అదానీ గ్రూప్ షేర్ల వ‌ల్ల 12 సంస్థ‌ల‌కు లాభం

ఇండియాలో కొన్ని రోజుల నుంచి ఒకటే విషయం మీద చర్చ నడుస్తోంది. బిజినెస్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిగ్గా మారింది. బిజినెస్ చేసే వారు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఈ విషయం గురించి ఆరాలు తీస్తున్నారు. అదే అదానీ గ్రూప్ ఇష్యూ. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదలైన తర్వాత అదానీ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఈ షేర్లు పతనం […]

Share:

ఇండియాలో కొన్ని రోజుల నుంచి ఒకటే విషయం మీద చర్చ నడుస్తోంది. బిజినెస్ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిగ్గా మారింది. బిజినెస్ చేసే వారు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఈ విషయం గురించి ఆరాలు తీస్తున్నారు. అదే అదానీ గ్రూప్ ఇష్యూ. అమెరికాకు చెందిన ప్రముఖ కంపెనీ హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ విడుదలైన తర్వాత అదానీ కంపెనీల షేర్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఈ షేర్లు పతనం అయ్యాయి. ఈ మధ్య కోలుకుని కొద్దిగా గాడిన పడుతున్నాయి. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికలోని విషయాలను అదానీ గ్రూప్ మర్చిపోయినా కానీ దర్యాప్తు సంస్థలు, పలువురు సామాన్యులు మర్చిపోలేకపోతున్నారు. ఆ రీసెర్చ్ లో ఎన్నో సంచలన విషయాలను హిండెన్ బర్గ్ బహిర్గతం చేసింది. దీంతో అనేక మంది సామాన్యులతో పాటు బిజినెస్ మెన్లు కూడా అదానీ కంపెనీని తీవ్రంగా విమర్శించారు. ఇక ఈ నివేదికను అందరూ మర్చిపోతున్న సమయంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నియంత్రణ సంస్థ (సెబీ) కి ఒక విషయాన్ని తెలిపింది. అదానీ కంపెనీలు ఫ్రాడ్ చేశాయన్న ఆరోపణల మీద రీసెర్చ్ చేసిన ఈడీ సెబీకి ఎన్నో విషయాలతో కూడిన రిపోర్టును సబ్మిట్ చేసింది. ఈ రిపోర్ట్ లో ఎన్నో విషయాలను బహిర్గతం చేసింది. 

అవును వారంతా లబ్ధి పొందారు…

అదానీ గ్రూప్ వల్ల లాభాలను పొందిన వారెవరు అనే విషయంలో ఈడీ ప్రాథమిక దర్యాప్తు చేపట్టింది. ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఈడీ తన నివేదికను సెబీకి అందజేసింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు మరియు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు సహా డజను కంపెనీలు షార్ట్ హెవెన్‌లలో అగ్ర లబ్ధిదారులు అని ఈడీ తేటతెల్లం చేసింది. షార్ట్ సెల్లర్స్ అంటే ధరలు తగ్గుతాయని అందరు పెట్టుబడిదారులు నమ్ముతారు. అందుకోసమే వారు తమ వాటాలను తక్కువ ధరకైనా విక్రయించేందుకు ముందుకు వస్తారు. అంతే కాకుండా కొనుగోలు చేసేందుకు కూడా రుణాలు తీసుకుంటారు. ఇలా పెట్టుబడిదారులు తక్కువ ధరలకు క్రయవిక్రయాలు చేయడం వలన లాభాలు వచ్చే అవకాశం ఉంది. 

జూలైలో మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)తో తన ఫలితాలను పంచుకున్న దాని ప్రకారం హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదిక జనవరి 24న ప్రచురించబడింది. ఇందుకు కేవలం 2-3 రోజుల ముందు ఈ షార్ట్ సెల్లర్లలో కొందరు పొజిషన్లు తీసుకున్నారని ఈడీ ఆరోపించింది. అంతే కాకుండా మరికొందరు తొలిసారిగా షార్ట్ పొజిషన్లు కూడా తీసుకున్నారట. 

మూడు ఇండియావే…

అదానీ గ్రూప్ వల్ల లాభపడినట్లు ఈడీ ఆరోపించిన 12 సంస్థల్లో మూడు సంస్థలు ఇండియావేనట. అందులో ఒకటి విదేశీ బ్యాంకు యొక్క ఇండియన్ బ్రాంచ్ ఉందని ఈడీ తెలిపింది. నాలుగు మారిషస్‌లో మరియు ఒక్కొక్కటి ఫ్రాన్స్, హాంకాంగ్, కేమాన్ దీవులు, ఐర్లాండ్ మరియు లండన్‌లో ఉన్నట్లు ఆధారాలు సమర్పించింది. ఇండియాలో బ్యాంక్‌గా పనిచేస్తున్న మరో గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ గ్రూప్ కేవలం రూ. 122 కోట్లు మాత్రమే సంపాదించిందని ఈడీ తెలిపింది. ఈ టాప్ షార్ట్ సెల్లర్స్ లో రెండు భారతీయ కంపెనీలు కూడా ఉన్నాయని ఈడీ ఆరోపించింది. వీటిలో ఒకటి న్యూఢిల్లీలో నమోదు కాగా.. మరొకటి ముంబైలో ఉందని ఈడీ పేర్కొంది. దీని ప్రమోటర్ లు సెబీ పెట్టుబడిదారులను తప్పుదారి పట్టించడమే కాకుండా  స్టాక్ మార్కెట్ మానిప్యులేషన్ కోసం ఆర్డర్ చేశారని తెలిపింది. 

అదానీ గ్రూప్‌కు సంబంధించి రెగ్యులేటరీ వైఫల్యంపై దర్యాప్తు చేసేందుకు మార్చిలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆరుగురు సభ్యుల నిపుణుల కమిటీకి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై సేకరించిన నిఘా మరియు విశ్లేషణలను ఈడీ గతంలోనే సమర్పించింది. వాస్తవానికి, మే 6న సుప్రీం కోర్టుకు సమర్పించింది. ఈ నివేదిక 173 పేజీలతో ఉంది. 

చివరి వారమే తుది నివేదిక

అదానీ గ్రూప్ మీద హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలపై నివేదిక ఇవ్వాలని సుప్రీం గతంలోనే ఆరుగురు సభ్యలతో నిపుణుల కమిటీ వేసింది. ఈ కమిటీ గత వారమే తన పూర్తి నివేదికను అందజేసింది. హిండెన్‌బర్గ్ నివేదిక విడుదల సమయంలో ఈ గ్రూప్ స్టాక్స్ ఏవైనా అసాధారణంగా ఉన్నాయా అని సెబీ వెతకడానికి ప్రయత్నించింది. విచారణ సమయం జనవరి 18-31. రెగ్యులేటర్ బాహ్య ఏజెన్సీలు/ సంస్థల నుండి సమాచారం కోసం చురుగ్గా కొనసాగుతోందని వారు చెప్పారు.