గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్ వంటి అగ్ర అమెరికన్ స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? విదేశీ షేర్లను ఇలా కొనుక్కోవచ్చు

అమెరికా స్టాక్‌లను కొనుక్కోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ మీకు చౌకైన విదేశీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో సహాయపడతాయి. అమెరికన్ టెక్ కంపెనీలు కాకుండా, మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. అమెరికా స్టాక్‌లు కొనాలనుకున్నప్పుడు దేశంలో అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. నేడు అనేక ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి, ఇవి ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు ప్రపంచ వైవిధ్యతను తీసుకురావడానికి అవకాశమిస్తాయి. వీటన్నింటితో పాటు, విదేశాలలో ఇన్వెస్ట్ చేయడానికి సహాయపడే ఎక్స్ఛేంజ్ […]

Share:

అమెరికా స్టాక్‌లను కొనుక్కోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ మీకు చౌకైన విదేశీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో సహాయపడతాయి. అమెరికన్ టెక్ కంపెనీలు కాకుండా, మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.

అమెరికా స్టాక్‌లు కొనాలనుకున్నప్పుడు దేశంలో అందుబాటులో ఉన్న మ్యూచువల్ ఫండ్ల ద్వారా ఇన్వెస్ట్ చేయవచ్చు. నేడు అనేక ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఉన్నాయి, ఇవి ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోకు ప్రపంచ వైవిధ్యతను తీసుకురావడానికి అవకాశమిస్తాయి. వీటన్నింటితో పాటు, విదేశాలలో ఇన్వెస్ట్ చేయడానికి సహాయపడే ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) కూడా ఉన్నాయి. ఇండియన్ ఇన్వెస్టర్ల కోసం అనేక రకాల ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్ని గ్లోబల్ సెక్యూరిటీలలో చురుకుగా నిర్వహించబడే పెట్టుబడులను అందిస్తాయని ఫిస్డమ్ రీసెర్చ్ హెడ్ నిరవ్ కర్కేరా అభిప్రాయపడ్డారు. ETFలు మరియు నిధుల ద్వారా విస్తృత పోర్ట్‌ఫోలియోలను రూపొందించుకోవచ్చు.

ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ లు మీకు చౌకైన విదేశీ పోర్ట్‌ఫోలియోను నిర్మించడంలో సహాయపడతాయి

ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్‌లు వివిధ రంగాలు, గ్లోబల్ థీమ్‌లను అందుకోవడానికి, తక్కువ ధరలో విదేశీ పోర్ట్‌ఫోలియోలు పొందడానికి మార్గం సుగమం చేస్తాయి. యుఎస్ ఆధారిత కంపెనీల స్టాక్స్ కొనడానికి  సులభమైన మార్గం కూడా అందుబాటులో ఉందని రీసెర్చ్ హెడ్ నిరవ్ కర్కేరా చెప్పారు. దీని కోసం, ETFలు లేదా ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ద్వారా.. ముఖ్యంగా అమెరికాలోని పెద్ద పెద్ద  టెక్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయవచ్చు. NASDAQ100 వంటి గ్లోబల్ టెక్- ఆధారిత సూచీలలో పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా చేయవచ్చు. Navi మ్యూచువల్ ఫండ్స్ , Axis మ్యూచువల్ ఫండ్స్ , ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్స్, మోతీలాల్ ఓస్వాల్ మ్యూచువల్ ఫండ్స్, ఇలా దేశంలోని అన్ని అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (AMCలు) అటువంటి ఫండ్‌లలో ఇన్వెస్ట్ చేయడానికి ఆఫర్ చేస్తున్నాయని ఫిస్డమ్ రీసెర్చ్ హెడ్ వివరించారు.

అమెరికన్ టెక్ కంపెనీలే కాకుండా, మరికొన్ని ఆప్షన్స్ ఉన్నాయని నీరవ్ కర్కేరా అన్నారు. అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీలలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీని కోసం, ఇన్వెస్టర్లు మీరా అసెట్ NYSE ఫాంగ్ + ఇటిఎఫ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ వంటి వినూత్నమైన, ఫోకస్డ్ ఫండ్స్ ద్వారా పెట్టుబడి పెట్టాలి. ఇది కాకుండా, మరికొన్ని ఫండ్స్ ఉన్నాయి, 

విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటే ఎన్నో అడ్డంకులు ఎదుర్కోవాల్సి ఉంటుంది

అయితే, ఈ మార్గంలో ఇన్వెస్టర్లు ఎన్నో అడ్డంకులను దాటవలసి ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ రంగం ద్వారా విదేశాలలో మొత్తం 7 బిలియన్ డాలర్ల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.  మ్యూచువల్ ఫండ్ హౌస్‌లో విదేశీ పెట్టుబడి మొత్తం ఒక బిలియన్ డాలర్ల వరకు పెట్టవచ్చు. ఈ పరిమితిని ఉల్లంఘించిన వెంటనే, చాలా ఫండ్ హౌస్‌లు తాజా డిపాజిట్లను స్వీకరించడం మానేస్తాయి. అందువల్ల.. అన్ని ఫండ్ హౌస్‌లు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడిని అంగీకరించవు.

ఏదేమైనప్పటికీ..  లాభాన్నిచ్చే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి నెమ్మదిగా ప్రణాళిక వేసుకుంటూ, తెలివిగా ముందుకు సాగితే, గొప్ప లాభాలు ఆర్జించవచ్చు. అందువల్ల మీకు సరిపోయే మార్గాన్ని ఎంచుకొని సురక్షితంగా పెట్టుబడి పెట్టి, సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి.