ఈ 2023-24 ఆర్ధిక సంవత్సరం ప్రథమార్థంలో రూ. 8.88 లక్షల కోట్ల ఋణం తీసుకోవాలని ప్రభుత్వ యోచన

31,000 నుండి 39,000 కోట్ల రూపాయల వరకు 26 వారాల్లో పలు విడతలుగా తీసుకున్న  ఋణాలను చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ. 8.88 లక్షల కోట్ల ఋణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత దేశ సెంట్రల్ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తరువాత..  ప్రభుత్వం ఈ రుణ ప్రణాళికను ఖరారు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖా తెలియజేసింది. కాగా.. […]

Share:

31,000 నుండి 39,000 కోట్ల రూపాయల వరకు 26 వారాల్లో పలు విడతలుగా తీసుకున్న  ఋణాలను చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.

2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో రూ. 8.88 లక్షల కోట్ల ఋణం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. భారత దేశ సెంట్రల్ బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సంప్రదించిన తరువాత..  ప్రభుత్వం ఈ రుణ ప్రణాళికను ఖరారు చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖా తెలియజేసింది. కాగా.. 2024 ఆర్థిక సంవత్సరానికి 15.32 లక్షల కోట్ల రూపాయల స్థూల మార్కెట్ ఋణాన్ని కూడా కేంద్రం అంచనా వేసింది.  దీంట్లో సుమారు 57.55 శాతం మొదటి ఆరు నెలల్లో ఋణంగా తీసుకోవాలని ప్రణాళిక ఖరారు చేసినట్టు మంత్రిత్వ శాఖా పేర్కొంది.

31,000 నుండి 39,000 కోట్ల రూపాయల మధ్య  26 వారాల్లో పలు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఋణాలను పూర్తిగా చెల్లించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 3, 5, 7, 10, 14, 30 మరియు 40 సంవత్సరాలకు సంబంధించిన సెక్యూరిటీల ద్వారా ఋణాలు తీసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 

వివిధ మెచ్యూరిటీల కింద ఋణం తీసుకోవడంపై చార్ట్ ఈ విధంగా ఉంది:

  • 3 సంవత్సరాలు – 6.31%
  • 5 సంవత్సరాలు – 11.71%
  • 7 సంవత్సరాలు – 10.25%
  • 10 సంవత్సరాలు – 20.50%
  • 14 సంవత్సరాలు – 17.57%
  • 30 సంవత్సరాలు – 16.10%
  • 40 సంవత్సరాలు – 17.57%

సెకండ్ హాఫ్‌లో సావరిన్ గ్రీన్ బాండ్ల జారీని ప్రకటిస్తారు. రెడింప్షన్ ప్రొఫైల్‌ను సున్నితంగా చేయడానికి ప్రభుత్వం స్విచ్ ఆపరేషన్‌లను కొనసాగిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక వేలం నోటిఫికేషన్‌లో సూచించిన ప్రతి సెక్యూరిటీకి అదనంగా రూ. 2,000 కోట్ల వరకు అదనపు సబ్‌స్క్రిప్షన్‌ను కంటిన్యూ చెయ్యడానికి గ్రీన్‌షూ ఆప్షన్‌ను కూడా కేంద్రం కొనసాగిస్తుందని తెలిపింది. 

2024 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, ట్రెజరీ బిల్లుల జారీ ద్వారా వీక్లీ ఋణం రూ. 32,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేసింది. ఇక ఈ త్రైమాసికంలోనే రూ. 1.42 లక్షల కోట్ల నికర ఋణం తీసుకోబడుతుందని పేర్కొంది. మరోవైపు  2023 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నికర ఋణాలు రూ. 2.40 లక్షల కోట్లుగా ఉన్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. 

ఈ త్రైమాసికంలో నిర్వహించే ప్రతి వారం వేలం ద్వారా 91 డీటీబీల కింద రూ.12,000 కోట్లు, 182 డీటీబీల కింద రూ.12,000 కోట్లు, 364 డీటీబీల కింద రూ.8,000 కోట్లు విడుదల చేయనున్నట్లు సదరు మంత్రిత్వ శాఖ పేర్కొంది.

ప్రభుత్వ ఖాతాలలో తాత్కాలిక అసమతుల్యతలను నిర్వహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..  2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల  కోసం వేస్ అండ్ మీన్ అడ్వాన్సెస్ (WMA) పరిమితిని రూ. 1,50,000 కోట్లుగా నిర్ణయించింది.