పెరుగుతున్న ఆహార ధరలు కారణాలు ఏమిటి?

రోజు రోజుకి ఆహార పదార్థాల పెరుగుదల ఎక్కువైపోతున్న క్రమం కనిపిస్తోంది. కేవలం టమాటా మాత్రమే కాకుండా ఇతర ఆహారాల సంబంధించిన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గత 15 నెలలు లో చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బనం గరిష్ట స్థాయికి పెరగడం వల్ల ఆహార పదార్థాల రేట్లు పెరిగాయని ద్రవ్య విధాన రూపకర్తలు ఆర్బిఐ ని సూచించడం జరిగింది. రేట్లు పెరగడానికి కారణం:  ఈ క్రమంలోనే, సెంట్రల్ బ్యాంక్ ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని 2 శాతం మరియు 6 శాతం […]

Share:

రోజు రోజుకి ఆహార పదార్థాల పెరుగుదల ఎక్కువైపోతున్న క్రమం కనిపిస్తోంది. కేవలం టమాటా మాత్రమే కాకుండా ఇతర ఆహారాల సంబంధించిన ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. గత 15 నెలలు లో చూసుకున్నట్లయితే ద్రవ్యోల్బనం గరిష్ట స్థాయికి పెరగడం వల్ల ఆహార పదార్థాల రేట్లు పెరిగాయని ద్రవ్య విధాన రూపకర్తలు ఆర్బిఐ ని సూచించడం జరిగింది.

రేట్లు పెరగడానికి కారణం: 

ఈ క్రమంలోనే, సెంట్రల్ బ్యాంక్ ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని 2 శాతం మరియు 6 శాతం మధ్య ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే వినియోగదారులకు ఆహార పదార్థాలు లభించే ధరలు గత నెలలో సుమారు  7.44 శాతం పెరిగింది. మరోవైపు ముఖ్యంగా వాతావరణంలో వచ్చిన తీవ్రమైన మార్పులు కారణంగా, వాతావరణం మీద ముఖ్యంగా ఆధారపడి ఉత్పత్తి అయిన ఆహార పదార్థాలు CPIలో సగం వాటా కలిగి ఉన్నాయో, వాటి ధరలు ఏకంగా 11.51 శాతం  పెరిగినట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా, ఇప్పుడు ఆహార పదార్థాలు పెరుగుతున్న వైనంలో ప్రతి ఒక్కరూ “ఆహార ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే కీలకమైన అంశం” అని ద్రవ్య విధాన కమిటీలోని ఆరుగురు సభ్యులలో ఒకరైన శశాంక భిడే అన్నారు. అంతే కాకుండా, దేశీయ మార్కెట్లో, అదేవిధంగా సామాజిక భద్రతా కార్యక్రమాలకు పెరుగుతున్న సరఫరాలను నిర్ధారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని ఆయన పేర్కొన్నారు. ఇంకా మన భారత ప్రభుత్వం  నుంచి ఇతర దేశాలకు ఎగుమతులయ్యే బియ్యం మరియు పంచదార వంటి ఆహార పదార్థాల సరఫరా తగ్గించాలని, ద్రవయోల్బనాన్ని గరిష్ట స్థాయి నుంచి తగ్గించేందుకు ఉల్లిపాయల ఎగుమతులపై పన్నులు వేసే క్రమంలో పడింది ప్రభుత్వం. అంతేకాకుండా టమాట ధరలను తగ్గించేందుకు నేపాల్ నుంచి టమాటా దిగుమతులను కూడా అనుమతించింది.

ఇంకా చెప్పాలంటే భారతదేశ ప్రభుత్వంలో ధరల పెరుగుదల ఒత్తిడి క్రమాన్ని తగ్గించేందుకు, మరోపక్క ద్రవ్య విధాన కమిటీ ఆగస్టులో మూడవ వరుస రేట్లను మార్చలేదు అని వెల్లడించింది. అయితే ఎన్ని విధాలుగా చూసుకుంటున్నప్పటికీ, రాబోయే రోజుల్లో ఆహార పదార్థాల ధరల పెంపు గురించి కాస్త ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని, ద్రవ్య విధాన కమిటీలోని ఒకరు వెల్లడించారు. 

రుణాల ద్వారా ఆశాభావం: 

భారతదేశ జనాభాలో దాదాపు 65 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారి జీవనోపాధి ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. భిడే రుణావకాశాలు మెరుగుపడటం వల్ల గ్రామీణ డిమాండ్‌లో ఒక మోస్తరు పురోగమనం ఉంటుందని ఆశిస్తున్నారు. రాబోయే నెలల్లో గ్రామీణ డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని గ్రామీణ పరిసరాలలో ఉన్న ప్రజలకు వ్యవసాయ అవసరాలను మరింత మెరుగుపరిచే విధంగా చూసుకోవాలని అవసరం ద్రవ్య విధాన కమిటీలో వర్మ చెప్పారు. 

వాతావరణం కూడా ఒక కారణం: 

ఆహార పదార్థాల పెరుగుదలకు ముఖ్య కారణాలు వర్షాలు క్రమంగా పడకపోవడం. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో, రైతులు వ్యవసాయం చేసేందుకు సరైన సదుపాయాలు లేకపోవడం, వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా రుతుపవనాలు వచ్చినప్పటికీ అనేక గ్రామాలలో వర్షాలు పడకపోవడం, ఇతర దేశాల నుంచి పంటను దిగుమతి చేసుకునే పరిస్థితులు ఏర్పడేలా చేసింది. దీనికి ఉదాహరణ టమాటా పంట అని చెప్పాలి. కేవలం కేజీ 12 రూపాయలు ఉండే టమాటా రేటు ఇప్పుడు సుమారు 250 రూపాయలకు పెరిగింది అంటే కారణం, పంట దిగుబడి లేకపోవడం. అందుకే వచ్చే కొద్ది నెలల వరకు, గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సరైన అడుగులు వేయడం ద్వారా, గరిష్ట స్థాయికి చేరుకున్న ద్రవయోల్బణం నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది అంటున్నారు.