విలీనం తర్వాత  హెచ్డీఎఫ్సీ ఆస్తుల విలువ 18 లక్షల కోట్లు

హెచ్డీఎఫ్సీ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం అధికారికంగా పూర్తి అయ్యింది. దీంతో హెచ్డీఎఫ్సీ  సంస్థ ప్రపంచం లోనే అతి పెద్ద బ్యాంక్స్ లో నాల్గవ స్థానం లో నిల్చింది. దీంతో 44 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగియున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కనుమరుగు అయ్యింది. అయితే విలీనం తర్వాత సంస్థ సైజు ఎంత పెరిగింది, ఆస్తులు ఎంత పెరిగాయి, ఉద్యోగుల సంఖ్య పెరిగిందా తిరిగిందా?, ఆస్తులు ఎంత మిగిలాయి?, ఈ కంపెనీ ని నమ్మి డిఫాజిట్స్ చేసిన కస్టమర్స్ […]

Share:

హెచ్డీఎఫ్సీ మరియు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలీనం అధికారికంగా పూర్తి అయ్యింది. దీంతో హెచ్డీఎఫ్సీ  సంస్థ ప్రపంచం లోనే అతి పెద్ద బ్యాంక్స్ లో నాల్గవ స్థానం లో నిల్చింది. దీంతో 44 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర కలిగియున్న హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ కనుమరుగు అయ్యింది. అయితే విలీనం తర్వాత సంస్థ సైజు ఎంత పెరిగింది, ఆస్తులు ఎంత పెరిగాయి, ఉద్యోగుల సంఖ్య పెరిగిందా తిరిగిందా?, ఆస్తులు ఎంత మిగిలాయి?, ఈ కంపెనీ ని నమ్మి డిఫాజిట్స్ చేసిన కస్టమర్స్ పరిస్థితి ఏమిటి?, ఇలాంటి వాటి అన్నిటికి ఇప్పుడు సమాదానాలు చూద్దాము. ప్రపంచం లోనే టాప్ 3 స్థానాల్లో ఉన్న బ్యాంక్స్ లిస్ట్ తీస్తే జేపీ మోర్గాన్ చేస్ అండ్ కో , ఇండస్ట్రియల్ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ చైనా లిమిటెడ్ మరియు బ్యాంక్ ఆఫ్ అమెరికన్ కార్పొరేషన్ ఉన్నాయి. ఈ బ్యాంకుల తర్వాత నాల్గవ స్థానం లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిల్చింది.

విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ ఆస్తుల విలువ 18 లక్షల కోట్లు

ఇక విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ ఈక్విటీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం 172 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇక విలీనం అయిపోయిన హెచ్డీఎఫ్సీ  లిమిటెడ్ సంస్థ వ్యాపారం విలువ మార్చి 2023 వ సంవత్సరం నాటికి  41 లక్షల కోట్ల రూపాయిల వరకు ఉంటుంది.విలీనం తర్వాత సంస్థ యావరేజి విలువ 4.14 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్  స్థిరాస్తుల విలువ 18 లక్షల కోట్ల రూపాయిలు విలీనం తర్వాత మిగిలిందని అంటున్నారు. విలీనం తర్వాత హెచ్డీఎఫ్సీ కంపెనీ కి సంబంధించిన స్టాక్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. దీనితో ఆర్థిక వ్యవస్థలోకి ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి సంస్థ ముందుకు వస్తుంది. మౌలిక సదుపాయాల రుణాల దగ్గర నుండి, ఎంత పెద్ద రుణాలను అయినా ఇచ్చేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సిద్ధం గా ఉంది. తద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థని పెంపొందిస్తూ, ఉపాధి అవకాశాలకు దారి చూపేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ  సంస్థ పేర్కొంది.

అక్షరాలా 12 కోట్ల మంది కస్టమర్లు :

ఇక విలీనం తర్వాత రెండు సంస్థల ఉమ్మడి లాభాలను ఒక్కసారి లెక్కగడితే 60000 కోట్ల రూపాయలకు తేలిందని తెలుస్తుంది. ఇక స్టాక్ మార్కెట్ లో కూడా విలీనం తర్వాత షేర్స్ సూచీల వెయిటేజీ బాగా పెరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెయిటేజీ 10.4 శాతం ఉండగా, హెచ్డీఎఫ్సీ ఉమ్మడి సంస్థల వెయిటేజీ 14 శాతానికి పైగా పెరిగింది. విలీనం తర్వాత ఇక నుండి హెచ్డీఎఫ్సీ  లిమిటెడ్ సంస్థ లో పని చేసే ఉద్యోగులు మొత్తం ఇప్పుడు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగులుగా పరిగణించబడుతారు. ఇక రెండు సంస్థలు కలిసిన తర్వాత కస్టమర్ల సంఖ్య 12 కోట్ల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే జెర్మనీ దేశం మొత్తం జనాభా కూడా అంత ఉండదు అన్నమాట. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ ఉమ్మడి సంస్థల నుండి పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,77,000 కంటే ఎక్కువ ఉంటుందట. బ్రాంచీల సంఖ్య కూడా 8300 కి పెరుగుతాయి. మొత్తానికి హెచ్డీఎఫ్సీ  సంస్థల విలీనం అనేది భారతదేశ కార్పొరేట్ చరిత్ర లోనే అతిపెద్ద లావాదేవిగా నిల్చింది.హెచ్డీఎఫ్సీ లో 25 షేర్లను కలిగియున్న వాటాదారులు ఉన్నారు. వీరికి 42 హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్స్ దక్కనున్నాయి. విలీనం తర్వాత ప్రపంచం లోనే అతి పెద్ద బ్యాంక్స్ లో నాల్గవ స్థానం లో నిల్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రాబొయ్యే రోజుల్లో ఆర్థిక వ్యవస్థ లో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందో చూడాలి.