కార్పొరేట్ డెట్ మార్కెట్ ఫండ్

భారత స్టాక్ మార్కెట్‌‌లో ఒత్తిడి ఎదురయ్యే సమయాల్లో కార్పొరేట్ డెట్ మార్కెట్‌‌కు లిక్విడిటీని అందించడానికి భారత దేశ ప్రభుత్వం 330 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. డెట్ మార్కెట్లో మదుపర్లలో కలిగే భయాందోళనల వల్ల తలెత్తే అమ్మకాలను ఆపడానికి, బాండ్లను రిడీమ్ చేయడానికి సంబంధించిన ఒత్తిడిని ఈ ఫండ్ తగ్గిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కష్టకాలంలో కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు లిక్విడిటీని అందించడానికి భారత ప్రభుత్వం 330 బిలియన్ రూపాయల (4 బిలియన్ […]

Share:

భారత స్టాక్ మార్కెట్‌‌లో ఒత్తిడి ఎదురయ్యే సమయాల్లో కార్పొరేట్ డెట్ మార్కెట్‌‌కు లిక్విడిటీని అందించడానికి భారత దేశ ప్రభుత్వం 330 బిలియన్ డాలర్ల నిధిని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. డెట్ మార్కెట్లో మదుపర్లలో కలిగే భయాందోళనల వల్ల తలెత్తే అమ్మకాలను ఆపడానికి, బాండ్లను రిడీమ్ చేయడానికి సంబంధించిన ఒత్తిడిని ఈ ఫండ్ తగ్గిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

కరోనా కష్టకాలంలో కార్పొరేట్ డెట్ మార్కెట్‌కు లిక్విడిటీని అందించడానికి భారత ప్రభుత్వం 330 బిలియన్ రూపాయల (4 బిలియన్ డాలర్లు) నిధిని ఏర్పాటు చేయబోతోంది. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా ఉటంకిస్తూ ప్రముఖ సంస్థ ఈ సమాచారాన్ని అందించింది. డెట్ మార్కెట్లో భయాందోళనల అమ్మకాలను ఆపడానికి, బాండ్లను రిడీమ్ చేయడానికి సంబంధించిన ఒత్తిడిని ఈ ఫండ్ తగ్గిస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ డిప్యూటీ డైరెక్టర్ డీపీ సింగ్ మాట్లాడుతూ 90 శాతం నిధులను భారత ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. ఇక మిగిలిన మొత్తం ఇతర అసెట్ మేనేజర్ల నుంచి వస్తుందని ఆయన తెలిపారు.

ఈ కొత్త ఫండ్‌‌ను చూసే బాధ్యతను దేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ అనుబంధ సంస్థ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్‌కు అప్పగించారు. 2020లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఈ నిధిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను మొదట ప్రతిపాదించింది. ఆ సమయంలో దేశీయ రుణ మార్కెట్లో అనేక హైప్రొఫైల్ డిఫాల్ట్ కేసులు ఉన్నాయి.

క్రెడిట్ ఇష్యూ వచ్చినప్పుడల్లా రిడెంప్షన్ కోసం పోటీ జరుగుతుందని, లిక్విడిటీపై ఒత్తిడి తెస్తుందని గతంలో చూశామని.. ఆ సంస్థ ప్రశ్నలకు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన సమాధానంలో సింగ్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒత్తిడి సమయాల్లో ఇలాంటి నిధులను మార్కెట్‌‌కు ఉపయోగించి ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్ బాండ్లను కొనుగోలు చేయవచ్చు.

ఏప్రిల్ 2020లో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా 6 డెట్ ఫండ్ల నుండి ఉపసంహరణను నిషేధించినప్పుడు కూడా ఇలాంటి ఫండ్ అవసరం తెరపైకి వచ్చింది. ఎందుకంటే ఇన్వెస్టర్లు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతో ఫండ్ హౌస్ తన డెట్ పెట్టుబడులను మార్కెట్లో విక్రయించలేకపోయింది.

ఈ ఫండ్ కోసం సెబీ పంపిన ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మూడు నెలల్లో ఈ నిధి అందుబాటులోకి వస్తుందని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఆ సంస్థ పేర్కొంది. 

39 ట్రిలియన్ రూపాయల (471 బిలియన్ డాలర్లు) భారతీయ కార్పొరేట్ బాండ్ మార్కెట్‌తో పోలిస్తే ఈ ఫండ్ చిన్నదిగా కనిపిస్తుంది. అయితే రానున్న రోజుల్లో కార్పొరేట్ బ్యాక్ ఫండ్‌‌ని మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి.


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యూచువల్ ఫండ్ భారతదేశం యొక్క అతిపెద్ద ప్రభుత్వ-యాజమాన్య సంస్థ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యూనిట్ బ్యాక్‌స్టాప్ ఫండ్‌ను నిర్వహించే బాధ్యతను పొందింది.