లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు, ఆ కంపెనీలకు బెనిఫిట్

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజు లాభాలు మొదలయ్యాయి.  అంతర్జాతీయ మార్కెట్ లోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలిచాయి. రేట్ల పెంపు విషయంలో ఇకపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ మెతక వైఖరి అవలంబరించొచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్లను పెంచాయి. మరోవైపు షేర్లు రాణించడం ప్రభుత్వ బ్యాంకుల రుణాలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలపై సానుకూల సంకేతాలు మార్కెట్లకు కలిసొచ్చాయి.  ఉదయం 9: […]

Share:

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ముగిశాయి. దీంతో వరుసగా ఏడో రోజు లాభాలు మొదలయ్యాయి.  అంతర్జాతీయ మార్కెట్ లోని సానుకూల సంకేతాలు మార్కెట్లకు వెన్నుదన్నుగా నిలిచాయి. రేట్ల పెంపు విషయంలో ఇకపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ మెతక వైఖరి అవలంబరించొచ్చనే అంచనాలు మార్కెట్ సెంటిమెంట్లను పెంచాయి. మరోవైపు షేర్లు రాణించడం ప్రభుత్వ బ్యాంకుల రుణాలు పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. గత ఏడాది నాలుగో త్రైమాసిక ఫలితాలపై సానుకూల సంకేతాలు మార్కెట్లకు కలిసొచ్చాయి. 

ఉదయం 9: 30 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 254 పాయింట్ల లాభంతో 61,101 వద్ద ట్రేడ్ మొదలైంది నిఫ్టీ 79 పాయింట్లు లాభపడి 17,703 వద్ద కొనసాగుతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ మూడు పైసలు పుంజుకుంది. సెన్సెక్స్ 30 సూచికలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, టాటా మోటార్స్, ఇండియన్ హోటల్స్ బలమైన ధోరణి చూపాయి.  సెన్సెక్స్ సూచికలో కోటక్ మహీంద్రా, బ్యాంక్ టాటా స్టీల్, ఐటీసీ, మారుతి ,బజాజ్ ఫిన్ సర్వీస్, ఎం అండ్ ఎం, ఎస్బిఐ, పవర్ గ్రిడ్ యాక్సిస్ షేర్లు కూడా లాభపడ్డాయి. 

మార్కెట్లోని ఇతర విషయాలకు వస్తే ఇండియాలో ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ అందించే జపాన్ కు చెందిన ఎం యు ఐకానిక్ తో నియోజిన్ కెమికల్స్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో నియోజన్ షేరు ఈరోజు 13. 54 శాతం పెరిగి 1605. 25 దగ్గర ముగిసింది. వరుణ్ బేవరేజ్స్ షేర్లు రేపటితో ఎక్స్ డివిడెండ్ గా మారినాయి. డివిడెంట్ అందజేయడానికి కంపెనీ ఏప్రిల్ 12ను రికార్డు తేదీగా ప్రకటించింది. 

ఈ నేపథ్యంలో కంపెనీ షేర్లు ఈ రోజు 127 శాతం పెరిగి 1431.50 వద్ద స్థిరపడింది.

రాజస్థాన్ ఎక్స్‌ప్లోజెస్ అండ్ కెమికల్స్ పూర్తి వ్యాపారాన్ని సోలార్ ఇండస్ట్రీస్ ఇండియా కొనుగోలు చేసింది. దీంతో సోలార్ ఇండస్ట్రీ షేర్ ఈరోజు 257% పొందుకొని 38.20 దగ్గర ఆగిపోయింది. 

సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపుదలను నిలిపివేస్తాయన్న ఆశతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌లు ఊపందుకున్నాయి. దీంతో దేశీయ  మార్కెట్లు పుంజుకున్నాయి. జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ 1 శాతం పెరిగింది. హాంకాంగ్ హాంగ్ సెంగ్ కూడా పెరిగింది. యూరోపియన్ మార్కెట్‌ లోనూ బుల్లిష్ వాతావరణం నెలకొంది. మార్కెట్లు ముగిసే నాటికి NSE సూచీలో కోటక్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, నెస్లే, బీపీసీఎల్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి, దివీస్ ల్యాబ్స్ కంపెనీల షేర్లు లాభాల్లో టాప్ గెయినర్స్‌ గా నిలిచాయి. ఈ వారం ఐటీ కంపెనీలు తమ 4వ త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్న తరుణంలో అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. మార్కెట్ క్లోజింగ్ నాటికి టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, టాటా కన్జూమర్, ఎల్ టి, టైటాన్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, బ్రిటానియా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్స్‌గా నిలిచాయి.