ఉచిత స్నాక్స్ మరియు ఇతర ఫ్రీ సర్వీసెస్ నిలిపివేసిన Google

అనేక కంపనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ యూడీగులను తొలిగించగా, మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు తగ్గిస్తున్నాయి. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉద్యోగులకు అందించే ఉచిత భోజనం, లాండ్రీ సేవలు, మసాజ్‌లు మరియు స్నాక్స్‌లను తగ్గించాలని లేదా నిలిపివేయాలని నిర్ణయించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు. అనేక కంపనీలు […]

Share:

అనేక కంపనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ యూడీగులను తొలిగించగా, మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు తగ్గిస్తున్నాయి.

టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. ఖర్చులను తగ్గించుకోవడానికి, ఉద్యోగులకు అందించే ఉచిత భోజనం, లాండ్రీ సేవలు, మసాజ్‌లు మరియు స్నాక్స్‌లను తగ్గించాలని లేదా నిలిపివేయాలని నిర్ణయించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ ఉద్యోగులకు రాసిన లేఖలో పలు విషయాలను ప్రస్తావించారు.

అనేక కంపనీలు తమ ఖర్చులు తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఎంచుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు తమ యూడీగులను తొలిగించగా, మరికొన్ని కంపెనీలు తమ ఉద్యోగుల జీతాలు తగ్గిస్తున్నాయి. ఏకంగా ఆపిల్ కంపెనీ సీఈఓ తన జీతాన్ని కూడా తగ్గించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే గూగుల్ తన ఖర్చు తగ్గించే చర్యలను ప్రారంభించింది.  కొన్ని రోజుల క్రితమే ఉద్యోగుల్ని తొలిగించిన గూగుల్.. తన  ఉద్యోగులకు అందించే ప్రయోజనాల ధర గణనీయంగా పెరిగింది. కాబట్టి కంపెనీ తన అధిక ఖర్చులను తగ్గించాలని యోచిస్తోంది.

మైక్రో కిచెన్‌లు, లాండ్రీ సేవలు, మసాజ్‌లు మరియు బిజినెస్ లంచ్‌ల నుండి కాంప్లిమెంటరీ స్నాక్స్‌తో సహా Googleలో అనేక పెర్క్‌లు తగ్గించబడ్డాయని నివేదికలు తెలిపాయి.

ఖర్చులను ఆదా చేయడానికి, Google చేపట్టనున్న నియామక నిర్ణయాలను కూడా ఆలస్యం చేస్తుంది. బిజినెస్ ఇన్‌సైడర్ కథనం ప్రకారం.. గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ.. అధిక ప్రాధాన్యత కలిగిన పనిపై దృష్టి పెట్టడానికి కంపెనీ తన నిధులను తెలివిగా ఉపయోగించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

శుక్రవారం నాడు Google ఉద్యోగులకు పోరాట్ ఒక లెటర్ రాసారు.  ఈ లెటర్ ఇన్‌సైడర్‌కి లభించినది. అధిక ప్రాధాన్యత గల ప్రాజెక్ట్‌లలో పని చేయడానికి బృందాలను నియమించుకోవడం, తిరిగి కేటాయించడం చేస్తే వ్యాపారం మందగిస్తుందని ఆ లేఖలో పోరాట్ పేర్కొన్నారు.

ఈ ఖర్చు తగ్గింపులలో భాగంగానే కార్పొరేషన్ ల్యాప్‌టాప్‌ల వంటి వ్యక్తిగత సాంకేతికతపై పెట్టుబడిని నిలిపివేసినట్టు పోరాట్ పేర్కొన్నారు. ప్రయోజనాలకు సంబంధించిన సర్దుబాట్లు ప్రతి ఆఫీస్ సైట్ యొక్క అవసరాలు, అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని పోరాట్ తెలిపారు.

తక్కువ యాక్టివిటీ ఉన్న రోజుల్లో మైక్రో కిచెన్‌ని మూసివేయాలని, కొన్ని వ్యాయామ తరగతుల సమయాలను సర్దుబాటు చేయాలని Google పరిశీలిస్తోంది. ఈ మార్పులు Google ఉద్యోగులకు ముఖ్యమైనవిగా అనిపించినప్పటికీ, వాటికి ఉపయోగించే ఖర్చులే ఇతర ముఖ్యమైన వాటికి సర్దుబాటు చేయవచ్చని గూగుల్ భావిస్తుంది. 

ఉచిత స్నాక్స్, లాండ్రీ సేవలు, మసాజ్‌లు మరియు బిజినెస్ ఫుడ్ వంటి Google అందించే విస్తృత శ్రేణి ప్రయోజనాలు పని చేయడానికి కావాల్సిన ప్రదేశంగా మార్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సహా దాని ప్రధాన లక్ష్యాలపై తగు వనరులను కేంద్రీకరించడానికి గూగుల్ తన వర్క్‌ఫోర్స్‌ను దాదాపు 6%  అంటే దాదాపు 12,000 మంది కార్మికులకు తగ్గించనున్నట్లు కంపెనీ CEO అయిన సుందర్ పిచాయ్ ఈ సంవత్సరం ప్రారంభంలోనే ప్రకటించారు.

ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ Google ప్రతినిధి ర్యాన్ లామాన్ ఇలా అన్నారు: “మేము పేర్కొన్నట్లుగా, ఎక్కువ వేగం మరియు సామర్థ్యం ద్వారా శాశ్వత సేవింగ్స్ సాధించడం మా వ్యాపార లక్ష్యం, దీనిలో భాగంగానే పరిశ్రమ ప్రముఖ ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు మరియు సౌకర్యాలను అందిస్తూనే మా వనరులను మెరుగ్గా నిర్వహించడానికి మేము కొన్ని ఆచరణాత్మక మార్పులు చేస్తున్నాము” అని పేర్కొన్నారు.