పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనేవారు ముందుగా ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..

బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే లోహం ఇది. ఆభరణాలు, పెట్టుబడుల సాధనంగా బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది.‌ ప్రతి సంవత్సరం 800 నుంచి 90 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం.. పెళ్లైనా, పండుగైనా, అక్షయ తృతీయ అయినా ఇలా సందర్భం ఏదైనా సరే వెంటనే బంగారం కొనాల్సిందే.. బంగారం కొనడం వల్ల మీకు లాభదాయకంగా ఉండేలా చూసుకోవాలి కానీ.. బంగారం అమ్మే వారికి  లాభం కలిగేలాగ […]

Share:

బంగారం అంటే ఇష్టం లేనిది ఎవరికి? పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే లోహం ఇది.

ఆభరణాలు, పెట్టుబడుల సాధనంగా బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంది.‌ ప్రతి సంవత్సరం 800 నుంచి 90 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్నాం.. పెళ్లైనా, పండుగైనా, అక్షయ తృతీయ అయినా ఇలా సందర్భం ఏదైనా సరే వెంటనే బంగారం కొనాల్సిందే.. బంగారం కొనడం వల్ల మీకు లాభదాయకంగా ఉండేలా చూసుకోవాలి కానీ.. బంగారం అమ్మే వారికి  లాభం కలిగేలాగ చేయకండి.. బంగారం కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

బంగారం స్వచ్ఛత ఎంతనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి: 

బంగారం స్వచ్ఛతను క్యారెట్‌లతో లెక్కిస్తారు. స్వచ్ఛమైన బంగారం 24 క్యారెట్లు ఉంటుంది. స్వచ్ఛమైన బంగారంతో గోల్డ్‌ కాయిన్స్‌, గోల్డ్‌ బార్స్‌, గోల్డ్‌ బిస్కెట్స్‌ మాత్రమే లభిస్తాయి. అభరణాల తయారీ కోసం ఉపయోగించే బంగారం 22 క్యారెట్‌ కూడా ఉంటుంది. ఎవరైనా అభరణాలు చూపించి ఇవి 24 క్యారెట్‌ అని చెబితే నమ్మి మోసపోవద్దు. 24 క్యారెట్‌ బంగారం అభరణాలు తయారు చేయాలంటే అందులో ఇతర మెటల్స్‌ని కలుపాల్సి ఉంటుంది. అందుకే అభరణాలు 22 క్యారెట్‌తో ఉంటాయి. ఇక 22 క్యారెట్‌ జ్యువెలరీ మాత్రమే కాదు.. 18 క్యారెట్‌ నగలు కూడా ఉంటాయి. ఇందులో బంగారం స్వచ్ఛత తక్కువగా ఉంటుందని గమనించాలి.

18 క్యారెట్‌ నగలనే 22 క్యారెట్‌ అని నమ్మించి మోసం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే నగలను ఎంపిక చేసుకునేటప్పుడు అది 22 క్యారెట్‌ నగలా.. 18 క్యారెట్‌ నగలా అన్న విషయాన్ని తెలుసుకోవడం మంచిది. ఆ నగలపై హాల్‌ మార్క్‌తో పాటు నగల స్వచ్ఛతను చూపించే ముద్ర ఉంటుంది. 22k అని ముద్రించి ఉంటుంది.

బంగారంలో 22 క్యారెట్లు, 24 క్యారెట్లలో తేడాలు ఉంటాయి.

మరికొన్ని జాగ్రత్తలు:

మీరు కొనే బంగారంలో 100 మిల్లీ గ్రాములు తేడా వచ్చినా వందల్లో నష్టపోతారు. బంగారం కొనేటప్పుడు ఎంత రేటుకి ధర వేస్తున్నారో చెక్ చేసుకోవాలి. బంగారం ధర ఇలా లెక్కిస్తారు: 1 గ్రాము బంగారం x బరువు + మేకింగ్ ఛార్జ్/గ్రామ్ + జీఎస్టీ (మేకింగ్ ఛార్జ్ మీద) రాళ్లున్న నగలను గ్యారెంటీ కార్డుపై నమోదు చేయంచాల్సిందే.  బిల్లింగులో బంగారం ధర, వాటికి ఉండే రాళ్ల ధర వేర్వేరుగా ఉండాలి.

బంగారు నగలపై బీఐఎస్‌(బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్లు) మార్కు ఉందా లేదా అని చూసుకోవాలి. ఈ హల్‌ మార్కున్న నగలు కచ్చితంగా 91.6 శాతం శుద్ధమైనవి. హాల్‌మార్క్‌ గుర్తు ఉన్న బంగారన్ని అమ్మితే, దాని విలువకు సమానంగా బంగారం రావాలి. మీరు బంగారం కొనే ముందే ఈ విషయాన్ని అమ్మే వారి దగ్గర క్లారిటీ తీసుకోవాలి. 

అలా ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బంగారానికి బీమా సౌకర్యం కూడా ఉంటుంది. బంగారంలో రాగి ఎక్కువగా ఉంటే గీసినపుడు గీత రాగి రంగులో ఉంటుంది. దానిపై యాసిడ్‌ పోస్తే, రాగిని యాసిడ్‌ కరిగిస్తుంది. అదే బంగారంపై యాసిడ్‌ పోస్తే, బంగారు వర్ణం వస్తుంది. దీంతో ఆ బంగారంలో కల్తీని గుర్తించవచ్చు.

కొనే ఆభరణాలకు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. బిల్లుతో పాటు వారంటీ తీసుకోవడం మరిచిపోకూడదు.