జీడీపీ పెరగొచ్చు: Icra

ఏ దేశ అభివృద్ధి విషయంలో కానీ జీడీపీ అనేది చాలా ముఖ్యం. జీడీపీ అంచనాలతోనే దేశ అభివృద్ధిని లెక్కేస్తారు. ఒక దేశ జీడీపీ పెరిగిందంటే ఆ దేశం డెవలప్ అవుతుందని లెక్కేస్తారు. ఒక కంట్రీ ఎంత డెవలప్ అయిందో తెలుసుకోవాలంటే ఆ కంట్రీ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఆ దేశ జీడీపీని చూస్తే సరిపోతుంది. ఆ దేశం ఎంతటి కీర్తిని సాధిస్తుందో ఒక్క జీడీపీని చూస్తే తెలిసిపోతుంది. అందుకోసమే ఆర్థిక శాఖ జీడీపీ విషయంలో చాలా […]

Share:

ఏ దేశ అభివృద్ధి విషయంలో కానీ జీడీపీ అనేది చాలా ముఖ్యం. జీడీపీ అంచనాలతోనే దేశ అభివృద్ధిని లెక్కేస్తారు. ఒక దేశ జీడీపీ పెరిగిందంటే ఆ దేశం డెవలప్ అవుతుందని లెక్కేస్తారు. ఒక కంట్రీ ఎంత డెవలప్ అయిందో తెలుసుకోవాలంటే ఆ కంట్రీ మొత్తం తిరగాల్సిన అవసరం లేదు. ఆ దేశ జీడీపీని చూస్తే సరిపోతుంది. ఆ దేశం ఎంతటి కీర్తిని సాధిస్తుందో ఒక్క జీడీపీని చూస్తే తెలిసిపోతుంది. అందుకోసమే ఆర్థిక శాఖ జీడీపీ విషయంలో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. జీడీపీ విషయంలో ఏ చిన్న మిస్టేక్ జరిగినా కానీ దేశం మొత్తం కిందా మీద అవుతుంది. అందుకోసమే ఆర్థిక శాఖ జీడీపీ మీద ఎప్పుడూ ఫుల్  కాన్సంట్రేట్ చేసి పెడుతుంది.   

పెరిగిన వృద్ధి రేటు 

గత జనవరి-మార్చి త్రైమాసికంలో మన ఇండియా వృద్ధి రేటు 6.1% గా నమోదైంది. దీంతో ఈ సారి కూడా అదే వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందని అంతా అంచనా వేశారు. కానీ జీడీపీ అంచనాలను గురించి చెప్పే ఇక్రా అనే సంస్థ మాత్రం వెరైటీగా అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ కాలంలో భారత ఆర్థిక వృద్ధి 8.5%కి చేరుకుంటుందని ఇక్రా రేటింగ్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక విడుదల కాగానే అంతా ఆనందం వ్యక్తం చేశారు. మన దేశ జీడీపీ పెరిగిందని మనం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నామని అంతా అంటున్నారు. ఇలా జీడీపీ పెరిగేందుకు సర్వీసెస్ రంగంలో రికవరీ కీ రోల్ పోషించిందని ఇక్రా అభిప్రాయపడింది. 

RBI అంచనా తప్పు.. 

RBI అంచనా వేసిన 8.1% కంటే ఇక్రా అంచనా రేటు ఎక్కువగా ఉంది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఇది నష్టాన్ని రుజువు చేస్తుందని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అస్థిరమైన వర్షపాతం, ఏడాది క్రితం కమోడిటీ ధరలతో వ్యత్యాసాలు తగ్గడం మరియు ప్రభుత్వ క్యాపెక్స్ ఊపందుకోవడం సాధ్యమైన మందగమనం వల్ల ఇది సాధ్యపడిందని ఇక్రా అభిప్రాయపడింది. త్వరలో పార్లమెంట్  ఎన్నికలు సమీపిస్తున్నందున వృద్ధి తగ్గే అవకాశం ఉందని ఇక్రా తెలిపింది. 

కారణం అదే.. 

మొదటి త్రైమాసికంతో పోలిస్తే కాసింత జీడీపీ తగ్గుముఖం పట్టిందని పలు నివేదికలు స్పష్టం చేశాయి.  మొదటి త్రైమాసికంలో కురిసిన భారీ అకాల వర్షాలు, ద్రవ్య కఠినత మరియు బలహీనమైన బాహ్య డిమాండ్ ప్రభావం జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపిందని అందుకోసమే జీడీపీ తగ్గుముఖం పట్టిందని ఆమె చెప్పారు. 

వృద్ధి పెరిగేందుకు కారణం అవే.. 

సేవల డిమాండ్‌లో నిరంతర క్యాచ్ అప్ మరియు మెరుగైన పెట్టుబడి కార్యకలాపాలు, ముఖ్యంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో స్వాగతించదగిన ఫ్రంట్‌లోడింగ్ మరియు కొన్ని రంగాలలో మార్జిన్‌లను విస్తరించిన వివిధ వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం వంటి అంశాలు జూన్ త్రైమాసికంలో వృద్ధిని పెంచాయని ఆమె చెప్పారు. ఈ త్రైమాసికంలో వృద్ధి పెరగేందుకు ఇవే ముఖ్య కారణాలని ఇక్రా అభిప్రాయపడింది. 

అంచనా వేసే ఏజెన్సీలెన్నో.. 

జీడీపీని అంచనా వేసేందుకు అనేక ఏజెన్సీలున్నాయి. ఇందుకోసం అనేక ఏజెన్సీలు పని చేస్తున్నాయి. ఈ ఏజెన్సీలు ఏటా జీడీపీ అంచనాలను మనకు నివేదికల రూపంలో తెలుపుతాయి. నివేదికలు ఎలా వచ్చినా కానీ దేశాలు వాటిని యాక్సెప్ట్ చేస్తాయి. వృద్ధి అంచనాలు ఈ ఏజెన్సీలు ఇచ్చిన నివేదికలకు కొంచెం అటూ ఇటుగా ఉంటాయని కానీ వాటిలో పెద్ద తేడా మాత్రం కనిపించదు. అందుకోసమే ఈ ఏజెన్సీలను ప్రభుత్వాలతో పాటు ప్రజలు కూడా నమ్ముతారు.  23 రాష్ట్ర ప్రభుత్వాల (అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మణిపూర్ మరియు మేఘాలయ మినహా) మొత్తం మూలధన వ్యయం మరియు నికర రుణాలు మరియు భారత ప్రభుత్వ స్థూల మూలధన వ్యయం 76 శాతం పెరిగి ₹ 1.2 లక్షల కోట్లకు, 59.1 శాతానికి పెరిగిందని ఇక్రా తెలిపింది. Q1 FY24లో వరుసగా ₹ 2.8 లక్షల కోట్లకు చేరుకుంది.