అటల్ పెన్షన్ యోజన అంటే అర్థం ఏమిటి ..?

జీవిత కాలం మొత్తం పని చేస్తూ డబ్బులు సంపాదించి ముసలి వయస్సు లో రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకోవాలని కోరుకోవడం ఎవరికైనా సహజమైన విషయమే. పిల్లల మీద ఆధారపడితే ఎదో ఒక సందర్భంగా వాళ్ళ దగ్గర మర్యాదలు లోపమై, మనసు నొచ్చుకొని ఇల్లు వదిలి బయటకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇక అప్పుడు జీవనాదారం కోసం మళ్ళీ పని చెయ్యాల్సి వస్తుంది. ఇక విశ్రాంతి ఎక్కడ..?, అందుకే వృద్ధ వయస్సులో అలాంటి పరిస్థితి రాకూడదని ఇండియన్ ప్రభుత్వం అటల్ […]

Share:

జీవిత కాలం మొత్తం పని చేస్తూ డబ్బులు సంపాదించి ముసలి వయస్సు లో రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకోవాలని కోరుకోవడం ఎవరికైనా సహజమైన విషయమే. పిల్లల మీద ఆధారపడితే ఎదో ఒక సందర్భంగా వాళ్ళ దగ్గర మర్యాదలు లోపమై, మనసు నొచ్చుకొని ఇల్లు వదిలి బయటకి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇక అప్పుడు జీవనాదారం కోసం మళ్ళీ పని చెయ్యాల్సి వస్తుంది. ఇక విశ్రాంతి ఎక్కడ..?, అందుకే వృద్ధ వయస్సులో అలాంటి పరిస్థితి రాకూడదని ఇండియన్ ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అనే పథకం ని ప్రారంభించింది. అటల్ పెన్షన్ యోజన అనగా అసంఘటిత రంగాలలో ఉండే కార్మికులకు పెన్షన్ అందించడం. ఈ పథకం లో కేవలం పెద్ద వాళ్ళు మాత్రమే కాదు, 18 సంవసరాల నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్న ప్రతీ ఒక్కరు పాల్గొనవచ్చు. దీనిని కేంద్ర ప్రభుత్వం 2015 వ సంవత్సరం లోనే ప్రారంభించింది.

అర్హతలు :

అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన అర్హతలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. 

దారకాస్తుదారుడు కచ్చితంగా 18 నుండి 40 సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు అయ్యుండాలి. అంటే ఆ వయస్సు లో ఉన్నవారు 60 వ ఏటా లోకి అడుగుపెడితే ఈ ప్రభుత్వం అందించే పెన్షన్ ని ప్రతీ నెల పొందేందుకు అర్హులు అవుతారు అన్నమాట. అంతే కాకుండా ఒక శాశ్వత మొబైల్ నెంబర్ కూడా కలిగి ఉండాలి. ఈ మొబైల్ నెంబర్ ఎందుకు అంత ముఖ్యం అంటే, యూనిక్ ఐడెంటిఫికేషన్ తో పాటుగా, రిజిస్ట్రేషన్ చేసుకునే సమయం లో కచ్చితంగా ఓటీపీ వివరాలు ఈ మొబైల్ నెంబర్ కి వస్తాయి. అంతే కాకుండా మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడినప్పుడు వెంటనే మెసేజి రూపం లో మనకి తెలియచేసే అవకాశం కూడా ఉంటుంది. అందుకే ఒక శాశ్వత మొబైల్ నెంబర్ కచ్చితంగా అవసరం అవుతుంది అని చెప్పుకొచ్చారు.

ఎలా దరకాస్తు చేసుకోవాలి అంటే :

ఈ పథకం లో చేరాలి అనుకునేవారు, మీ వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ బ్రాంచ్ ని సంప్రదించవచ్చు. ఒక వేల పొదుపు బ్యాంక్ ఖాతా లేనిచో వెంటనే ఒక కొత్త అకౌంట్ ని ఓపెన్ చేసి, దానిని అటల్ పెన్షన్ యోజన కి లింక్ చెయ్యొచ్చు. అంతే కాదు మీకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటే, నేరుగా ఆన్లైన్ లోనే అటల్ పెన్షన్ యోజన కి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఆటో డెబిట్ అనే ఛాయస్ కూడా ఉంటుంది. ఇక ఈ పథకం లో ఒక వ్యక్తి ప్రతీ నెల తాను సంపాదించిన దాంట్లో 1000 నుండి 5000 రూపాయిల వరకు చెల్లించుకోవచ్చు. ఇలా చెయ్యడం ద్వారా కచ్చితమైన పెన్షన్ ని పొందే అర్హత గల వారీగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అలా సేవ్ చేసుకున్న సొమ్ముకి మొత్తానికి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ పథకం ద్వారా 60 సంవత్సరాలు నిండిన తర్వాత ప్రతీ ఒక్కరికి వెయ్యి నుండి 5000 వరకు ప్రతీ నెల పెన్షన్ పొందవచ్చు. ఒక ఖాతాదారుడు చనిపోతే అతని జీవిత భాగస్వామి కి ఈ పెన్షన్ దక్కుతుంది. ఒకవేళ ఇద్దరు చనిపోతే నామినీ కి ఈ పెన్షన్ కార్పస్ మొత్తం చెందుతుంది. ఒకవేళ ఖాతాదారుడు 40 సంవత్సరాల లోపే చనిపోతే, అతని జీవిత భాగస్వామిని ఈ పథకం నుండి తొలగించి మొత్తం కార్పస్ అమౌంట్ ఆమెకి చేరేలా చేస్తుంది ప్రభుత్వం.లేకపోతే ఖాతాదారుడి పేరు తోనే అకౌంట్ ని కొనసాగించే ఛాయస్ కూడా ఇస్తుంది ప్రభుత్వం.