ఇంజనీర్ నుండి బిలియనీర్ వరకూ.. అపూర్వ మెహతా సక్సెస్ ఫుల్ స్టోరి

అపూర్వ మెహతా అమెజాన్‌లో సప్లై-చైన్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఆ తర్వాత ‘ఇన్‌స్టాకార్ట్’ స్ధాపించి బిలియనీర్ అయ్యారు. ఆయన సక్సెస్ ఫుల్, ఇన్‌స్పిరేషన్‌ స్టోరీ గురించి మెహతా లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేశాడు గురించి తెలుసుకుందాం రండి. ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. ఇలాగే అపూర్వ మెహతా కూడా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్‌ ‘ఇన్‌స్టాకార్ట్‌’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే […]

Share:

అపూర్వ మెహతా అమెజాన్‌లో సప్లై-చైన్ ఇంజనీర్‌గా పని చేసేవారు. ఆ తర్వాత ‘ఇన్‌స్టాకార్ట్’ స్ధాపించి బిలియనీర్ అయ్యారు. ఆయన సక్సెస్ ఫుల్, ఇన్‌స్పిరేషన్‌ స్టోరీ గురించి మెహతా లింక్డ్‌ ఇన్‌లో షేర్‌ చేశాడు గురించి తెలుసుకుందాం రండి.

ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తే ఏమొస్తుంది? అదృష్టం బాగుంటే అద్భుతమైన ఐడియా వస్తుంది. ఇలాగే అపూర్వ మెహతా కూడా తన ఇంట్లో ఖాళీగా ఉన్న రిఫ్రిజిరేటర్‌ను చూడడంతో గ్రాసరీ డెలివరీ స్టార్టప్‌ ‘ఇన్‌స్టాకార్ట్‌’ ఐడియా వచ్చి 37 సంవత్సరాల వయసులోనే కోటీశ్వరుడిగా మారాడు. 

అపూర్వ మెహతా, భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త. 2010లో మెహతా సీటెల్‌లో నివసించేవారు. ఆ సమయంలో ఆయన అమెజాన్‌లో సప్లై-చైన్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఏదైనా సొంతంగా వ్యాపారం చేయాలని మెహతాకు ఆశయం ఉండేది. అయితే ఒకటి రెండు వ్యాపారాలు స్టార్ట్‌ చేసి విఫలం అయ్యాడు. ఆ లక్ష్యంతోనే శాన్‌ఫ్రాన్సిస్కోకు మకాం మార్చారు. వ్యాపారం చేయాలనుకున్నారు సరే.. సరైన ఆలోచన అయితే లేదట. మెహతాకు ఎదురుగా ఖాళీ రెఫ్రిజిరేటర్‌ కనిపించింది. తాను తినడానికి అందులో ఏమీ లేవు. అలా ఖాళీ రిఫ్రిజిరేటర్‌ను చూస్తున్నప్పుడు ‘ఇన్‌స్టాకార్ట్‌’ స్టార్టప్‌కు ఐడియా పుట్టింది. దీని కంటే ముందు  లాయర్ల కోసం సోషల్ నెట్ వర్క్, గేమింగ్ పరిశ్రమలు, అడ్వర్టైజింగ్ స్టార్టప్‌లు ఇలా చాలా ఆలోచనలు చేసారు. కానీ చివరకు ‘ఇన్‌స్టాకార్ట్‌’ను 2012లో స్ధాపించారు.

కిరాణా సామాగ్రి తప్ప ఆన్‌లైన్‌లో ఏదైనా షాపింగ్ చేయగలనని గ్రహించినప్పుడు మెహతా ఇన్‌స్టాకార్ట్‌ను స్థాపించాడు. సంస్థ అభివృద్ధి కోసం అపూర్వ మెహతా ఎంతో కృషి చేశారు. ఇన్‌స్టాకార్ట్ అనేది 7.7 మిలియన్ల వినియోగదారులతో, USలో 80,000 కంటే ఎక్కువ రిటైలర్‌ల నెట్‌వర్క్‌తో కిరాణా డెలివరీ కోసం ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ. ఇది ప్రారంభించిన కొత్తలో మెహతానే స్వయంగా ఉబెర్ ద్వారా డెలివరీలు చేసాడట. అలా అతని వ్యాపారం విస్తరించింది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో మెహతా వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందింది.

మెహతా తల్లిదండ్రులు భారత్ నుండి లిబియాకు ఆ తరువాత కెనడాకు వలస వెళ్లినపుడు అనేక కష్టాలు పడ్డారట. చాలా త్యాగాలు చేసారట. తను తన సోదరుడు తమ కుటుంబం కన్న కలలను కొనసాగిస్తామని ఆయన సోషల్ మీడియాలో తన పోస్టులలో చెబుతుంటారు. ప్రతి విజయం వెనుక  చాలా కష్టాలు, బాధలు ఉంటాయి. మెహాతా ఈరోజు ఓ బిలియనీర్‌గా నిలబడటం వెనుక అతను, అతని కుటుంబం ఎదుర్కున్న కష్టాలు ఒక ఎత్తైతే అతని పట్టుదల అతనిని విజయపథం వైపు నడిపించింది.

ఇన్‌స్టాకార్ట్ యాప్ అంటే ఏమిటి?

ఇన్‌స్టాకార్ట్ అనేది రోజు కిరాణా డెలివరీగా నిర్వహించే  ఒక  ఆన్-డిమాండ్ అమెరికన్ టెక్నాలజీ కంపెనీ. 2012లో అపూర్వ మెహతాచే స్థాపించబడింది. ఇది కస్టమర్‌లు కిరాణా షాపింగ్ చేసే విధానంలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, లాస్ ఏంజెల్స్, మయామి, న్యూయార్క్ సిటీ, చికాగో, ఆస్టిన్, వాషింగ్టన్ డిసి, హ్యూస్టన్, అట్లాంటా మరియు యూఎస్ లోని అనేక నగరాలలో నిర్వహిస్తోంది. ఇన్‌స్టాకార్ట్ యాప్‌ని ఉపయోగించడం ద్వారా, కస్టమర్‌లు తమ అన్ని కిరాణా సామాగ్రిని ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చు మరియు తాజా స్థానిక ఉత్పత్తులు, ఆర్గానిక్‌లు, మాంసం, డైరీ, గుడ్లు, పానీయాలు, స్నాక్స్, బల్క్ ఐటెమ్‌లు, డైపర్‌లు, స్నాక్స్, తాజా పువ్వులు మరియు మరిన్నింటిని కిరాణా డెలివరీ యాప్‌ని ఉపయోగించి ఒక్క క్లిక్‌ తో పొందవచ్చు. 

ఇన్‌స్టాకార్ట్‌లో 800కు పైగా జాతీయ, ప్రాంతీయ రిటైల్ బ్రాండ్‌లు భాగస్వాములుగా ఉన్నాయి.అమెరికాలో 85 శాతం మంది, కెనడాలో 90 శాతం మంది ఇన్‌స్టాకార్ట్‌ను ఉపయోగిస్తున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.