ట్యాక్స్ రీఫండ్ ఎలా చెక్ చేసుకోవాలి?

2023-24 సంవత్సరానికి మీరు టాక్స్ పే చేసినట్లయితే మీ టాక్స్ రిఫండ్ స్టేటస్ ఇన్కమ్ టాక్స్ పోర్టల్ లో మీరు తెలుసుకోవచ్చు. ఇంతకుముందు టాక్స్ కట్టిన వాళ్ళు TIN-NSDL వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ పోర్టల్ సపరేట్గా ఓపెన్ చేశారు. రీఫండ్ చేసుకోవడం ఇలా మీరు ఇన్కమ్ టాక్స్ కట్టినట్లయితే. ఇలా మీరు మీ టాక్స్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు. మొదటి స్టెప్: […]

Share:

2023-24 సంవత్సరానికి మీరు టాక్స్ పే చేసినట్లయితే మీ టాక్స్ రిఫండ్ స్టేటస్ ఇన్కమ్ టాక్స్ పోర్టల్ లో మీరు తెలుసుకోవచ్చు. ఇంతకుముందు టాక్స్ కట్టిన వాళ్ళు TIN-NSDL వెబ్సైట్లో చెక్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా మీరు అందులో చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇప్పుడు ఇన్కమ్ టాక్స్ పోర్టల్ సపరేట్గా ఓపెన్ చేశారు.

రీఫండ్ చేసుకోవడం ఇలా

మీరు ఇన్కమ్ టాక్స్ కట్టినట్లయితే. ఇలా మీరు మీ టాక్స్ రిఫండ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.

మొదటి స్టెప్: ఈ ఫిల్లింగ్ పోర్టల్ లోకి ఎంటర్ అవ్వండి.

రెండవ స్టెప్: క్విక్ లింక్ సెక్షన్ లో నో యువర్ రిఫండ్ స్టేటస్ అని కనిపించే వరకు స్క్రోల్ చేయండి. 

మూడవ స్టెప్: మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి, ఏ సంవత్సరం టాక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారా ఆ సంవత్సరాన్ని ఎంటర్ చేయండి, తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 

నాలేగవ స్టెప్: మీ మొబైల్ కు ఒక ఓటిపి వస్తుంది. దాన్ని మీరు ఎంటర్ చేయండి. 

అప్పుడు మీకు మీ రిఫండ్ స్టేటస్ తెలుస్తుంది.

జూలై 2,2023 ప్రకారం దాదాపు 1.32 కోట్ల ఐటిఆర్స్ ఫైల్ అయ్యాయి. అందులో 1.25 కోట్ల మంది ఐ టి ఆర్ లు వెరిఫై అయ్యాయి. ఐ టి ఆర్ కి 11.22 కోట్ల యూజర్స్ ఉన్నారు. దీన్ని ఫిల్ చేసుకోవడానికి చివరి తేదీ జులై 31. చివరి నిమిషంలో ఇబ్బందులు పడకూడదు అంటే ఇప్పుడే వీటిని ఫిల్ చేసుకోవాలని ఐ టి ఆర్ వెబ్సైట్లో సూచిస్తున్నారు. 

అసలు ఏంటి ఈ ఇన్కమ్ టాక్స్? 

మనదేశంలో ప్రతి ఒక్కరూ తమ సంపాదనను బట్టి గవర్నమెంట్ కు టాక్స్ కట్టాల్సి ఉంటుంది. మనకు వచ్చే సొమ్ము మీదనే ఈ టాక్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ టాక్స్ రెగ్యులర్గా కట్టాల్సి ఉంటుంది. ఇన్కమ్ టాక్స్ చాలామంది ఎగ్గొడుతున్నారు. అలాంటి వాళ్ల మీద ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి శిక్షిస్తుంది. మన దేశంలో చాలా బ్లాక్ మనీ ఉంది బ్లాక్ మనీ అంటే ట్యాక్స్ కట్టని డబ్బులు. చాలామంది ధనికులు టాక్స్ ఎగ్గొడుతున్నారు. ఇలా ఎగ్గొట్టడం వల్ల దేశ అభివృద్ధి జరగదు. దీనికి దేశ అభివృద్ధికి సంబంధం ఏంటి అని డౌట్ రావచ్చు. మనం టాక్స్ రూపంలో డబ్బు చెల్లించకుంటే గవర్నమెంట్ నడవదు. అప్పుడు దేశం అప్పుల్లోకి వెళుతుంది. ఇలా అప్పుల్లోకి వెళ్లడం వల్ల వేరే దేశం దగ్గర నుండి అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పుడు కొన్ని రోజుల తర్వాత అప్పు తీర్చలేని పరిస్థితిలో ఆ దేశం చెప్పినట్టు మన దేశం వినాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు రావద్దంటే మనం విధిగా టాక్స్ కట్టాలి. ఒక మంచి పౌరుడిగా దేశాన్ని అభివృద్ధి చేయాలి. దేశ అభివృద్ధి కంటే మనకు కావాల్సింది ఏముంది. మన వల్ల మన దేశం వెనక పడకూడదు. అందుకే టాక్స్ కట్టడం మర్చిపోకండి. టాక్స్ అనేది మీ ఆస్తిని బట్టి ఉంటుంది. మీరు రెగ్యులర్ గా టాక్స్ కట్టడం వల్ల గవర్నమెంట్ లాస్ లోకి వెళ్లదు. ఓ విధంగా మనం కూడా గవర్నమెంట్ కి సాయం చేసిన వాళ్ళం అవుతాం. మన దేశం కోసం అయినా మనం రెగ్యులర్ గా టాక్స్ కడదాం.