సరికొత్త చరిత్ర సృష్టించిన ఇన్ఫోసిస్ సంస్థ

మొదటి క్వాటర్ లో  5945 కోట్ల‌ లాభాలు : దేశం లోనే అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ 2023 వ సంవత్సరానికి గాను తొలి త్రైమాసిక  ఫలితాలను విడుదల చేసింది. జూన్ నెల వరకు ఈ ఏడాది ఆ కంపెనీ కి వచ్చిన లాభాలను నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది తో పోలిస్తే  ఈ ఏడాది 11 శాతం లాభాలు వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,945 కోట్ల […]

Share:

మొదటి క్వాటర్ లో  5945 కోట్ల‌ లాభాలు :

దేశం లోనే అతి పెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కంపెనీ 2023 వ సంవత్సరానికి గాను తొలి త్రైమాసిక  ఫలితాలను విడుదల చేసింది. జూన్ నెల వరకు ఈ ఏడాది ఆ కంపెనీ కి వచ్చిన లాభాలను నిన్న సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది తో పోలిస్తే  ఈ ఏడాది 11 శాతం లాభాలు వచ్చినట్టుగా చెప్పుకొస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 5,945 కోట్ల రూపాయిల లాభాలు వచ్చాయట. దాంతో కంపెనీ మొత్తం ఆదాయం 37,933  కోట్ల రూపాయలకు ఎగబాకింది. అయితే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ లో అనిశ్చితి ఏర్పడడం వల్ల ఈ వచ్చే ఏడాది ఈ స్థాయి లాభాలు ఉండే అవకాశం లేదని చెప్పుకొచ్చింది ఇన్ఫోసిస్ సంస్థ. ఈ ఏడాది వచ్చిన లాభాలతో పోలిస్తే వచ్చే ఏడాదికి నాలుగు నుండి 5 వరకు వృద్ధి రేటు తగ్గుతుందని అంచనా వేస్తుంది. అలాగే ఆపరేషన్ మార్జిన్ 80 బేసిస్ పాయింట్స్ పెరిగి 20.8 శాతం ఉన్నట్టుగా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

ఉద్యోగుల ఆట్రిషన్ గత ఏడాది తో పోలిస్తే బాగా తగ్గింది :

ఇది ఇలా ఉండగా ఉద్యోగుల ఆట్రిషన్ మాత్రం గత ఎడారి తో పోలిస్తే ఈ ఏడాది తగ్గినట్టుగా కంపెనీ వెల్లడించింది. గత ఏడాది మార్చి నాటికి 20.9 శాతం ఉండగా , ఈ ఏడాది 17.3 శాతానికి పడిపోయింది.  అంతే కాకుండా గత సంవత్సరం ఇదే క్వార్టర్ (జూన్ వరకు ) 28.4 నాలుగు శాతానికి ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది ఇన్ఫోసిస్ సంస్థ. ఇది ఇలా ఉండగా ఈ ఏడాది మొదటి త్రైమాసికం లో ఇన్ఫోసిస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 2.3 బిలియన్ డాలర్స్ తో సమానంగా డీల్స్ కుదిరించుకోవడం వల్ల భవిష్యత్తులో అభివృద్ధి వైపు అడుగులు వేసేలా చేసిందని ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ వెల్లడించారు. అంతే కాకుండా తమ సంస్థ జెనెరేటెడ్ ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ పై ద్రుష్టి సారించడం వల్ల కూడా ఈ స్థాయి వృద్ధి చెందడానికి దోహదపడిందని చెప్పుకొచ్చారు. మా కంపెనీ నుండి బయటికి వస్తున్నా ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ఉత్పతులకు క్లైంట్స్ నుండి అద్భుతమైన స్పందన లభిస్తుందని   చెప్పుకొచ్చారు సలీల్ పరేఖ్.

అత్యధిక లాభాలను ఆర్జించిన కంపెనీ గా ఇండియా లో రెండవ స్థానం :

రాబొయ్యే రోజుల్లో ఆర్టీఫిషియల్ ఇంటలిజెన్స్ వాడకం వృద్ధి చెందుతుంది కనుక మార్జిన్లు కచ్చితంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్త పరిచాడు సలీల్. ఉత్పతులు అత్యంత క్వాలిటీ గా ఉండే విధంగా మా ఇన్ఫోసిస్ సంస్థ అత్యంత కఠినమైన క్రమశిక్షణ కార్యాచరణాలు చేపట్టడం వల్లే ఈ విజయం సాధ్యపడిందని కంపెనీ CFO నిలంజన్ రాయ్ చెప్పుకొచ్చాడు. ఫ్రీ క్యాష్ ఫ్లో లాభాల్లో 96.6 శాతం వద్ద బలంగా ఉందని, ఆలా బలమైన మూలధన కేటాయింపులు చెయ్యడం వల్ల పెట్టుబడిదారులకు అధికమొత్తం లో చెల్లింపులు జరిగాయని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది అత్యధిక లాభాలను అందుకున్న ఐటీ కంపెనీ గా TCS నిల్చింది. ఈ ఏడాది ఆ సంస్థకి వచ్చిన లాభాలు 11074 కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. ఆ తర్వాత ఇన్ఫోసిస్ కి ఇన్ఫోసిస్ కి 5945 కోట్ల రూపాయిల లాభం తో రెండవ స్థానం లోను 3983 కోట్ల రూపాయిల లాభాలతో హెచ్ సి ఎల్ కంపెనీ మూడవ స్థానం లోను, అలాగే 2870 కోట్ల రూపాయిల లాభాలతో నాల్గవ స్థానం లో విప్రో కంపెనీలు కొనసాగుతున్నాయి. అయితే మొదటి స్థానానికి మరియు రెండవ స్థానినికి మధ్య ఉన్న తేడా దాదాపుగా 50 శాతం కి పైగా ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.