గృహరుణంపై ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్.. ఇది తెలుసుకుంటే సొంతింటి కల మీ సొంతం

చిన్నదైనా, పెద్దదైనా సొంతిల్లు ఉంటే చాలు అనేది ప్రతి ఒక్కరి కల. ఒక్క పూట పస్తులుండో, గంజి తాగో సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు. చిన్నదైనా, పెద్దదైన సొంతిల్లు ఉంటే చాలు అనేది ప్రతి ఒక్కరి కల. ఒక్క పూట పస్తులుండో, గంజి తాగో సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు. చిన్న, మధ్య తరగతి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. సొంతిల్లు ఉంటే కొన్నాళ్లకి వచ్చే సంపాదనలో ఎంతో కొంత పొదుపు […]

Share:

చిన్నదైనా, పెద్దదైనా సొంతిల్లు ఉంటే చాలు అనేది ప్రతి ఒక్కరి కల. ఒక్క పూట పస్తులుండో, గంజి తాగో సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు.

చిన్నదైనా, పెద్దదైన సొంతిల్లు ఉంటే చాలు అనేది ప్రతి ఒక్కరి కల. ఒక్క పూట పస్తులుండో, గంజి తాగో సొంత గూట్లో ఉంటే చాలని అందరూ అనుకుంటారు. చిన్న, మధ్య తరగతి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు. సొంతిల్లు ఉంటే కొన్నాళ్లకి వచ్చే సంపాదనలో ఎంతో కొంత పొదుపు చెయ్యచ్చు. లేదంటే జీవితాంతం అద్దెలు కడుతూ జీవనం సాగించాలి‌. అందుకే తమ జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకున్నవారు మొదట ఇల్లు కొనేందుకు ప్రయత్నిస్తుంటారు. మరి కొంతమంది సరైన అవగాహన లేక.. ఎప్పటికీ తమ సొంత ఇంటికలను నెరవేర్చుకోలేరు. ఒక చోట స్థలం కొని దానిలో మన అభివృద్ధికి తగ్గట్టు ఓ ఇల్లు కట్టుకోవడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో పెద్ద ప్రహాసనం.  కానీ.. సొంతింటి కల నిజం చేసుకోవడానికి ఎక్కువమంది హోం లోన్ ద్వారా వారి కలను నిజం చేసుకుంటున్నారు.

ఆర్థిక సంస్థలు, బ్యాంకులు నిర్దేశించిన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వ్యక్తులకు హోం లోన్లు సులభంగా అందుబాటులో ఉన్నాయి. హోమ్ లోన్లు, పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి. హోమ్ లోన్ పై చెల్లించే అసలు మొత్తం,  వడ్డీపై ఆదాయపు పన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద టాక్స్ డిడక్షన్ పొందవచ్చు. 2020 – 21లో హోమ్ లోన్ లపై ఆదాయపు పన్ను రాయితీల పై అన్ని పాత విధానాలు 2024 సంవత్సరం వరకు వర్తిస్తాయని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. హోమ్ లోన్ ఈఎంఐ లో ప్రిన్సిపల్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ అనే రెండు భాగాలు ఉంటాయి. ఇప్పుడు హోమ్ లోన్ ద్వారా లభించే టాక్స్ బెనిఫిట్స్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మొదటిసారి కొనే వారికే డిడక్షన్..

ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 ఈఈఏ ప్రకారం.. మొదటిసారిగా గృహ కొనుగోలుదారు హోమ్ లోన్ కింద చెల్లించిన వడ్డీ పై 1.5 లక్షల వరకు అడిషనల్ డిడక్షన్ ను క్లైమ్ చేయవచ్చు. సెక్షన్ 24 కింద పొందే రెండు లక్షల డిడక్షన్ కంటే ఎక్కువ ఉంటే ఇది అందుబాటులో ఉంటుంది.

హోమ్ లోన్‌తో రెండో ఇంటిని కొనుగోలు చేస్తే, సొంతంగా వినియోగించుకున్నా, అద్దెకు ఇచ్చినా రూ. 1.5 లక్షల వరకు హౌసింగ్ లోన్ ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందవచ్చు. అదేవిధంగా  హోమ్ లోన్ EMIల వడ్డీ భాగంపై సెక్షన్ 80EE కింద గరిష్టంగా రూ.50,000 డిడక్షన్‌ క్లెయిమ్ చేయవచ్చు. ఈ డిడక్షన్‌ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24(బి) కింద వడ్డీ మొత్తంపై క్లెయిమ్ చేసిన దానికంటే ఎక్కువగా ఉంటుంది.

కాగా.. ఇవన్నీ 80EE, 80 EEA సెక్షన్లు హోమ్ లోన్ ఎప్పుడు మంజూరు చేశారనే అనే అంశంపై ఆధారపడి ఉంటాయి. సెక్షన్ 80EE ప్రకారం.. గృహ రుణాలు తప్పనిసరిగా 2013-14, 2014-15, 2016-17 ఆర్థిక సంవత్సరాల్లో మంజూరై ఉండాలి. రుణ మొత్తం రూ.35 లక్షలకు మించకూడదు. ఆస్తి విలువ రూ.50 లక్షలకు మించకూడదు.

సెక్షన్ 80EEAలో.. హోమ్‌ లోన్‌లు తప్పనిసరిగా 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో తీసుకొని ఉండాలి. సెక్షన్ 80EE లోలాగా.. ఇది కూడా మొదటిసారిగా గృహ కొనుగోలుదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికి ఏ ఇంటికీ యజమాని అయి ఉండకూడదు. రెసిడెన్షియల్ హౌస్ ప్రాపర్టీ స్టాంప్ డ్యూటీ విలువ రూ.45 లక్షలు కంటే ఎక్కువ ఉండకూడదు.