంలో కేవలం 0.6 శాతం పెరిగింది. కోవిడ్‌ మహమ్మారి సంక్షోభం దెబ్బ వివిధ ఆదాయ వర్గాలపై ఎలా ఉందో ఐటీ రిటర్న్స్‌ ఫైలింగ్‌ గణాంకాలను పరిశీలిస్తే అర్థమవుతుంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయ వర్గం మినహా, ఇతర అన్ని ఆదాయ వర్గాల ట్యాక్స్‌ రిటర్న్స్‌ సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 5 లక్షల వరకు ఆదాయానికి దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లు అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 4.94 కోట్ల నుంచి 5.68 కోట్లకు పెరిగాయి. అయితే, ఇతర ఆదాయ వర్గాల రిటర్న్‌లలో తగ్గుదల కనిపించింది.

రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల సంఖ్య క్రితం ఆర్థిక సంవత్సరంలో ఉన్న 1.90 లక్షల నుంచి 1.46 లక్షలకు పడిపోయింది. రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి మధ్య ఆదాయానికి ఐటీఆర్‌ల సంఖ్య 2.83 లక్షల నుంచి 2.25 లక్షలకు తగ్గాయి. రూ. 5 లక్షల-10 లక్షల మధ్య ఆదాయానికి ఫైల్‌ చేసిన ట్యాక్స్‌ రిటర్న్స్‌ 1.05 కోట్ల నుంచి 99.36 లక్షలకు తగ్గాయి.

ఇప్ప‌టివ‌ర‌కూ ప్రాసెస్ అయిన రీఫండ్ కేసులు 81% పెరుగుద‌ల‌తో 65 ల‌క్ష‌ల‌కు చేరాయి. అదే స‌మ‌యంలో ఏడాది కాల వ్య‌వ‌ధిలో రీఫండ్ల ద్వారా ప‌న్ను చెల్లింపుదార్ల‌కు వెన‌క్కు చెల్లించిన సొమ్ము విలువ 35% వృద్ధి చెంది రూ.77,700 కోట్లుగా ఉంది. అంత‌కు ముందు ఆర్థిక సంవ‌త్స‌రంలో ఇది రూ.57,551 కోట్లుగా మాత్ర‌మే ఉంది

ఈ ఏడాది బడ్జెట్‌‌లో ఆదాయపన్ను విషయమై ఊరట లభిస్తుందని వేతన జీవులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబులు మారుస్తారని కూడా వార్తలు వెలువడ్డాయి. కానీ అరుణ్ జైట్లీ మాత్రం శ్లాబులనేం మార్చలేదు. కానీ ట్రాన్స్‌పోర్ట్, వైద్య ఖర్చుల రూపంలో రూ. 40 వేల వరకు ఊరట లభించేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ స‌ద‌వ‌కాశాన్ని ప‌న్ను చెల్లింపుదార్లు ఉప‌యోగించుకునే వీలుంది అని ఆయన తెలిపారు.