భారత సామర్థ్యం తక్కువేమీ కాదు: మోదీ

గ్రీన్ ఎనర్జీ.. ఇప్పుడు ఈ పదం గురించి చాలా చర్చే నడుస్తోంది. కాలుష్యం లేకుండా మనకు ఎనర్జీని ఇది ఇస్తుందని, దీని వల్ల మన ప్రపంచం కాలుష్యం బారిన పడకుండా ఉంటుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతోంది. ఇక ఇప్పటి నుంచి గ్రీన్ ఎనర్జీ మీద ప్రపంచం ఫోకస్ చేయాలని అనేక సందర్భాల్లో, అనేక మంది నేతలు చెబుతున్నారు. గ్రీన్ […]

Share:

గ్రీన్ ఎనర్జీ.. ఇప్పుడు ఈ పదం గురించి చాలా చర్చే నడుస్తోంది. కాలుష్యం లేకుండా మనకు ఎనర్జీని ఇది ఇస్తుందని, దీని వల్ల మన ప్రపంచం కాలుష్యం బారిన పడకుండా ఉంటుందని చాలా మంది నిపుణులు చెబుతున్నారు. కానీ ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా తక్కువ మొత్తంలో మాత్రమే గ్రీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతోంది. ఇక ఇప్పటి నుంచి గ్రీన్ ఎనర్జీ మీద ప్రపంచం ఫోకస్ చేయాలని అనేక సందర్భాల్లో, అనేక మంది నేతలు చెబుతున్నారు. గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెట్టి.. ఆ రంగంలో ఉత్పత్తిని సాధించడం వల్ల కాలుష్య స్థాయిలను నివారించవచ్చని, తద్వారా భూతాపం కూడా తగ్గుతుందని అనేక మంది పర్యావరణ వేత్తలు భావిస్తున్నారు. అటువంటి గ్రీన్ ఎనర్జీ వైపు మన భారత్ కూడా వడివడిగా అడుగులేస్తోంది. 

మన సామర్థ్యం అదే… – మోదీ

ఇండియాలో గ్రీన్ ఎనర్జీపై పెట్టుబడులు పెట్టాలని వివిధ వర్గాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ప్రధాని మోదీ ఆహ్వానించారు. ఇక దేశంలో గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం పెరుగుతోందని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన దేశ గ్రీన్ ఎనర్జీ సామర్థ్యం బంగారు గని కంటే తక్కువేం కాదని మోదీ తెలిపారు. బడ్జెట్​ సందర్భంగా గ్రీన్ గ్రోత్ గురించి చేసిన వివిధ ప్రకటనల మీద మోదీ ఒక వెబినార్​లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన సామర్థ్యం తక్కువేమీ కాదని, ఇక ఇండియాను ఎవరూ తక్కువగా అంచనా వేయలేరని ఆయన పేర్కొన్నారు. ఈ రంగంలో ఇండియా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అందరినీ తాను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ప్రభుత్వ దృష్టి దాని పైనే ఎక్కువ

ప్రభుత్వం సౌరశక్తి, పవనశక్తి, బయో ఫ్యూయల్ మొదలైన వాటిపై ఎక్కువగా దృష్టి పెట్టిందని ప్రధాని మోదీ తెలిపారు. షెడ్యూల్ కంటే ఐదు నెలల ముందే మన దేశం లక్ష్యాన్ని సాధించిదన్నారు. ఫ్యూయల్​లో 10 శాతం ఇథనాల్ కలపడం విజయవంతంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించగా.. షెడ్యూల్​ కంటే ముందే ఆ టార్గెట్​ను రీచ్ అయ్యిందన్నారు. ఈ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. షెడ్యూల్ కంటే తొమ్మిది సంవత్సరాల ముందుగానే నాన్ ఫాసిల్ ఇందన లక్ష్యాన్ని కూడా భారత్ చేరుకోవడంపై ఆయన స్పందించారు. ఇలా ఇథనాల్​ను కలిపిన ఫ్యూయల్​ను ఉపయోగించడం వల్ల మన వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కొద్ది మొత్తంలో తగ్గే చాన్స్ ఉంటుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. అందుకోసమే మన వాడే ఇంధనంలో ఇథనాల్​ను కలపాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మనం వాడే పెట్రోల్ మరియు డీజిల్ రెండింటిలో కూడా 10 శాతం ఇథనాల్​ను వాడుతున్నారు. భవిష్యత్​లో అసలు పెట్రోల్, డీజిల్ అనేవి వాడకుండానే వాహనాలు నడిసేలా సౌరశక్తిని, హైడ్రోజన్ ఎనర్జీని వినియోగించుకోవాలని, దీని వల్ల కాలుష్యం పెద్ద మొత్తంలో తగ్గే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. 

వడివడిగా అడుగులు…

మండించే ఇంధనాలను పూర్తిగా తగ్గించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఎలక్ట్రికల్ కార్లు, బైక్​లు మార్కెట్లోకి వచ్చాయి. వీటితో కొన్ని సమస్యలు ఉన్నా కానీ.. ఇవి విజయవంతమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ ఆటోమొబైల్ కంపెనీలన్నీ కూడా తమ వంతుగా ఎలక్ట్రిక్ వాహనాలను విపణిలోకి ప్రవేశపెట్టేందుకు చూస్తున్నాయి.