మ్యూచువల్ ఫండ్స్ లో సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ STP అంటే.. గణనీయంగా లాభాలు వస్తాయా?

సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (STP).. మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఇన్వెస్ట్మెంట్ కి ఇదొక పద్ధతి.. ఇది ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ కి.. లేదంటే రెగ్యులర్ గా ఇన్కమ్ రాని వాళ్ళకి.. అంటే నెలకు ఇంత జీవితం కాకుండా సంవత్సరానికి ఎన్ని లక్షలు సంపాదించగలం అనుకునే వారికి ఇది ఉత్తమమైన ఛాయిస్.. ఈ విధంగా డబ్బులు ఎక్కువ ఉన్నవారు లిక్విడ్ ఫండ్, క్యాష్ ఫండ్ లో డబ్బులు పెట్టేస్తుంటారు. బ్యాంక్స్ కి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ […]

Share:

సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (STP).. మ్యూచువల్ ఫండ్ పథకాలలో ఇన్వెస్ట్మెంట్ కి ఇదొక పద్ధతి.. ఇది ముఖ్యంగా బిజినెస్ పర్సన్స్ కి.. లేదంటే రెగ్యులర్ గా ఇన్కమ్ రాని వాళ్ళకి.. అంటే నెలకు ఇంత జీవితం కాకుండా సంవత్సరానికి ఎన్ని లక్షలు సంపాదించగలం అనుకునే వారికి ఇది ఉత్తమమైన ఛాయిస్.. ఈ విధంగా డబ్బులు ఎక్కువ ఉన్నవారు లిక్విడ్ ఫండ్, క్యాష్ ఫండ్ లో డబ్బులు పెట్టేస్తుంటారు. బ్యాంక్స్ కి బదులుగా మ్యూచువల్ ఫండ్స్ లో లిక్విడ్ ఫండ్స్ లో ఈ డబ్బులు పెట్టడం వలన మీకు 3 నుంచి 5 శాతం వరకు ఇంట్రెస్ట్ రావచ్చు.. STP ద్వారా ఈక్విటీ ఫండ్స్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు..

రెండు విధాలుగా STP:

మీరు ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బులు ఉన్నట్లయితే.. మీరు సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ని ఉపయోగించి డెట్ లో పెట్టుబడి పెట్టి.. అక్కడి నుంచి మీకు నచ్చిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలకు నిర్దిష్ట మొత్తలను బదిలీ చేసుకోవచ్చు.. ఇది ఒక విధానం.

మరొక విషయం ఏంటంటే.. మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని నేరుగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాల్లో పెట్టుబడి పెట్టడానికి బదులుగా.. మీ పిల్లల వివాహం, వారి చదువులు, స్వీయ పదవి విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాల కోసం.. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేసుకున్నారు అనుకుందాం. మీరు అదే మొత్తాన్ని కొంత డేట్ ఫండ్ లేదా లిక్విడ్ ఫండ్ లలో పెట్టి .. రూ.లక్ష మీకు నచ్చిన నాలుగు వేరు వేరు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పథకాలకు ఒక్కొక్క పథకంలో ప్రతినెల రూ.25 వేలు చొప్పున ట్రాన్స్ఫర్ చేసేలా ఆప్షన్ ని ఎంచుకోవచ్చు. నాలుగు మ్యూచువల్ ఫండ్ లలో SIP చేసినట్టుగా.. ఈ విధంగా మీరు ఈక్విటీ మార్కెట్లోని అస్థిరతను భర్తీ చేయడంతో పాటు స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల కారణంగా మీరు నష్టపోకుండా ఉండవచ్చు.

వారానికి STP: 

STP లో ఏంటంటే.. వారానికి కూడా STP చేసుకోవచ్చు. మార్కెట్ లో హెచ్చుతగ్గుల కారణంగా కొంతమంది భయపడుతూ ఉంటారు. అటువంటివారు నేరుగా ఈక్విటీ ఫండ్లలో డబ్బులు పెట్టడం రిస్క్. అందుకని ఈ అమౌంట్ ని లిక్విడ్ ఫండ్ లో పెడతాము. ఈ లిక్విడ్ ఫండ్ 3 నుంచి 4 శాతం జనరేట్ చేస్తుంది. ఆ డబ్బులను నిదానంగా ఈక్విటీ ఫండ్ లోకి పంపిస్తాము. చివరికి మనం ఎంచుకున్న సమయానికి లిక్విడ్ ఫండ్లలో సున్నా అయ్యి ఈక్విటీ ఫండ్లలో 100 శాతం అవుతుంది. ఇది మనం ఎక్కువ ప్రాసెస్ కూడా అవదు. ముందుగా పథకాన్ని ఎంచుకునేటప్పుడే ఈ ఆప్షన్ ని పెట్టుకోవచ్చు. STP అనేది లమ్ సమ్ అమౌంట్ తో కూడుకున్నది.