అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భారత్ ఆర్ధిక వ్యవస్థ

గడిచిన కొద్ది సంవత్సరాలలో మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ఎన్నో సవాళ్ళను ఎదురుకొని నిలబడింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవానికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. ప్రాణ హాని తో పాటుగా ఆస్తి నష్టం కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఇప్పటికీ కరోనా మహమ్మారి చేసిన ఆస్తి నష్టం నుండి కొన్ని దేశాలు ఆర్థికంగా కోలుకోలేదు. కానీ మన భారత దేశం మాత్రం తొందరగా కోలుకొని అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. గోల్డ్ మెన్ […]

Share:

గడిచిన కొద్ది సంవత్సరాలలో మన భారత దేశ ఆర్ధిక వ్యవస్థ ఎన్నో సవాళ్ళను ఎదురుకొని నిలబడింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి విలయతాండవానికి ప్రపంచం మొత్తం అతలాకుతలం అయ్యింది. ప్రాణ హాని తో పాటుగా ఆస్తి నష్టం కూడా కనీవినీ ఎరుగని రీతిలో జరిగింది. ఇప్పటికీ కరోనా మహమ్మారి చేసిన ఆస్తి నష్టం నుండి కొన్ని దేశాలు ఆర్థికంగా కోలుకోలేదు. కానీ మన భారత దేశం మాత్రం తొందరగా కోలుకొని అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. గోల్డ్ మెన్ శాక్స్ అనే ప్రముఖ సంస్థ భారత్ గురించి లేటెస్ట్ గా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మీడియా లో హాట్ టాపిక్ గా నిలిచాయి. భారత దేశ ఆర్ధిక వ్యవస్థ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుందని. రానున్న 50 సంవత్సరాలలో, అనగా 2075 వ సంవత్సరం నాటికి భారతదేశ ఆర్ధిక వ్యవస్థ అమెరికా ఆర్ధిక వ్యవస్థ ఆదాయాన్ని కూడా దాటేస్తుందని చెప్పుకొచ్చింది ఈ గోల్డ్ మెన్ శాక్స్ సంస్థ.

ఉపాధి అవకాశాలను పెంపొందిస్తే ఇక  తిరుగే లేదు:

2075 వ సంవత్సరం నాటికి ఇండియన్ ఎకానమీ 52.5 ట్రిలియన్ డాలర్స్ కి చేరుకొని, చైనా తర్వాతి స్థానం లో కచ్చితంగా నిలుస్తుందని ఈ సంస్థ పేర్కొనింది. ఇది ఇలా ఉండగా గోల్డ్ మెన్ శాక్స్ రీసెర్చ్ సంస్థ కి చెందిన ఆర్ధిక శాస్త్రవేత్త శాంతను సేన్ గుప్త మాట్లాడుతూ ‘ ప్రతీ ఏటా పెరుగుతున్న జనాభా సంఖ్య కి ఉపాధి అవకాశాలను అత్యధికంగా కలిపించుకునే వెసులుబాటు భారత్ కి మాత్రమే ఉంది. ప్రతీ రంగం లోను శ్రామిక శక్తి కి పెద్ద పీట వేస్తూ భాగస్వాములను చెయ్యడం, ప్రతిభ గల యువతకి శిక్షణ కలిపించి వారిని గొప్ప నైపుణ్యం ఉన్నవారి లాగ మలచడం వంటి వాటి పై ప్రత్యేక ద్రుష్టి సారించాలి. రానున్న రెండు దశాబ్దాలలో భారత్ ఇతర దేశాల మీద ఆధారపడాల్సిన ఆవశ్యకత తగ్గుట్టు వస్తుంది. ప్రస్తుతం భారత్ మాన్యుఫ్యాక్చరింగ్ లోను, మౌలిక సదుపాయాలను  మరియు సేవలు పెంచుకోవడం లో ప్రతీ ఏటా అభివృద్ధి సాధిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఈ నివేదిక అందించిన సమాచారం ప్రకారం ‘ సాంకేతిక మరియు సృజనాత్మకతతో భారత్ గడిచిన కొద్ది సంవత్సరాల నుండి ఎవ్వరూ ఊహించని స్థాయి పురోగతి సాధించింది. అయితే జీడీపీ వృద్ధి చెండానికి ఇదొక్కటే సరిపోదు, కచ్చితంగా పెట్టుబడులు భారత్ లో భారీ గా జరగాల్సిందే. ఒకప్పుడు భారత్ ప్రతీ విషయం లోను ఇతర దేశాల మీద ఆధారపడుతూ వచ్చింది. ఇప్పుడు మెల్లగా ఇతర దేశాల మీద ఆధారపడే ఆవశ్యకత తగ్గుతూ వస్తుంది. అదే సమయం లో తలసరి ఆదాయాలు కూడ గణనీయం గా పెరుగుతున్నాయి, ఆర్ధిక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ అంశాలన్నీ పెట్టుబడి దారులను బాగా ఆకర్షిస్తున్నాయి’ అంటూ ఈ నివేదిక పేర్కొంది. భారత ఆర్ధిక వ్యవస్థ వృద్ధి చెందడానికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ మహా నగరం ఎంతో దోహదపడుతుందని చాలా మంది అభిప్రాయం పడుతున్నారు. కానీ మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇప్పట్లో అభివృద్ధి చెందే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రం విడిపోయి పదేళ్ల సమయం దాటుతున్నా కూడా ఇప్పటికీ మన రాష్ట్రానికి రాజధాని లేకపోవడం అనేది దురదృష్టకరం. ఇలా ఉంటే దేశం లోని మిగిలిన రాష్ట్రాలతో పోటీ పడేది ఎప్పుడు అంటూ విశ్లేషకులు వాపోతున్నారు.